శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండబిట్రగుంట బిలకూట క్షేత్రంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామికి వైఖానస ఆగమశాస్త్రానుసారం ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఫాల్గుణ పూర్ణిమ రోజున స్వామివారికి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. తదుపరి రథోత్సవం నేత్రపర్వంగా జరిపిస్తారు. భక్తుల పాలిట ప్రసన్నుడిగా, ఆపద మొక్కులవాడిగా పేరొందిన స్వామివారిని ఉత్సవాల్లో దర్శించి, తరించేందుకు లక్షలాది మందికి పైగా భక్తులు తరలి వస్తారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన గరుడ సేవ, మొక్కుబడులు, కళ్యాణోత్సవం రోజుల్లో బిలకూట క్షేత్రం భక్తజన సంద్రంగా మారుతుంది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు స్వామివారికి వరసగా జరిగే క్రతువులు ఈ విధంగా ఉంటాయి. గిరిప్రదక్షిణ, అంకురార్పణతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. ధ్వజారోహణ (కొడిముద్దలు), శేషవాహన సేవ, హనుమంతసేవ, మోహినీ ఉత్సవం, గరుడసేవ, స్వామివారికి మొక్కుబడులు, తెప్పోత్సవం, గజ వాహనసేవ, కళ్యాణోత్సవం, రథోత్సవం, అశ్వవాహన సేవ, పుష్పయాగం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏకాంతసేవతో ఉత్సవాలు పూర్తవుతాయి. ప్రతీ రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి పర్యటకులను ఆకట్టుకుంటాయి.
బిలకూట క్షేత్రం పై వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి 09 నుండి ప్రారంభం కానున్నాయి
సేవల వివరాలు
మార్చి 09 - గిరిప్రదక్షిణ, అంకురార్పణ
మార్చి 10 - తిరుమంజనం, ధ్వజారోహణ, కొడిముద్దలు , శేష వాహన సేవ
మార్చి 11 - సుప్రభాత సేవ, హనుమంత వాహన సేవ
మార్చి 12 - మోహిని అవతారం, గరుడ వాహన సేవ
మార్చి 13 - చందన అలంకారం, తెప్పోత్సవం, గజ వాహన సేవ
మార్చి 14 - కల్యాణ మహోత్సవం, అశ్వ వాహన సేవ, ధ్వజ అవరోహణ, పూర్ణాహుతి
మార్చి 15 - పుష్పయాగం, ఏకాంత సేవ
No comments:
Post a Comment