Posts

Showing posts from March, 2025

Chaitra Masam 2025: చైత్రమాసంలో పండుగలు, విశేషమైన తిధులు

Image
చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసి ఉండే రోజు కావున ఈ నెలకు చైత్ర మాసమని పేరు వచ్చింది. వసంత ఋతువు ఆగమనాన్ని సూచించే చైత్ర మాసంలో ఎన్నో పండుగలు, మరెన్నో విశేష తిధులు ఉన్నాయి. వసంత ఋతువులో తొలి మాసం, తెలుగు సంవత్సరంలో మొదటి నెల చైత్రమాసం. చైత్రమాసం అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉగాది, శ్రీరామనవమి, హనుమజ్జయంతి వంటి విశేష పర్వదినాలు. ఇవి కాకుండా ఈ మాసంలో ఎన్నో పండుగలు, పుణ్య తిధులు ఉన్నాయి. చైత్రమాసం ఎప్పటి నుంచి? మార్చి 30వ తేదీ ఆదివారం నుంచి చైత్రమాసం మొదలై తిరిగి ఏప్రిల్ 27 వ తేదీ ఆదివారం అమావాస్యతో చైత్రమాసం ముగుస్తుంది. చైత్రమాసంలో ముఖ్యమైన తిథులు & పండుగలు మార్చి 30వ తేదీ ఆదివారం చైత్ర శుద్ధ పాడ్యమి: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ. తిరుమల శ్రీవారి ఆస్థానంలో కొలువు. మార్చి 31వ తేదీ సోమవారం చైత్ర శుద్ధ విదియ: బాలేందు వ్రతం, చంద్రోదయం. ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం చైత్ర శుద్ధ తదియ: సౌభాగ్య గౌరీవ్రతం, పార్వతి పరమేశ్వరుల డోలోత్సవం ఏప్రిల్ 2వ తేదీ బుధవారం చైత్ర శుద్ధ చవితి: గణేశ దమనపూజ ఏప్రిల్ 3వ తేదీ గురువారం చైత్ర శుద్ధ పంచమి/ షష్టి: శ్రీలక్ష్మి జయంతి, మత్స్యజయంతి, స్కంద దమనపూజ ఏప్ర...

Dwadasa Namalu: కేశవాది ద్వాదశ నామాలు

Image
భగవంతుని సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడానికి కొంత సమయం పడుతుంది. ఆ మాత్రం పారాయణం చేసే శక్తి, సమయం లేనివారికోసం అష్టోత్తరశతనామ స్తోత్రాలు ఉన్నవి. ఆలయాల్లో, గృహాల్లో అర్చన చేసేటప్పుడు ఈ స్తోత్రాలే ఉపయోగింపబడుతున్నవి. వీనిని చెప్పుకోవడానికి ఒక పది నిమిషాలు పట్టవచ్చు. అయితే, ఇంకా సులభంగా, తక్కువ సమయంలో భగవన్నామాలను అనుసంధానం చేయడం కోసం ఉన్నవే భగవంతుని 'కేశవాది ద్వాదశనామాలు. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర' అనే నామాలే ఈ 12 నామాలు. ఈ 12 నామాలు పలుచోట్ల ఉపయోగపడు తున్నాయి. ఉత్తరభారతంలో అయితే, ఈ 12 నామాలే సంవత్సరంలోని 12 మాసాలకు పేర్లుగా వ్యవహరింప బడుతున్నాయి. ఈ క్రమంలో మార్గశిరమాసమే 'కేశవ' నామంతో వ్యవహరింపబడే మొదటి మాసం. ఈ మాసం నుండి ఆరంభించి క్రమంగా 12 నెలలు 12 నామాలతో నిర్దేశింపబడుతున్నాయి. చివరి మాసం అయిన కార్తికమాసం 'దామోదర’మాసమని పిలువబడుతున్నది. మన ఇళ్లలో భగవదారాధన చేసేటప్పుడు. మంత్రపుష్ప సమయంలో ఈ పన్నెండు నామాలతో ఆరంభించి అర్చన చేయడం, చివరిలో కూడా ఈ 12 నామాలను చెప్పడం సంప్రదాయంగా వస్తున్నది. భగవదాలయాలలో ...

Tirumala Ugadi Asthanam: తిరుమల - ఉగాది ఆస్థానం

Image
ప్రతి సంవత్సరం ఉగాది పండుగనాడు తిరుమలలో శ్రీవారికి ఉగాది ఆస్థానం జరుగుతుంది.  ఆ రోజు ఉదయం మొదటి గంట నివేదన తరువాత శ్రీ మలయప్ప స్వామివారు దేవేరులతో కూడా సర్వభూపాలవాహనంలో బంగారు వాకిలి ముందు వేంచేస్తారు.  విశ్వక్సేనులవారు పక్కన దక్షిణాభిముఖంగా మరొక పీఠంపై వేంచేస్తారు.  పట్టువస్త్ర సమర్పణ, ప్రసాద నివేదన తరువాత పంచాంగ శ్రవణం జరుగుతుంది.  ఆనాటి తిధి, వార నక్షత్రాలతో పాటు దేశకాల  వ్యవహారాల పంచాంగ వివరాలను శ్రీవారికి వినిపించడం జరుగుతుంది.  కర్పూర నీరాజనాలతో ఆస్థానం ముగుస్తుంది. 

Sriramanavami in Tirumala: తిరుమలలో శ్రీరామనవమి ఆస్థానం

Image
తిరుమలలో చైత్రశుద్ధ నవమి శ్రీరాముని జన్మదినమైన శ్రీరామనవమిరోజు విశిష్ట ఉత్సవంగా జరుపబడుతున్నది. ఆ ఉత్సవాన్నే "శ్రీరామనవమి ఆస్థానం” అంటారు. శ్రీరామనవమి పండుగరోజున ఉదయం ఆనంద నిలయంలో ప్రతిరోజు మాదిరే సుప్రభాతం జరిగిన తర్వాత భోగశ్రీనివాసమూర్తికి, శ్రీవేంకటేశ్వరస్వామివారి మూల విరాణ్మూర్తి బంగారుపాదపద్మాలకు ఆకాశగంగా తీర్థజలాలతో అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత ప్రత్యేకంగా శ్రీసీతారామ లక్ష్మణ హనుమంతుని పంచలోహ ఉత్సవమూర్తులకు కూడ ఏకాంతంగా అభిషేకం జరుపబడుతుంది. అభిషేకం అయిన తర్వాత ఈ శ్రీరాముని విగ్రహాలకు పట్టువస్త్రాలతో, విశేష ఆభరణాలతో, పుష్పమాలలతో అలంకారం జరుగుతుంది. శ్రీరామనవమినాటి సాయంత్రం బంగారువాకిలిముందు శ్రీసీతారామలక్ష్మణుల మూర్తులను ఒక పల్లకిపై వేంచేపు చేసి సర్వాభరణాలతో, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరిస్తారు. పిదప మరొక పీఠంపై హనుమంతుని కూడా వేంచేపు చేస్తారు. శ్రీరామనవమి పండుగ సాయంత్రం శ్రీరాములవారిని మాత్రం బంగారు హనుమద్వాహనంపై వేంచేపు చేసి తిరుమల పురవీధుల్లో ఊరేగింపు జరుగుతుంది. ఉత్సవానంతరం ఆలయంలో బంగారువాకిలి దగ్గర బంగారుసర్వభూపాలవాహనంలో శ్రీసీతారామలక్ష్మణులకు, ఆస్థానం జరుగుతుంది. వీరి...

Nagalapuram Vedanarayana Swamy Temple: శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం - నాగలాపురం

Image
  చిత్తూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో వేదనారాయణ స్వామి ఆలయం ఒకటి. ఇది చిత్తూరు జిల్లా నాగలాపురంలో ఉంది. ఆలయ విశిష్టత నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయాన్ని పల్లవుల కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఈ ఆలయంలో సాక్షాత్తూ గోవిందుడు మత్స్యావతారంలో వెలసి ఉండడం విశేషం. బ్రహ్మాండ పురాణం ప్రకారం త్రిమూర్తుల్లో విష్ణువు లోకపాలకుడు. దుష్ట శిక్షణా శిష్ట రక్షణ కోసం ఎన్నో అవతారాలను ధరించాడు. వాటిల్లో మొదటి అవతారం వేదాలకు పునర్జన్మను ప్రసాదించిన మత్స్యావతారం. అయితే స్వామి మత్స్యరూపంలోనే స్వయంభువుగా వెలసిన క్షేత్రం చిత్తూరులోని నాగలాపురం. ఇక్కడ స్వామి వారు శ్రీదేవీ భూదేవీ సమేతుడై కొలువుదీరి పూజలందుకుంటున్నాడు. స్థల పురాణం మనిషి పుట్టుక నుంచి మరణం వరకూ ధర్మబద్ధంగా ఎలా జీవించాలో నిర్దేశించిందే వేదం. అలాంటి వేదాలను సంరక్షించడానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారమే మత్స్యావతారం. సోమకాసురడనే రాక్షసుడు బ్రహ్మ దేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్ర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. వేదాలు లేకుండా జీవసృష్టి చేయడం కష్టమని భావించిన బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలతో కలిసి వైకుంఠపురం చేరుకుంటాడు. జరిగిన విషయాన్ని విన్నవిం...

Thiruparankundram Murugan Temple: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం - తిరుప్పరంకుండ్రం

Image
తిరుప్పరంకుండ్రం తమిళనాడులో గల మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో రెండవది తిరుప్పరంకుండ్రం. ఈ క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవసేనతో కల్యాణం జరిగింది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చుని దర్శనమిస్తారు. మిగతా అన్నిచోట్ల స్వామి నిలబడిన మూర్తినే మనం చూస్తాం. ఆలయ స్థల పురాణం సుబ్రహ్మణ్యుడి భార్యలు అయిన శ్రీ వల్లి, దేవసేనలు ఇద్దరూ శ్రీ మహా విష్ణువు కుమార్తెలు. వీరి అసలు పేర్లు అమృత వల్లి, సుందర వల్లి. ఒక రోజు వల్లి, దేవసేనలు ఇద్దరూ సుబ్రహ్మణ్యుడి వద్దకు వచ్చి వారిని కల్యాణం చేసుకోమని అడుగుతారు. స్వామి అమృత వల్లితో “నిన్ను ఇంద్రుడు తన కూతురిగా పెంచుతాడు. తరువాత కాలంలో నిన్ను వివాహం చేసుకుంటాను" అని అభయం ఇస్తారు. అలాగే సుందర వల్లిని కూడా అనుగ్రహిస్తారు స్వామి. ఇంద్రుని కలిసిన అమృతవల్లి కొంతకాలం తర్వాత అమృత వల్లి చిన్న ఆడ శిశువుగా మారి, మేరు పర్వతం దగ్గరకి వెళ్లి, ఇంద్రుడిని కలిసి "నేను శ్రీ మహా విష్ణువు కుమార్తెను, నన్ను పెంచ...

Gundalakona Temple: గుండాలకోన ఆలయం

Image
చుట్టూ పచ్చిక బయళ్లు, ఆపై జలజల పారే సెలయేళ్లు, కడప జిల్లాలోని చిట్వేలి మండలంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన గుండాలకోనలో గుండాల ఈశ్వరుడు ఎండ్రకాయ రూపంలో ప్రత్యక్షంగా దర్శనం ఇస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చిట్వేలి మండలం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో కొండ కోనల నడుమ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఈ గుండాల కోన ఉంది. ఏడాది పొడుగునా జలకళ గుండాలకోనలోకి సుమారు 30 అడుగుల ఎత్తు నుంచి నీరు ఉద్ధృతంగా వచ్చి చేరుతుంది. గుండాల కోనలో వర్షాకాలంలోనేకాదు, వేసవికాలంలో కూడా నీరు పుష్కలంగా ప్రవహిస్తుంది. ఇప్పటి వరకు ఈ గుండం లోతు చూసిన వారు లేరని స్థానికుల కథనం. గుండాల కోన విశిష్టత ఏడాది పొడుగునా సందర్శకులతో రద్దీగా ఉండే ఈ క్షేత్రాన్ని కార్తీక మాసంలోనూ, శివరాత్రి పర్వ దినాలలోనూ భక్తులు విశేషంగా దర్శిస్తారు. విశ్వామిత్ర ప్రతిష్ఠిత లింగం విశ్వామిత్రుడు ప్రతిష్ఠించిన గుండాలేశ్వరస్వామి ఆలయ ప్రాంతమే గుండాల కోనగా ప్రసిద్ధి చెందింది. మహిమాన్వితం గుండాలకోన ఈ గుండంలో మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని, దెయ్యాలు వదులుతాయని, సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ గుండం పక్కనే గుహ ఉంటుంది. ఈ గుహలో గుండాల ఈశ్వరుడు ఎండ్రకాయ రూపంల...

Papmochani Ekadasi: పాపమోచని ఏకాదశి

Image
  ఉగాదికి ముందు ఫాల్గుణ మాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశినే పాపవిమోచని ఏకాదశి అంటారు. దీనినే దీనినే పాప నాశని ఏకాదశి అని కూడా అంటారు. అంటే పాపాలను తొలగించే ఏకాదశి అని అర్ధం. పూర్వం మేధావి అనే మహర్షి తపస్సు చేసుకుంటుంటే ఇంద్రుడి ఆదేశానుసారం మంజుఘోష అనే అప్సరస తన నాట్యంతో ఆయనకు విఘ్నం కలిగించిందంట. ఆమె నాట్యానికి చలింలిచిన మేధావి తన తపస్సుకి విఘ్నం కలిగించిందన్న ఆగ్రహంతో ఆ మంజుఘోషకి రాక్షస రూపం కలుగాలని శపించారట. ఆమె రాక్షసి అయిపోయింది. తిరిగి ఆయన తపస్సులో లీనమయ్యాడు. ఆమె ఆయనకోసం ఎదురుచూస్తూ కూర్చుందట. ఆయన తపస్సు పూర్తయ్యాక ఆమె ప్రార్ధిస్తే మేధావి అనుగ్రహించి ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి తిథినాడు ఉపాసన చేసి శ్రీమన్నారాయణమూర్తిని అర్చిస్తే రాక్షస రూపం పోయి, తిరిగి నీ అప్సరస రూపం పొందుతావు అని శాప విమోచన మార్గాన్ని చెప్పారు. ఆయన సూచన మేరకు మంజుఘోష ఏకాదశి వ్రతం ఆచరించి తన పూర్వ స్వరూపాన్ని పొందింది. చేసిన పాపాలను తొలగించినందున ఈ ఏకాదశిని పాపవిమోచని ఏకాదశి అని అన్నారు. పాపమను అంకుశమువలె మన మనస్సును నియంత్రిచేది కనక ఈ ఏకాదశిని పాపాం...

Tirupati Kodanda Rama Brahmotsavam: శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - తిరుపతి

Image
తిరుప‌తి శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాలు మార్చి 27 నుండి ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు వైభవంగా జ‌రుగ‌నున్నాయి. ఇందులో భాగంగా ఆల‌యంలో మార్చి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, మార్చి 26న బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ నిర్వహిస్తారు. వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 8:30 గంటల వరకు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు : 27-03-2025 ఉదయం – ధ్వజారోహణం (ఉద‌యం 9.15 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు) రాత్రి – పెద్దశేష వాహనం 28-03-2025 ఉదయం – చిన్నశేష వాహనం రాత్రి – హంస వాహనం 29-03-2025 ఉదయం – సింహ వాహనం రాత్రి – ముత్యపుపందిరి వాహనం. 30-03-2025 ఉదయం – కల్పవృక్ష వాహనం రాత్రి – సర్వభూపాల వాహనం 31-03-2025 ఉదయం – పల్లకీ ఉత్సవం రాత్రి – గరుడ వాహనం 01-04-2025 ఉదయం – హనుమంత వాహనం రాత్రి – గజ వాహనం 02-04-2025 ఉదయం – సూర్యప్రభ వాహనం రాత్రి – చంద్రప్రభ వాహనం 03-04-2025 ఉదయం – రథోత్సవం రాత్రి – అశ్వవాహనం 04-04-2025 ఉదయం – చక్రస్నానం రాత్రి – ధ్వజావరోహణం

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Image
  నిత్యం మనం తినే ఆహారంలో ఐదు రకాలైన దోషాలుంటాయి.అవి.. 1.అర్ధ దోషం 2.నిమిత్త దోషం          3.స్ధాన దోషం 4.గుణ దోషం    5. సంస్కార దోషం అర్ధ దోషం సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడమే అర్థదోషం అంటారు.. మీకు అర్థమయ్యేందుకు ఈ చిన్న కథ...ఒక సాధువు  తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో వచ్చి ఆ శిష్యుడికి డబ్బు మూట ఇవ్వడం చూశాడు. భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ గదిలో మూట చూసిన సాధువు మనసులో దుర్భుద్ధి కలిగింది. అందులోంచి కొంత మొత్తాన్ని తీసి తన సంచీలో దాచేసి ఆశ్రమానికి వెళ్లిపోయాడు. ఆ మర్నాడు పూజా సమయంలో తాను చేసిన దొంగతనం గుర్తొచ్చి సశ్చాత్తాపం చెందాడు. తను శిష్యుడి ఇంట్లో  దోషంతో కూడిన భోజనం చేయడం వల్లే తనకా దుర్భుద్ధి కలిగిందని..ఆ ఆహారం జీర్ణమై మలంగా విసర్జించిన తర్వాత మనసు నిర్మలమైనట్టు అర్థం చేసుకున్నాడు. వెంటనే తాను తస్కరించిన డబ్బు తీసుకుని శిష్యుడి ఇంటికి వెళ్లి జరిగింది చెప్పి ఇచ్చేసి..ఆ డబ్బు ఎలా సంపాదించావని అడిగాడు. శిష్యుడు తలవంచుకుని, "నన్ను క్షమించండి, స...

Kapileswara Swamy Temple: కపిలతీర్థం ఆలయ విశేషాలు

Image
  ఈ ఆలయం తిరుపతి నగరంలో వెలసింది. కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళంనుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడని స్థలపురాణం.  కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైనది ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది.  ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు. తిరుమల కొండలమీది నుంచి గలగలా పారుతూ, 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు. 11వ శతాబ్దంలో  ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈ ఆలయానికి ముందు ఒక  గుడి ఉంటుంది. అది నమ్మాళ్వార్‌ అనే ఆళ్వారు గుడి అని చెబుతారు.  ఈ ఆలయంలో కపిలేశ్వర స్వామితోపాటు కాశీవిశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు, అగస్త్యేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఉన్నారు. కార్తీక పౌర్ణమినాడు మధ్యాహ్నవేళ ముల్లోకాల్లోని సకలతీర్థాలూ నాలుగు గంటలపాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలూ దూదిపింజల్లా పోతాయని ప్రసిద్ధి....

Bobbili Venugopala Temple: శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం - బొబ్బిలి

Image
 ఉత్తరాంధ్రలో  తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన  ఆలయం బొబ్బిలి శ్రీ వేణుగోపాలస్వామి బొబ్బిలి రాజవంశీకుల కులదైవం శ్రీ వేణుగోపాలస్వామి. బొబ్బిలి కోట సమీపంలో ఉన్న ఈ ఆలయంలో రుక్మిణీ, సత్యభామా సమేతుడిగా వేణుగోపాలుడు దర్శనమిస్తాడు. బొబ్బలి సంస్థానాధిపతులు ఈ ఆలయాన్ని నిర్మించారు. సుమారు 200 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం ఎంతో ప్రాచుర్యం పొందినది. దేవాలయ గోపురం, ప్రధాన ఆలయం కంటే ఎత్తులో ఉండే ఏకైక ఆలయం ఇది.  ఆలయ గోపురం సుమారు 9 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ వేణుగోవాలస్వామి ఆలయంలో ఐదు అంతస్తుల గాలిగోపురం ప్రత్యేక ఆకర్షణ.  తూర్పు ముఖంగా గర్భాలయం, అంతరాలయం, మండపం అనే మూడు భాగాలుగా, రెండు ప్రాకారాలను కలిగి ఉంది. ఆలయ గాలిగోపురం తూర్పువైపు అభిముఖంగా ఉండి, దాని కింది నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయం ప్రవేశ ద్వారం బయట కళ్యాణమండపం ఒకటి ఉంది. మొదటి ప్రకారంలో ధ్వజస్తంభం, గరుడాళ్వారు మండపం, రెండవ ప్రకారంలో ముఖమండపం, ఆరాధన మండపం, అంతరాలయం, గర్భాలయం ఉన్నాయి. గర్భాలయంలో రుక్మిణి-సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు కొలువై ఉండగా..గర్భాలయం బయట శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక మంద...

Ranga Panchami: రంగ పంచమి

Image
రంగ పంచమిని హోలీ పండుగ అయిదు రోజుల తర్వాత జరుపుకుంటారు.ఇది రంగులతో  ముడిపడి ఉన్న మరొక పండుగ.  దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రంగపంచమిని జరుపుకుంటారు. మహారాష్ట్రలో మత్స్యకారులకు ఇది చాలా ముఖ్యమైన పండుగ. వారు ఈ పండుగను షిమ్తో పేరుతో జరుపుకుంటారు. ఈ రోజున ఆట పాటలతో సందడి చేస్తారు.  మధ్యప్రదేశ్, ఉత్తర భారతదేశంలోని అనేక ఇతర ప్రాంతాలలో ఈ పండుగను ఎంతో పవిత్రంగా, వైభవంగా జరుపుకుంటారు.  ఈ పండుగ పవిత్రాగ్నిలో అన్ని రకాల తామసిక, రాజసిక గుణాల నుండి శుద్ధి పొందుతామని ప్రజలు విశ్వసిస్తారు. ఈ సమయంలో పర్యావరణం సానుకూలతతో నిండి ఉంటుంది. అనుకూల శక్తులు అందరినీ చుట్టుముడతాయి. హోళికా దహనం ద్వారా వచ్చే మంటలు, ఈ రోజున చల్లుకునే ప్రకృతిలో లభించే సహజమైన రంగులు దేవతలను ఆవాహన చేయడంలో సహాయపడతాయి. ఈ పండుగలో వనమూలికలతో తయారు చేసిన రంగులు, సహజంగా ప్రకృతిలో లభించే రంగులనే ఎక్కువగా వాడతారు. ఇవి ఆధ్యాత్మిక అభివృద్ధి మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగిస్తాయని చెబుతారు. ఈ ప్రత్యేక రోజున ప్రజలు తమ కుటుంబాలు, బంధువులు, స్నేహితులతో రంగులు ఆడుకుంటూ గడుపుతారు. భక్తులు శ్రీకృష్ణుడు, రాధాదేవిని పూజిస్తారు. రంగ పంచమి ...

Masani Amman Temple: శ్రీ మాసాని అమ్మ ఆలయం - అనైమలై

Image
  తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో, పొల్లాచికి 14 కి.మీ.ల దూరంలో అనైమలై అనే ఊరులో ఉంది ఈ ఆలయం. అందుకే అనైమలై మాసాని అమ్మ దేవాలయం అని కూడా అంటారు.  ఈ ఆలయంలో అమ్మవారు  వెల్లకిలా పడుకున్నట్లు దర్శనమిస్తుంది. దాదాపు 15 అడుగుల పొడుగున్న ఈ మూర్తి నాలుగు చేతులు, వాటిలో కపాలం, పాము, డమరుకం, త్రిశూలం ధరించి ఉంటుంది. ఆలయ విశేషాలు  ఈ ఆలయంలో చాలా విశేషాలున్నాయి. ఆలయ నిర్మాణమే ఒక పెద్ద విశేషం. ఈ ఆలయం స్మశాన భూమిలో నిర్మితమయింది. అందుకనే ఆ అమ్మవారిని అక్కడి ప్రజలు మాసాని అమ్మ అని పిలిచేవారు. తర్వాత ఆ పేరే ఆలయానికి స్థిరపడిపోయింది. అమ్మవారి విగ్రహం వెల్లకిలా పడుకున్నట్లు ఉంటుంది. పడుకున్న భంగిమలో ఉన్న అమ్మవారి విగ్రహం భారత దేశంలో ఇంకే అమ్మవారి ఆలయంలో లేదు. అమ్మవారి పాదాల దగ్గర ఒక రాక్షసుడు ఉంటాడు. అక్కడే రెండు అడుగుల ఎత్తున్న అమ్మవారి విగ్రహం నుంచున్నట్లు ఉంటుంది. ఈ అమ్మవారి గురించి అనేక కధలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ అమ్మవారిని ఒక సదాచార సంపన్నుడు ప్రతిష్టించాడు. ఒకసారి మగుదాసురన్ అనే క్రూర రాక్షసుడు ఆ ఊరి ప్రజలని నానా హింసలు పెట్టి తన బానిసలుగా చేసుకున్నాడు. అతని ఆగడాలు ...

Anakapalli Nookalamma Jatara: అనకాపల్లి నూకాలమ్మ జాతర

Image
అనకాపల్లిలో వెలసిన నూకాలమ్మ భక్తుల  కొంగుబంగారమై  భాసిల్లుతోంది. ఈ దేవాలయానికి 550 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ తల్లిని నూకాంబిక, కాకతాంబ అని పిలుచుకుంటారు. కళింగరాజు కాకర్లపూడి అప్పరాజు అనకాపల్లి కోట, కోటకు దక్షిణం వైపున నూకాలమ్మ గుడిని1450 సం॥లో కట్టించాడు. ప్రస్తుతం ఈ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖవారి ఆధీనంలో ఉంది. ఇక్కడ నూకాలమ్మ జాతర ప్రతి సంవత్సరం కొత్త అమావాస్య (తెలుగు సంవత్సరాది(ఉగాది)) రోజునుండి నెలరోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా మలేసియా, సింగపూర్ నుండి అధికసంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని వెళతారు. కొత్త అమవాస్యనుండి రెండు మూడు నెలలపాటు అధికసంఖ్యలో భక్తులు అమ్మవారి ఆశీర్వాదం కోసం తరలి వస్తారు. జాతర చివరిరోజు 'నేలపండుగ' అనే ఉత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటారు.

Lakshmi Jayanti: లక్ష్మి జయంతి

Image
ఉత్తర ఫాల్గుణ ఉనక్షత్రంతో కూడిన ఫాల్గుణ పౌర్ణమిని లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజుగా పురాణాలు చెబుతున్నాయి. క్షీరసాగర మథనంలో ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ, ఉత్తర ఫాల్గుణి నక్షత్రం నాడు లక్ష్మీదేవి ఉద్భవించింది. ఉత్తర ఫాల్గుణితో కూడిన పున్నమి ఉన్ననాడే లక్ష్మీ ఆవిర్భావ దినాన్ని ఆచరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి ఆవిర్భావానికి సంబంధించిన పురాణ గాధ ఒకటి ప్రచారంలో ఉంది. ఒకనాడు దూర్వాస మహర్షికి ఒక అప్సరస పూలమాలతో ఎదురుపడింది. ఆ పూల మాలను తనకు ఇమ్మని మహర్షి అడగగా, అప్సరస ఆ మాలను మహర్షికి ఇచ్చింది. పూల మాలను తీసుకున్న దూర్వాస మహర్షి స్వర్గమునకు వెళ్ళుతుండగా అప్పుడే ఐరావతంపై వస్తున్న ఇంద్రుడు ఎదురయ్యాడు. మహర్షికి నమస్కరించాడు. మహర్షి తన చేతిలోని మాలను ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడు ఆ మాలను వాసన చూసి ఐరావతం కుంభ స్థలంపై ఉంచాడు. ఐరావతం ఆమాలను తొండంతో తీసి కిందపడవేసింది. అది చూసి ఇంద్రునిపై ఆగ్రహించిన దూర్వాసుడు ఈ రోజు నుండి మూడు లోకాలలో లక్ష్మీ కనిపించకుండా పోతుందని శపించాడు.  లక్ష్మి అదృశ్యం కాగానే రాక్షసులు స్వర్గంపై దాడి చేసి ఆక్రమించుకున్నారు. రాజ్యం కోల్పోయిన ఇంద్రుడు ఇతర దేవతలో కలిసి తి...

Konda Bitragunta Brahmotsavam 2025: శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - కొండ బిట్రగుంట

Image
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన  కొండబిట్రగుంట బిలకూట క్షేత్రంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామికి వైఖానస ఆగమశాస్త్రానుసారం ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఫాల్గుణ పూర్ణిమ రోజున స్వామివారికి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. తదుపరి రథోత్సవం నేత్రపర్వంగా జరిపిస్తారు. భక్తుల పాలిట ప్రసన్నుడిగా, ఆపద మొక్కులవాడిగా పేరొందిన స్వామివారిని ఉత్సవాల్లో దర్శించి, తరించేందుకు లక్షలాది మందికి పైగా భక్తులు తరలి వస్తారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన గరుడ సేవ, మొక్కుబడులు, కళ్యాణోత్సవం రోజుల్లో బిలకూట క్షేత్రం భక్తజన సంద్రంగా మారుతుంది.  బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు స్వామివారికి వరసగా జరిగే క్రతువులు ఈ విధంగా ఉంటాయి. గిరిప్రదక్షిణ, అంకురార్పణతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. ధ్వజారోహణ (కొడిముద్దలు), శేషవాహన సేవ, హనుమంతసేవ, మోహినీ ఉత్సవం, గరుడసేవ, స్వామివారికి మొక్కుబడులు, తెప్పోత్సవం, గజ వాహనసేవ, కళ్యాణోత్సవం, రథోత్సవం, అశ్వవాహన సేవ, పుష్పయాగం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏకాంతసేవతో ఉత్సవాలు పూర్తవ...

Dharmapuri Narasimha Swamy: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - ధర్మపురి

Image
శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా పాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి  రోజులు అత్యంత వైభవంగా నిర్వహించబడుతాయి. 2025 తేదీలు :  మార్చి 10  - అంకురార్పణ, కళశ స్థాపన, వరాహతీర్థం మరియు పుట్టబంగారం మార్చి 11  -  గోధూళి సుముహూర్తమున స్వామివారి కళ్యాణోత్సవము. మార్చి 12  -  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఊరేగింపు సేవ. మార్చి 13 -  శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఊరేగింపు సేవ. మార్చి 14  -  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (యోగ) వారి డోలోత్సవం మరియు తెప్పోత్సవం. మార్చి 15  -  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (ఉగ్ర) వారి వారి డోలోత్సవం మరియు తెప్పోత్సవం. మార్చి 16  -  శ్రీ వేంకటేశ్వర  స్వామి వారి డోలోత్సవం,  తెప్పోత్సవం మరియు దక్షిణ దిగ్యాత్ర. మార్చి 17  -  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (యోగ) వారి ఉత్తరదిగ్యాత్ర   భోగమండపం,  వేద సదస్సు. మార్చి 18 - శ్రీ వేంకటేశ్వర  స్వామి వారి ఉత్తర మరియు దక్షిణ దిగ్యాత్రలు, దోపోత్సవం (దోపుకథ). మార్చి 19 -  పూర్ణాహుతి,...

Reasoning for Visiting Temples: దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి ?

Image
 హిందూ పురాణాల ప్రకారం దేవుడు సర్వాంతర్యామి అయినప్పటికీ ఆలయాల్లో, తీర్థ స్థలాల్లో త్వరగా అనుగ్రహిస్తాడని విశ్వాసం. అందుకే దేవాలయ సందర్శనం, తీర్థయాత్రలు చేయడం హిందూ సంస్కృతిలో భాగం. అయితే దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించడం వెనుక శాస్త్రీయ కోణం కూడా ఉంది. పూర్వీకులు, పీఠాధిపతులు, మఠాధిపతులు దేవాలయాలు నిర్మించేటప్పుడు ఆ స్థలానికి ఉన్న సానుకూల శక్తులను పరిశీలిస్తారు. ఎక్కడైతే సానుకూల శక్తుల ప్రభావం అధికంగా ఉంటుందో ఆ ప్రదేశంలోనే దేవాలయాలను నిర్మించేవారు. దేవాలయాలను నిర్మించి మూలవిరాట్టును ప్రతిష్టించే ముందు పీఠం కింద వేదమంత్రాలు లిఖించిన రాగి రేకును ఉంచి దాని పైన మూలవిరాట్టును ప్రతిష్టించడం ఆనవాయితీ. రాగికి భూమి లోపలి శక్తి తరంగాలను ఆకర్షించి పరిసరాలలో విడుదల చేసే అద్భుతమైన శక్తి ఉంటుంది. దైవదర్శనం కోసం గుడికి వెళ్ళినప్పుడు ఆయా సానుకూల శక్తి తరంగాలు భక్తులపై ప్రసరించడం వలన పాజిటివ్ ఎనర్జీ, మానసిక ప్రశాంతత కలుగుతాయి. అందుకే దైవదర్శనం కోసం ఆలయాన్ని సందర్శించిన తర్వాత మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణాలు చేయడం పరిపాటి. ఆలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు గర్భాలయంల...

Talpagiri Ranganatha Swamy Temple: శ్రీ తల్పగిరి రంగనాధస్వామి వారి ఆలయం - నెల్లూరు

Image
శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటలో పెన్నానది ఒడ్డున ఉంది. ఆలయ స్థల పురాణం పూర్వం కశ్యప మహాముని మహా పుణ్య క్షేత్రాల పర్యటనలో భాగంగా నెల్లూరుకు వచ్చి ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతంలో పౌండరీక యాగం నిర్వహించాడు. కశ్యప ముని భక్తికి మెచ్చిన నారాయణుడు ఆ ప్రాంతం భక్తుల ఆదరణతో పరిఢవిల్లుతుందని అక్కడ శ్రీ రంగనాథస్వామిగా వెలిసినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. పౌరాణిక ప్రాశస్త్యం మరో కథనం ప్రకారం, కశ్యప మహర్షి యజ్ఞంలో నుంచి ఉద్భవించిన త్రేతాగ్ని జ్వాలల్లో ఒకటి శ్రీరంగనాథ స్వామి ఆలయంగా, మరొకటి జొన్నవాడ కామాక్షమ్మ ఆలయంగా, మరోటి వేదగిరి నరసింహస్వామి క్షేత్రంగా వెలసినట్లు స్కంద పురాణం, వైష్ణవ సంహితలో ప్రస్తావన ఉంది. ఈ విధంగా అత్యంత ప్రాచీన ఆలయంగా తల్పగిరి శ్రీరంగనాయకుని ఆలయం ప్రసిద్ధి చెందింది. 12వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయంను మొదట శ్రీ వైకుంఠంగా పిలుచుకునేవారు. 17వ శతాబ్దం తరువాత ఈ దేవాలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఆలయ విశేషాలు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం గాలి గోపురం 7...

Mangalagiri Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు (తిరునాళ్లు) 2025 తేదీలు - మంగళగిరి

Image
మంగళగిరిలో ఫాల్గుణ మాసంలో శుద్ధ షష్టి నాడు ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు.11 రోజులపాటు ఎంతో వైభవంగా కొనసాగుతాయి. ఈ ఉత్సవాలలో చతుర్దశినాడు శాంత నరసింహస్వామికి, శ్రీదేవి, భూదేవులకు కళ్యాణం కడు రమణీయంగా జరుగుతుంది. మరునాడు. అంటే పౌర్ణమిరోజు జరిగే రథోత్సవంలో లక్షలాదిమంది భక్తులు పాల్గొంటారు. స్వామి దేవేరులతో సహా ఊరేగే ఈ పెద్ద రథం లాగడానికి భక్తులు పోటీ పడతారు.కనీసం ఆ రథం తాళ్ళు తాకినా పుణ్యమేనని భావిస్తారు. శ్రీనరసింహుడు భక్త రక్షణార్ధం అప్పటికప్పుడు అవతరించినమూర్తి. వేడుకున్న వెంటనే ఆపదలలో ఉన్న భక్తులను, కాపాడే దయగల దేవుడు నరసింహస్వామి. అంతటి దయామయుడైన ఆ స్వామి కృష్ణానదీ తీరాన వెలసిన పవిత్ర నారసింహ క్షేత్రమే మంగళగిరి. మంగళగిరి అనగానే గుర్తుకొచ్చేవి పానకాల స్వామి, గాలి గోపురం. మంగళగిరిలో మూడు నరసింహస్వామి ఆలయాలున్నాయి. కొండ దిగువన ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కొండపైన ఉన్న పానకాల స్వామి ఆలయం, కొండ శిఖరం మీద ఉన్న గండాల నరసింహస్వామి ఆలయం. హిరణ్యకశిపుని వధానంతరం శ్రీనరసింహస్వామి చాలా భయంకరరూపంతో, రౌద్రంగా, అందరికీ భీతికొల్పుతూ ఉన్నారు.దేవతలంతా ఆ దేవదేవుని శాంతించమని ప్రార్ధించినా ఫలితంకనబడ...

Ponnur Bhavanarayana Swamy Temple: శ్రీ భావనారాయణస్వామి వారి ఆలయం - పొన్నూరు

Image
  ఆంధ్రప్రదేశ్​లో పంచ భావనారాయణ క్షేత్రాలు ఉన్నాయి. అవి వరుసగా పొన్నూరు, సర్పవరం, బాపట్ల, భావదేవరపల్లి, పట్టసం. వీటిలో పొన్నూరులో భావనారాయణ స్వామి ఆలయం ప్రఖ్యాతి చెందినది. 'పొన్నూరు'లో వెలసిన స్వామి 'సాక్షి' భావనారాయణ స్వామిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో పొన్నూరు ఉంది. పొన్నూరు అనే పదం 'పొన్, ఊరు' అనే రెండు పదాల కలయిక వల్ల వచ్చింది. 'పొన్' అంటే బంగారం అని 'ఊరు' అంటే గ్రామం అని అర్థం. అందుకే ఈ గ్రామాన్ని బంగారు గ్రామం, స్వర్ణపురి పేర్లతో కూడా పిలుస్తారు. ఇక్కడ భావనారాయణ స్వామి, సాక్షి భావనారాయణ స్వామిగా మారడం వెనుక ఓ ఆసక్తి కరమైన కథనం ఉంది. సంతానం కోసం కాశి దర్శించిన కేశవయ్య పూర్వం పొన్నూరులో కేశవశర్మ అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి సంతానం లేదు. దీంతో సంతానం కోసం అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించేవాడు. ఈ యాత్రల్లో తన కుటుంబ సభ్యలతో పాటు మేనల్లుడైన గోవిందుడిని కూడా వెంటబెట్టుకొని వెళ్లేవాడు. ఈ క్రమంలోనే కేశవయ్య కాశీని సందర్శిచి అక్కడ నారాయణుడి దేవాలయంలో తనకు సంతాన ప్రాప్తి కలిగించాలని వేడుకొన్న...

Avulapalle Venkateswara Swamy Temple: శ్రీ ప్రస‌న్న వేంక‌టేశ్వ‌ర‌‌ స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు 2025 - ఆవుల‌ప‌ల్లె

Image
  సోమ‌ల మండ‌లం ఆవుల‌ప‌ల్లెలోని శ్రీ ప్రస‌న్న వేంక‌టేశ్వ‌ర‌‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు మార్చి 5 నుండి మార్చి 15వ తేదీ వరకు జరుగనున్నాయి. వాహనసేవలు  మార్చి 05 - అంకురార్పణ  మార్చి 06  - ధ్వజారోహణ, సూర్య‌ప్ర‌భ వాహ‌నం మార్చి 07 - హ‌నుమంత వాహనం మార్చి 08 - సింహ వాహనం మార్చి 09 - శేష‌వాహనం      మార్చి 10 - మోహినీ ఉత్స‌వం, గ‌జ వాహ‌నం మార్చి 11 - క‌ల్యాణోత్స‌వం, గ‌రుడ‌సేవ‌ మార్చి 13 - రథోత్సవం, డోలోత్స‌వం మార్చి 14 - అశ్వ వాహ‌నం, పార్వేట ఉత్స‌వం – డోపు ఉత్స‌వం (తిరుమంగై ఆళ్వార్‌)  మార్చి 15 - వసంతోత్సవం, చక్రస్నానం – హంస వాహ‌నం, ధ్వజావరోహణం.

Gavi Matham Brahmotsavam: శ్రీ చంద్రవౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 2025 - ఉరవకొండ

ఉరవకొండ పట్టణంలో ప్రసిద్ధిచెందిన శ్రీ గవి మఠ స్థిత చంద్రవౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 4వ తేదీ నుంచి జరుగుతాయి .  వాహన సేవలు  2025 మార్చి 4 - కంకణధారణ,  మార్చి 5న స్వామివారికి  నాగాభరణ ఉత్సవం,  మార్చి 6న నెమలి వాహనోత్సవం మార్చి 7న ఐరావత వాహనోత్సవం  మార్చి 8న బసవేశ్వర వాహనోత్సవం  మార్చి 9న రథోత్సవం  మార్చి 10న లంక దహనం  మార్చి 11న వసంతోత్సవం 

Srisailam Ugadi 2025: శ్రీ మల్లికార్జున స్వామి ఉగాది ఉత్సవాలు 2025 - శ్రీశైలం

Image
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు మార్చి 27 నుండి ప్రారంభం అవుతాయి. వాహన సేవలు 2025 మార్చి 27  - బృంగి వాహన సేవ, మహాలక్ష్మి అలంకరణ  మార్చి 28 - కైలాస వాహన సేవ, మహా దుర్గ అలంకరణ  మార్చి 29 - ప్రభోత్సవం, నంది వాహన సేవ, మహా సరస్వతి అలంకరణ, అగ్నిగుండ ప్రవేశం  మార్చి 30 - ఉగాది, పంచాంగ శ్రవణం, రాజరాజేశ్వరి అలంకరణ, రథోత్సవం  మార్చి 31 - పూర్ణాహుతి, నిజ అలంకరణ, అశ్వ వాహన సేవ 

Ahobilam Brahmotsavam 2025: శ్రీ లక్ష్మినరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - అహోబిలం

Image
అహోబిలంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి 04 నుండి ప్రారంభంకానున్నాయి. ఫాల్గుణ శుద్ధ పంచమి నుండి పౌర్ణమి వరకు అహోబిలంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి . బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి వారికి కళ్యాణోత్సవం కడు రమణీయంగా జరుగుతుంది. శ్రీవైష్ణవ సాంప్రదాయంలో పరమ పవిత్రంగా భావించే 108 దివ్యక్షేత్రాలలో ఒకటి అహోబిల నవనారసింహ క్షేత్రం. నల్లమల అడవులలో ఉన్న ఈ క్షేత్రం భక్తి ప్రపత్తులకేకాదు ప్రకృతి రామణీయతకుకూడా ఆలవాలం. ఈ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో వివరించారు. రాక్షస రాజైన హిరణ్యకశిపుని రాజ్యం ఇది. తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడడానికి హరి స్తంభంనుండి నరసింహుని రూపంలో వెలువడి హిరణ్యకశిపుని వధించింది ఇక్కడే. నరసింహస్వామి ఆవిర్భవించి హిరణ్యకశిపుని తన గోళ్ళతో చీల్చి చంపినప్పుడు ఆయన బలాన్ని, శక్తిని దేవతలు అహో బలం.. అహో బలం.. అని ప్రశంసించారుగనుక ఈ స్థలానికి వారు కీర్తించినట్లు అహోబలం అన్నారు. ఎగువ అహోబిలంలో ప్రహ్లాదుని తపస్సుకి మెచ్చి నరసింహస్వామి బిలంలో స్వయంభువుగా వెలిశాడుగనుక అహో బిలం అన్నారు. ఈ క్షేత్రంలో స్వామీ తొమ్మిది ప్రదేశాలలో తొమ్మిది రూపాలలో ఆవిర్భవించారు. ...

Patha Somalamma Jatara: శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు 2025 తేదీలు - రాజమహేంద్రవరం

Image
నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని శ్యామలానగర్ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు మార్చి 9 నుంచి 13వ తేదీ వరకు జరగనుంది. మార్చి 9న తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి పంచామృతాభిషేకం, 10.05 గంటలకు కలశస్థాపన, 10.30 గంటలకు లక్ష్మీగణపతి హోమం  మార్చి 10న ఉదయం 8.30 గంటలకు లక్ష పుష్పార్చన, సాయంత్రం జ్యోతిర్లింగార్చన,  మార్చి 11న ఉదయం చండీహోమం, సాయంత్రం అమ్మవారి పల్లకీసేవ, ఊయల సేవ,  మార్చి 12న ఉదయం 8.30 గంటలకు సౌభాగ్య వ్రతం, సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు  మార్చి 13న తెల్లవారుజామున అమ్మవారికి పంచామృతాభిషేకం, జాతర సందర్భంగా విశేష అలంకరణ, కుంకుమార్చన, సాయంత్రం 4 గంటల నుంచి అమ్మవారి జాతర మహోత్సవం జరుగుతుంది.

Simhachalam Dolotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి డోలోత్సవం - సింహాచలం

Image
మూడులోకాలలోనూ సృసింహునికి సాటిదైవం లేదు. సింహాచలం వంటి క్షేత్రం లేదని ప్రతీతి. నిరంతరం మైపూతగా శ్రీచందనాన్ని ధరించే సింహాద్రి అప్పన్న పరమ శాంతమూర్తి. దర్శనం చేసి వరం వేడుకున్న క్షణంలోనే అనుగ్రహించే సద్యోజాత మూర్తి. సింహాచలం కొండ సాక్షాత్తూ నృసింహ స్వామి రూపం. కూర్చున్న సింహంలా సింహాచలం కనిపించడం విశేషం. ఫాల్గుణ మాసంలో సాధారణంగా నృసింహ కల్యాణాలు జరుగుతాయి.సింహాచలంలో ఫాల్గుణ పూర్ణిమకు అప్పన్నకు డోలోత్సవం నిర్వహిస్తారు. కల్యాణం చైత్రమాసంలో ఉంటుంది.  ఫాల్గుణ పూర్ణిమ నాడు సింహాద్రిపై డోలోత్సవం జరుగుతుంది. ఉత్సవంలో భాగంగా స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరిస్తారు. సింహగిరిపైనుంచి మెట్ల మార్గంలో కొండ దిగువకు తీసుకువస్తారు. అనంతరం పుష్కరిణి ఉద్యాన మండపంలో వసంతోత్సవం చేస్తారు. అప్పన్నస్వామి సోదరి పైడితల్లిని పిల్లనిమ్మని అడుగుతాడు. తిరువీధి నిర్వహించిన అనంతరం స్వామి తిరిగి సింహగిరి చేరుకుంటాడు. 2025: మార్చి 14.

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Image
విజయనగర ప్రభువు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో వీణ గురువు గాన గంధర్యుడు కృష్ణాచార్యులు. వారి కుమారుడు కనకాచల భట్టు. అతని కొడుకు తిమ్మాణ్ణాచార్యులు. అతని ధర్మపత్ని గోపమ్మ. వారి ఇష్టదైవం శ్రీవేంకటేశ్వరస్వామి. తరతరాలుగా విజయనగరంలో నివాసం ఉంటున్న వారు, తళ్ళికోట యుద్ధానంతరం (1565) ధర్మరక్షణ కరవైన విజయనరగం విడిచి, చోళరాజ్యం కాంచీపురంలోని పట్టణ అగ్రహారం చేరుకున్నారు. వారి సంతానం, కూతురు వెంకటమ్మ కొడుకు గురురాజు. ఈ ఇరువురికి తోడు, తమకు ఇంకొక పుత్రుడు కావలనెని కోరిక కలిగింది. ఈ దంపతుల అపారమైన భక్తికి మెచ్చి శ్రీవేంకటేశ్వరస్వామి ఒక తేజో మండల రాశిగా స్వప్నదర్శనం ఇచ్చి ఆశీర్వదించారు. తత్ఫలితంగా గోపపమ్మ.. ఫాల్గుణ శుద్ధసప్తమి గురువారం రోజున ఒక మగ శిశువును కన్నది. సూర్యబింబం వలే ప్రకాశించే ఆ శిశువుకు వెంకటనాథుడు అనే పేరు పెట్టారు. ఈ బాలుడు ఆడే ఆటలు, పలికే పలుకులలో ఎంతో పరమార్థ చింతన ఉండేది. పండితులు సైతం బాలుడి మాటలలోని లోతైన అంతరార్థాన్ని గమనించి, ఎంతగానో ఆశ్చర్యపోయేవారు. ఈ బాలుడు సామాన్యుడు కాడు దివ్యాంశ సంభూతుడని ఆనాటి కొందరు పండితులు గ్రహించారు. ఈ బాలుడికి 3వ ఏట అక్షరాభ్యాసం జరుగుతున్నపుడు పలకపై ...

Kolletikota Peddintliamma Jatara: శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర 2025 - కొల్లేటికోట

Image
  కొల్లేరు సరస్సు నడిమధ్యలో ఉన్న కొల్లేటికోటలో పెద్దింట్లమ్మ వారి ఆలయం శతాబ్దాల చరిత్ర కలిగినది. తొమ్మిది అడుగుల పైబడి, విశాల నేత్రాలతో పద్మాసన భంగిమతో పెద్దింట్లమ్మ దర్శనమిస్తుంది. ఏటా ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకూ ఉత్సవాలు జరుగుతాయి. ద్వాదశి రోజున పెద్దింట్లమ్మ సమేత జలదుర్గకు కొల్లేటి కోట సమీపాన కల గోకర్ణేశ్వరస్వామి వారికి కళ్యాణము జరిపిస్తారు. వేంగీ చాళుక్యుల కాలంలో ఈ ప్రాంతాన్ని సరోనాథులు పరిపాలించారు. తరువాత ఈ ప్రాంతం ఓధ్ర గజపతుల పాలనలోకి వెళ్లింది. గజపతి రాజుకు ఇక్కడ ఒక కోట ఉండేది. ఆ కోటను వశం చేసుకోవడానికి మహ్మదీయులు కొల్లేరు సరస్సు సమీపంలోని చిగురుకోట వద్ద డేరా వేసి ఒక కాలువను తవ్వి (నేటి ఉప్పటేరు) సరస్సును సముద్రంలోకి ఇంకించి వేశారు. ఆ సమయంలో గజపతి రాజు సైన్యాధ్యక్షుడు ఒకడు యుద్ధంలో విజయం లభించాలని తన కూతురైన పేరంటాలమ్మను బలి ఇవ్వబోయాడు. ఆవిడ ఒక శక్తి స్వరూపముగా మారి మహిషాసురమర్దినిగా శత్రువులను సంహరించింది. అప్పుడే అంటే, క్రీ.శ 1237-82 మధ్యకాలంలో పేరంటాలమ్మ ఆలయం నిర్మితమైంది. ఆమెనే నేడు పెద్దింట్లమ్మగా పిలుస్తున్నారు. జాతర 2025 తేదీలు : మార్చి 01 నుండి 13 వరకు...