Bhadrapada Masam: భాద్రపద మాసం 2024


  •  చాంద్రమానంలో భాద్రపద మాసం ఆరవ నెల.
  • ఈ నెలలోని పౌర్ణమినాడు చంద్రుడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రానికి సమీపంలో ఉండటం చేత ఇది భాద్రపద మాసం అని అంటారు. 
  • దశావతారాలలో మూడవ అవతారమైన వరాహ అవతారాన్ని, అయిదవ అవతారమైన వామన అవతారాన్ని శ్రీ మహావిష్ణువు భాద్రపదమాసంలోనే ధరించాడు. 
  • ఈ నెలలో హృషీకేశుని ప్రీతీ కొరకు ఉప్పును, బెల్లంను, దానం చేయడం మంచిది.
  • ఈ నెలలో ఏకన్నా ఆహారవ్రతం ముఖ్యమైనది. ఈ వ్రతంలో ఒక పూట భోజనం చేసి మరోపూట ఉపవాసం ఉండాలి. ఇలా చేయడం వల్ల సంపదలు చేకూరుతాయి అని ధర్మసింధు చెబుతోంది.
  • పితృదేవతల పూజకు కూడా ఈ మాసం ఎంతో అనువైనది.
  • ఈ నెలలోని శుక్లపక్షం దేవతాపూజకు ఉత్తమమైనది కాగా, కృష్ణపక్షం పితృపూజకు విశేషమైనది.
  • భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు గల కాలానికి "మహాలయపక్షం" అని పేరు .దీనిని పితృపక్షం అని కూడా పిలుస్తారు .
  • మహాలయ పక్షాలలో ఎటువంటి శుభకార్యాలు చేయరు.
  • మహాలయపక్షంలో ప్రతిరోజు చనిపోయిన తల్లితండ్రులకు, పూర్వీకులకు తర్పణాలు వదిలి  , కర్మలు చేయాలనీ శాస్త్రం చెబుతోంది. 
  • ఈ మహాలయ పక్షంలోని కర్మల గురించి, స్కందపురాణంలోని నాగ ఖండంలోను, మహాభారతంలోను వివరించబడింది.

2024: సెప్టెంబర్ 04  నుండి అక్టోబర్ 02  వరకు 

No comments