నిత్యోత్సవాలలో సుప్రభాతం, తోమాల సేవ , సహస్రనామార్చన, నిత్యకల్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం జరుగుతాయి. ఆర్జిత బ్రహ్మోత్సవంలో అశ్వవాహనం, హనుమంత వాహనం,గరుడసేవ మాత్రమే జరుగుతాయి ఏకాంతసేవ జరుగుతుంది. వారోత్సవాలలో స్వర్ణ ఫుష్ప అర్చన, శతకలశాభిషేకం, తిరుప్పావడసేవ, నేత్రదర్శనం, పూలంగి సేవ, అభిషేకం వస్త్రాలంకరణ సేవ, గ్రామోత్సవాలు మాత్రమే జరుగుతాయి. మాసోత్సవాలలో శ్రావణ నక్షత్రం నాడు ఉంజల్ సేవ జరుగుతుంది. వార్షికోత్సవాలలో ఉగాది ఆస్థానం, శ్రీరామనవమి, ధనుర్మాసంపూజ, మాఘమాసంలో అనగా సౌరమానం ప్రకారం కుంభమాసంలో శ్రావణ నక్షత్రానికి పూర్తి అయ్యాటట్లు 9 రోజుల ముందు నుండి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పాల్గుణమాసంలో శ్రవణ నక్షత్రం రోజు ఫుష్ప యాగం జరుగుతుంది. వైశాఖమాసంలో శ్రావణ నక్షత్రానికి పూర్తి అవడానికి మూడురోజుల పాటు వసంతోత్సవాలు జరుగుతాయి. ఆషాడ శుద్ధ సప్తమి లేదా ఉత్తరఫల్గుణి నాటికీ 3 రోజుల పాటు సాక్షాత్కార వైభోత్సవాలు జరుగుతాయి . జులై 16 లేదా 17 న ఆణివార ఆస్థానం జరుగుతుంది. ఆశ్వయుజమాసంలో బహుళద్వాదశికి మూడు రోజుల ముందు పవిత్రోత్సవాలు జరుగుతాయి.
శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు 1982 సంవత్సరం లో మహా సమాధి చెందినారు. ఆగష్టు 18 - సర్వభూపాల వాహనం, కల్పవృక్ష వాహనం ఆగష్టు 19 - హనుమంత సేవ , చంద్రప్రభ వాహనం ఆగష్టు 20 - చిన్న శేష వాహనం, హంస వాహనం ఆగష్టు 21 - సూర్యప్రభ వాహనం, గజ వాహనం ఆగష్టు 22 - అశ్వ వాహన సేవ, పెద్దశేష వాహన సేవ ఆగష్టు 23 - సింహ వాహనం, గరుడ వాహనం ఆగష్టు 24 - రథోత్సవం, తెప్ప మహోత్సవం ఆగష్టు 24 న ఆరాధన మహోత్సవం
పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో నిత్యపారాయణగా చెప్పుకుంటున్న వైశాఖ పురాణం చివరి అధ్యాయంలో శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకు తెలియజేసిన వైశాఖమాస మహత్యం గురించి నారద అంబరీషుల సంవాదం ద్వారా తెలుసుకుందాం. శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుల సంవాదం శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో "మహారాజా! వైశాఖమాసం శుక్ల పక్షంలో వచ్చే మూడు తిధుల ప్రాముఖ్యతను వివరిస్తాను వినుము" అంటూ ఈ విధంగా చెప్పసాగెను. తిథి పుష్కరిణి వైశాఖమాసంలో శుక్ల పక్షం చివరలో వచ్చే త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి తిథులకు తిథి పుష్కరిణి అని పేరు. పుష్కరిణి అంటే సర్వ పాపాలు పోగొట్టేది అని అర్ధం. ఈ తిథులకు ఇంతటి మహత్యం రావడానికి కారణం ఏమిటంటే పూర్వం దేవదానవులు క్షీరసాగర మధనం చేసినప్పుడు ఏకాదశి రోజు అమృతం పుట్టింది. ద్వాదశి రోజు శ్రీహరి రాక్షసుల నుంచి అమృతాన్ని కాపాడుతాడు. త్రయోదశి రోజు శ్రీహరి అమృతాన్ని దేవతలకు అందజేస్తాడు. చతుర్దశి రోజు శ్రీహరి రాక్షసులను సంహరిస్తాడు. పౌర్ణమి రోజు దేవతలందరు తమ సామ్రాజ్యాలను తిరిగి పొందుతారు. అందుకే ఈ మూడు తిథులను పుష్కరిణి అంటారు. వైశాఖ మాసం మొత్తం నదీస్నానం చేయలేనివారు ఈ మూడు తిథులలో స్నానం ...
కార్తీకమాసంలో తెల్లవారు జామునే వణికించే చలిలో చన్నీటితో లేచి తలారా స్నానం చేసి..కార్తీక దీపాలు పెడతారు మహిళలు. కార్తీక మాసం అంతా ప్రతీ రోజు ఏదోక పుణ్యకార్యాల్లోనే మునిగి ఉంటారు. శివకేశవులు దేవాలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. తమ కుటుంబాలు పిల్లాపాపలతో చల్లగా ఉండాలని వేడుకుంటారు. గోమాత పూజలు. ఆవునెయ్యితో కార్తీక దీపాలను తయారు చేసి దీపలక్ష్మికి పూజలు చేసి పారే నీటిలో వదులుతారు. సౌభాగ్యాలు కలిగించే తులసికోట ముందు భగవన్నామ సంకీర్తన చేస్తూ ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తారు. అలా కార్తీకమాసం అంతా మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండిపయేలా చేయటమే ఈ మాసం ప్రత్యేకత. సాధారణ రోజుల్లో పూజలు చేసినా కార్తీకమాసం మాత్రం ప్రత్యేకమైన ఆధ్యాత్తిక భావన కలిగిస్తుంది. శ్రావణమాసంలో శుక్రవారానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో కార్తీక మాసంలో సోమవారాలకు అంతటి విశిష్టత ఉంది. అంతేకాదు కార్తీకంలో వచ్చే దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులకు అంతటి విశిష్టత ఉంది. శ్రావణమాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రార్థిస్తే..కార్తీకమాసంలో ఆమె పతిదేవుడైన శ్రీమహావిష్ణువు పూజింటం ఈ మాసం ప్రత్యేకత. విష్ణువును తులసిదళాలతో పూజిస్తే సౌభాగ్యాలను అన...
శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామికి ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నుంచి వైశాఖ బహుళ పాడ్యమి వరకూ పంచాహ్నికంగా, స్మార్త ఆగమ విధాన పూర్వకంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఏకాదశినాడు స్వామివారి కల్యాణోత్సవం కన్నులపండువగా జరుగుతుంది. కల్యాణోత్సవం అనంతరం గరుడ వాహనసేవ, ద్వాదశినాడు హోమం, రావణ వాహనసేవ ఉంటాయి. త్రయోదశినాడు కల్యాణ సదస్యం నిర్వహిస్తారు. చతుర్దశినాడు స్వామివారి విహార యాత్ర, పూర్ణిమనాడు చక్రతీర్థం, బహుళ పాడ్యమినాడు పుష్పయాగం నేత్రానందకరంగా సాగుతుంది. ఈ ఉత్సవాలకు రత్నగిరి క్షేత్ర పాలకులైన శ్రీసీతారాములు సారథ్యం వహిస్తారు. శ్రీరాముడే సభాపతిగా పండిత సత్కార కార్యక్రమం కూడా జరుగుతుంది. శుభకార్యాల్లో సత్యనారాయణ స్వామి వ్రతాచరణాన్ని తెలుగువారు కల్పవృక్షంగా భావిస్తారు. సత్యదేవుని వ్రతం చేస్తే సకల కార్యాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. సత్యదేవుడి వ్రతకథల్లో స్వామివారి మహాప్రసాదానికి ప్రత్యేక సానముంది. గోధుమ నూక, ఆవు నెయ్యి, చక్కెర, సుగంధ ద్రవ్యాలతో కలిపితయారుచేసే 'సుపాద' అనే అన్నవరం ప్రసాదం మహిమాన్వితమైనదని భక్తుల విశ్వాసం. ఈ ఉత్సవాలకు పెళ్లి పెద్దలుగా రత్నగిరి క్షేత్రపాలకులు శ్రీసీతారా...
శ్రీ భ్రమరాంబ సమేత చెన్న మల్లికార్జున స్వామి ఆలయం ఎలకుర్రు గ్రామం, పామర్రు మండలం, కృష్ణ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. 2025 కార్యక్రమ వివరాలు: మే 07** – అంకురార్పణ, వేద పఠనం, సహస్రనామార్చన, రుద్రాభిషేకం, బలిహరణ, ద్వజారోహణ (సాయంత్రం) మే 08** – అంకురార్పణ, వేద పఠనం, సహస్రనామార్చన, రుద్రాభిషేకం, బలిహరణ మే 09** – అంకురార్పణ, వేద పఠనం, సహస్రనామార్చన, రుద్రాభిషేకం, బలిహరణ మే 10** – విశేష పూజ, **కళ్యాణ మహోత్సవం** (ప్రధాన వివాహ కార్యక్రమం) మే 11** – విశేష పూజ మే 12** – ఏకాదశ ప్రదక్షిణ, త్రిశూల స్నానం (ఉత్సవ ముగింపు శుద్ధి కార్యక్రమాలు)
గోవత్స ద్వాదశి అనగా మన ఆవులు లేదా గోవులు కోసం జరుపుకునే పండుగ. ఆశ్వయుజ మాసం లో కృష్ణపక్ష ద్వాదశి రోజు ఈ పండుగ జరుపుకుంటారు ఇది సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ మాసాలలో వస్తుంది. కొని చోట్ల దీనిని నందిని వ్రతం అని కూడా పిలుస్తారు. దీని తరువాత రోజు ధనత్రయోదశి దీనిని గురించి భవిష్య పురాణం లో కూడా చెప్పబడింది. ఈ రోజు ముఖ్యంగా గోవులను పూజిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం గోవులు ఎంతో పవిత్రమైనవి, మన రోజు వారి జీవితం లో కూడా అవి ఒక భాగంగా చాల మంది చూసుకుంటారు. ఉత్తర భారతదేశంలో అయితే ఈ పండుగను చాల బాగా జరుపుకుంటారు . సంతానం లేని వారు ఈ రోజు వ్రతం ఆచరిస్తారు. ఉత్తర భారత దేశం లో కొంత మంది వ్యాపారులు ఈ రోజు నుంచి కొత్త అకౌంట్ పుస్తకాలూ రాస్తారు. ఈ రోజు ఎవరైతే గోవును పూజిస్తారో వారికీ మంచి ఆరోగ్యం తో పాటు సుఖసంపదలు కలుగుతాయి అని భావిస్తారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం లో శ్రీ పాద శ్రీ వల్లభ ఆరాధన ఉత్సవం జరుగుతుంది. ఉదయాన్నే గోవులకు స్నానం చేసి పసుపు కుంకుమతో అలంకరిస్తారు. గోవులు అంటే శ్రీ కృష్ణడుకి ఎంతో ఇష్టం కన...
తమిళంలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్ళున్న వీధులను పవిత్రంగా భావించి ‘మాడాం’ అని పిలుస్తారు. అదే మాడవీధులుగా మారింది.ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామి వారు వాహనంలో ఊరేగటానికి గాను సరియైన వీధులుండేవి కావు. అంచేత బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ ఇక్కడ చేసినా మిగతా కార్యక్రమాలు, ఊరేగింపులు తిరుచానూరులో జరిపేవారు.శ్రీరామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధుల నేర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగేందుకు ఏర్పాట్లు చేశారు. తిరుమల ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులున్నాయి. వీటిని నాలుగు వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు. 1.తూర్పు మాడ వీధి: ఆలయం తూర్పు ముఖంగా ఉంది ఎదురుగా ఉన్నదే తూర్పు మాడవీధి. శ్రీవారి ఆలయం ముందు నుండి పుష్కరిణి వరకుండే వీధిని తూర్పు మాడ వీధి అంటారు. ఒకప్పుడు పుష్కరిణి గట్టు పైన కూడా ఇళ్ళుండేవి.ఈ వీధిలోనే శ్రీవారి కొయ్య రథం ఉండేది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న(ఉండే) వీధిని సన్నిధి వీధి అంటారు.ఒకప్పుడు సన్నిధి వీధి, వేయికాళ్ళ మండపం ఉండేవి. సన్నిధి వీధికి ఇరు ప్రక్కలా అంగళ్ళుండేవి. ఈ వీధికి ప్రారంభంలో గొల్ల మండపం, చివరలో బేడి ఆంజనేయస్వామి గుడి ఉండేవి.క్రీ.శ. 1464 నాటి శాసనం ప్రకారం ఎర్రకంప దేవక...
శబరిమల అయ్యప్ప స్వామి పవళింపు పాత హరివరాసనం. ఈ పాట వింటుంటే మది ఆనంద తాండవం చేస్తుంది. ఈ పాట పాడుతుండగా గర్భాలయంలో ఒక్కొక్క దీపం కొండెక్కిస్తారు.చివరికి ఒక దీపం మాత్రం ఉంచుతారు. 1950 వ దశకంలో శబరిమల నిర్మానుష్యంగా ఉండేది. ఆ కాలంలో గోపాలమీనన్ అనే భక్తుడు స్వామివారికి ప్రత్యేక పూజల సందర్భంగా ఈ పాటను పారాయణ చేసేవాడు. గోపాలమీనన్ మరణ వార్త తెలుసుకున్న అప్పటి తంత్రిగా (పూజారి) వున్న ఈశ్వర్ నంబూద్రి ఆ రోజు ఆలయం మూసే సమయంలో హరివరాసనం గానం చేశాడు. అప్పటి నుండి శబరిమలలో ఆలయం మూసే ముందు ఈ పాట పాడడం సంప్రదాయంగా మారింది. హరివరాసనం విశ్వమోహనం - హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం అరివిమర్ధనం నిత్యనర్తనం - హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా సమున్నతమైన ఆసనాన్ని అధిష్టించినవాడివి, విశ్వాన్ని మోహింపచేసేవాడివి, సూర్యునిచే పాదపూజలందుకునేవాడివి, శత్రులను(ఆత్మశత్రులు, బాహ్య శత్రులు) నాశనం చేసేవాడివి, హరిహరులు పుత్రడవు అయిన ఓ అయ్యప్ప దేవా నీ ఆశ్రయం కోరుతున్నాను. శరణకీర్తనం శక్తమానసం - భరణలోలుపం నర్తనాలసం అరుణభాసురం భూతనాయకం - హరిహరాత్మజం దే...
వర్జ్య కాలం అంటే విడువ తగిన కాలం, అశుభ సమయం. అంటే వర్జ్యం వున్న సమయాన్ని విడిచిపెట్టాలని శాస్త్రం చెబుతోంది. వర్జ్యంలో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడంగానీ, శుభకార్యాలకి బయలుదేరడం కాని చేయకూడదు. వర్జ్యంలో దైవకార్యాలు గానీ, శుభకార్యాలుగాని చేయకూడదని అంటూ వుంటారు కాబట్టి, ఆ సమయంలో దైవారాధనకి సంబంధించిన అన్ని పనులతో పాటు, శక్తి కొద్ది దానం కూడా చేయవచ్చని శాస్త్రం చెబుతోంది. వర్జ్యం వున్నప్పుడు దైవనామస్మరణ , పారాయణం , స్తోత్ర పఠనం , సంకీర్తన , భజనలు మొదలైనవి చేయవచ్చని శాస్త్రం చెబుతోంది. ఈ విధంగా చేయడం వలన వర్జ్యం కారణంగా కలిగే దోషాలు ఏమైనా వుంటే అవి తొలగిపోతాయనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
Comments
Post a Comment