అనకాపల్లిలో వెలసిన నూకాలమ్మ భక్తుల కొంగుబంగారమై భాసిల్లుతోంది. ఈ దేవాలయానికి 550 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ తల్లిని నూకాంబిక, కాకతాంబ అని పిలుచుకుంటారు. కళింగరాజు కాకర్లపూడి అప్పరాజు అనకాపల్లి కోట, కోటకు దక్షిణం వైపున నూకాలమ్మ గుడిని1450 సం॥లో కట్టించాడు.
ప్రస్తుతం ఈ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖవారి ఆధీనంలో ఉంది.
ఇక్కడ నూకాలమ్మ జాతర ప్రతి సంవత్సరం కొత్త అమావాస్య (తెలుగు సంవత్సరాది(ఉగాది)) రోజునుండి నెలరోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా మలేసియా, సింగపూర్ నుండి అధికసంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని వెళతారు. కొత్త అమవాస్యనుండి రెండు మూడు నెలలపాటు అధికసంఖ్యలో భక్తులు అమ్మవారి ఆశీర్వాదం కోసం తరలి వస్తారు. జాతర చివరిరోజు 'నేలపండుగ' అనే ఉత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటారు.
No comments:
Post a Comment