- గోవత్స ద్వాదశి అనగా మన ఆవులు లేదా గోవులు కోసం జరుపుకునే పండుగ.
- ఆశ్వయుజ మాసం లో కృష్ణపక్ష ద్వాదశి రోజు ఈ పండుగ జరుపుకుంటారు
- ఇది సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ మాసాలలో వస్తుంది.
- కొని చోట్ల దీనిని నందిని వ్రతం అని కూడా పిలుస్తారు. దీని తరువాత రోజు ధనత్రయోదశి
- దీనిని గురించి భవిష్య పురాణం లో కూడా చెప్పబడింది.
- ఈ రోజు ముఖ్యంగా గోవులను పూజిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం గోవులు ఎంతో పవిత్రమైనవి, మన రోజు వారి జీవితం లో కూడా అవి ఒక భాగంగా చాల మంది చూసుకుంటారు.
- ఉత్తర భారతదేశంలో అయితే ఈ పండుగను చాల బాగా జరుపుకుంటారు .
- సంతానం లేని వారు ఈ రోజు వ్రతం ఆచరిస్తారు.
- ఉత్తర భారత దేశం లో కొంత మంది వ్యాపారులు ఈ రోజు నుంచి కొత్త అకౌంట్ పుస్తకాలూ రాస్తారు.
- ఈ రోజు ఎవరైతే గోవును పూజిస్తారో వారికీ మంచి ఆరోగ్యం తో పాటు సుఖసంపదలు కలుగుతాయి అని భావిస్తారు.
- ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం లో శ్రీ పాద శ్రీ వల్లభ ఆరాధన ఉత్సవం జరుగుతుంది.
ఉదయాన్నే గోవులకు స్నానం చేసి పసుపు కుంకుమతో అలంకరిస్తారు. గోవులు అంటే శ్రీ కృష్ణడుకి ఎంతో ఇష్టం కనుక, కృష్ణ భగవానుడిని కూడా పూజిస్తారు. కొంత మంది మహిళలు ఈ రోజు ఉపవాసం వుంటారు
దీని వల్ల పిల్లలకు మంచి జరుగుతుంది అని భావిస్తారు. కొన్ని చోట్ల ఈ రోజు ఆవు పాలు, నెయ్య తినరు. కొంత మంది జాగారం కూడా చేస్తారు.
2024: అక్టోబరు 29.
Comments
Post a Comment