శివరాత్రినాడు మనసు శివాలయ దర్శనం కోసం తహతహలాడుతుంది. శివదర్శనం సూర్యోదయం నుంచి రాత్రి పన్నెండుగంటల మధ్య చేసుకోవచ్చు.
శివరాత్రినాడు మాత్రం ఏ సమయంలోనైనా చేసుకునే వీలుంది. అయితే సూర్యోదయం, సూర్యాస్తమయ కాలాలను ప్రదోష కాలాలు అంటారు.
ప్రదోష సమయాల్లో శివదర్శనం చేసుకుంటే గ్రహదోషాలు తొలగిపోతాయి. సర్వసంపదలూ లభిస్తాయి.
శివరాత్రినాడు అర్ధరాత్రి శివదర్శనం చేసుకుంటే శాశ్వత కైలాస నివాసం లభిస్తుంది. రాహుకాలంలో శివుడిని దర్శించినా, అభిషేకించినా పదవులు, ఉద్యోగాలు లభిస్తాయి. మధ్యాహ్నం పన్నెండుగంటల వేళ శివదర్శనం చేసుకుంటే భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం కుదురుతుంది.
No comments:
Post a Comment