విజయనగర ప్రభువు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో వీణ గురువు గాన గంధర్యుడు కృష్ణాచార్యులు. వారి కుమారుడు కనకాచల భట్టు. అతని కొడుకు తిమ్మాణ్ణాచార్యులు. అతని ధర్మపత్ని గోపమ్మ. వారి ఇష్టదైవం శ్రీవేంకటేశ్వరస్వామి. తరతరాలుగా విజయనగరంలో నివాసం ఉంటున్న వారు, తళ్ళికోట యుద్ధానంతరం (1565) ధర్మరక్షణ కరవైన విజయనరగం విడిచి, చోళరాజ్యం కాంచీపురంలోని పట్టణ అగ్రహారం చేరుకున్నారు. వారి సంతానం, కూతురు వెంకటమ్మ కొడుకు గురురాజు. ఈ ఇరువురికి తోడు, తమకు ఇంకొక పుత్రుడు కావలనెని కోరిక కలిగింది. ఈ దంపతుల అపారమైన భక్తికి మెచ్చి శ్రీవేంకటేశ్వరస్వామి ఒక తేజో మండల రాశిగా స్వప్నదర్శనం ఇచ్చి ఆశీర్వదించారు. తత్ఫలితంగా గోపపమ్మ.. ఫాల్గుణ శుద్ధసప్తమి గురువారం రోజున ఒక మగ శిశువును కన్నది. సూర్యబింబం వలే ప్రకాశించే ఆ శిశువుకు వెంకటనాథుడు అనే పేరు పెట్టారు.
ఈ బాలుడు ఆడే ఆటలు, పలికే పలుకులలో ఎంతో పరమార్థ చింతన ఉండేది. పండితులు సైతం బాలుడి మాటలలోని లోతైన అంతరార్థాన్ని గమనించి, ఎంతగానో ఆశ్చర్యపోయేవారు. ఈ బాలుడు సామాన్యుడు కాడు దివ్యాంశ సంభూతుడని ఆనాటి కొందరు పండితులు గ్రహించారు. ఈ బాలుడికి 3వ ఏట అక్షరాభ్యాసం జరుగుతున్నపుడు పలకపై "ఓం " కారం రాసి దీనిని దిద్దమని తండ్రి చెప్పగా "ఈ ఒక్క అక్షరం నారాయణం స్వరూపం ఎలా అవుతుంది" అని ఆశ్చర్యపోయారు. బంధుమిత్రులు ఇతనికి ఉన్న జ్ఞానానికి పరమానందభరితులయ్యారు. గురురాజుకు ఉపనయనం జరిగిన కొద్దిరోజులకే, తిమ్మణ్ణాచార్యులు పరమపదించారు. కుటుంబభారం గురురాజుపై బడింది. తమ్ముడికి ఉపనయనంచేసి బావ లక్ష్మీనరసింహచార్యుల వద్దకు చదువుకోసం పంపాడు.
వెంకటనాథుడు బావగారి వద్ద సమస్త శాస్త్రాలు, నిత్యకర్మానుష్టానాలను నేర్చుకున్నాడు. వీణావాదనలో ఆరితేరినాడు. సమస్త శాస్త్రపారంగతుడైన వెంకటనాథుడు యవ్యనంలోకి ప్రవేశించాడు. తమ్ముడికి గురురాజు పక్క అగ్రహారానికి చెందిన సరస్వతితో వివాహం జరిపించాడు. సరస్వతి, సౌందర్య సౌశీల్యములగని, వెంకటనాథుడికి తగిన ఇల్లాలు.
సరస్వతీ కటాక్షమేకాని, లక్ష్మీ కటాక్షం లేదు. శక్తి వైపద్యంగా మనసు హోమంగా హరిస్మరణం ఆహారంగా స్థితి ఏర్పడింది. అప్పుడప్పుడు పౌరోహిత్యంతో, అనుదినం పిల్లలకు పాఠాలు చెపుతూ, కష్టంగా బతుకుతున్న ఆ దంపతులకు కలిగిన పుత్రుడు లక్ష్మీనారాయణ.
వెంకటనాథుడుకి సరస్వతీ కటాక్షమేకాని, లక్ష్మీ కటాక్షం లేదు. శక్తి వైపద్యంగా మనసు హోమంగా హరిస్మరణం ఆహారంగా స్థితి ఏర్పడింది. అప్పుడప్పుడు పౌరోహిత్యంతో, అనుదినం పిల్లలకు పాఠాలు చెపుతూ, కష్టంగా బతుకుతున్న ఆ దంపతులకు కలిగిన పుత్రుడు లక్ష్మీనారాయణ.ప్రస్తుతం తనున్న పరిస్థితిలో మార్పు వస్తుందనే ఆశతో కుంభకోణం సుధీంద్ర తీర్థుల సన్నధికి చేరాలని సంకల్పించి కుటుంబంతో సహా కుంభకోణం చేరుకున్నాడు వెంకటనాథుడు. 2 అతని పేరు ప్రఖ్యాతులు ఇది వరకే తెలిసిన సుధీంద్ర తీర్థులవారు వెంకటనాథుడిని ఎంతగానో ఆదరించి తమ మారంలో ఆశ్రయం ఇచ్చాడు. సుదీంద్ర తీర్థులవారి పీఠంలో సహాయపడుతూ సుధీంద్రులకు ఎంతగానో ప్రేమ పాత్రులయ్యాడు వెంకటనాథుడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి కుదుట పడింది. పీఠంలో పూజలు చేస్తూ కుటుంబంతో హాయిగా కాలం గడుపుతున్నాడు. మధ్వ పీఠం - సర్వజ్ఞపీఠం దర్శించుకునే గొప్ప మేధావులలైన మహాపండితులుకూడా వెంకటనాథుని శాస్త్ర పరిజ్ఞానం, పాండిత్యప్రతిభకు ఎంతగానో ముగ్దులయ్యేవారు.
వారంతా తన శిష్యుడైన వెంకటనాథుని ప్రశంసిస్తుంటే సుధీంద్ర తీర్థులవారు పరమానంద భరితులయ్యేవారు. వెంకటనాథుడే ఈ మఠానికి సరియైన వారసుడని సుధీంద్రతీర్థులు దృఢంగా నిర్ణయించుకున్నారు. ఈ విషయమే వెంకటనాథుడికి చెప్పారు. వెంకటనాథుడు దానికి ఏ మాత్రం అంగీకరించలేదు. పీఠాధిపత్యం వార్త తనకు తన కుటుంబానికి పిడుగుపాటులాంటిదని భావించి గురువుగారి నిర్ణయాన్ని తిరస్కరించారు.
మరి కొద్దిరోజుల తరువాత సుధీంద్ర తీర్పులవారికి శ్రీరాముడు స్పప్న దర్శనం ఇచ్చి వెంకటనాథుడినే పీఠాధిపతిగా చేయమని ఆజ్ఞాపించాడు. ఈ విషయమే. వెంకటనాథుడికి చెప్పి వార్ధాఖ్యంలో ఉన్ననాకు నీ సమ్మతి తెలిపి పీఠాధిపత్యం వహించమని కోరారు. గురువుగారి మాటను సున్నితంగా తిరస్కరించాడు. వెంకటనాథుడు. ఆ. మరుసటి రోజు సాక్షాత్తు సరస్వతీదేవి వెంకటనాథుడికి స్వప్నంలో కనిపించి నీవు కారణజన్ముడవు. నేటి సమస్త సమాజం నీ మార్గదర్శకత్వంలో పయనించాలి. మధ్వ పీఠం, సర్వజ్ఞ పీఠం అధిష్టించు, మూలరాముని పూజలతో ఈ జగత్తుకు ముక్తి మార్గం చూపు అని, అనేక రకాలుగా హితబోధ చేసింది. నీ భార్యకు నీ కుమారుడికి తగిన పోషణకు ఏర్పాటు జరుగుతాయి. నీవు పీఠాధిపత్యం వహించి, మూల రాముని విగ్రహలతో దేశయాత్ర ప్రారంభించు అని అజ్ఞాపించింది వాక్కుల అధిష్టానదేవద వాగ్దేవి. వెంటనే మెలుకువచ్చింది. భార్యకు కల వృత్తాంతం చెప్పాడు. భార్య అయిష్టంగానే ఒప్పుకున్నది. మనసును స్థిమిత పరచుకొని పీఠాధిసత్యం వహించానికి వొప్పుకున్నాడు. సుధీంద్ర తీర్థులవారి ఆనందానికి అవధులు లేకపోయింది. వెంకటనాథుడి భార్యకు, కొడుకుకు శాశ్వతమైన పోషణకు చక చకా ఏర్పాట్లు జరిగాయి. వెంకటనాథుడికి ముందుగా సుధీంద్ర తీర్థుల వారు సన్యాస దీక్ష ఇచ్చి శ్రీ విద్యామంత్రం ఉద్దేశించి శ్రీ రాఘవేంద్ర తీర్థులు అనే దీక్షా నామం ప్రసాదించారు.
శ్రీ రాఘవేంద్ర తీర్థులు మధ్వ పీఠం సర్వజ్ఞ పీఠం అధిపతి అయిన తరువాత మూలరాముని విగ్రహమూర్తులతో, మధ్వ పీఠం పరివారంతో దేశాటన చేసారు. ఇలా దేశాటనలో శ్రీ రాఘవేంద్రస్వామి అనేక చోట్ల మూలరాముని పూజలు = ఘనంగా చేస్తూ మానవాళిని ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్ళిస్తూ మధ్వ సంప్రదాయ విశిష్టత బోధిస్తు.. అనేక అద్భుత లీలలు ప్రదర్శిస్తూ దేశమంతా పర్యటిస్తున్నారు. ఆనాటి రాజులు, నవాబులు సైతం స్వామివారికి పరమభక్తులుగా మారారు. అన్ని చోట్ల వారికి ప్రజలు ప్రభువులు బ్రహ్మరథం పట్టేవారు. రాఘవేంద్రస్వామివారి మహిమల గురించి విన్న నవాబుకు ఏ మాత్రం నమ్మకం కలుగలేదు. దర్బారుకి ఆహ్వానించి స్వామివారిని పరీక్షించదలచి, గుడ్డ కప్పిన మాంసాహారాన్ని స్వామికి సమర్పించారు. స్వామివారు మూలరాముని ధ్యానించి, దానిపై తీర్థం చల్లాడు. కప్పిన గుడ్డను తీసివేయించారు. ఆ మాంసాహారం అంతా మధురమైన పండ్లుగా, కమ్మని మిఠాయిలుగా మారాయి. నవాబుకు గర్వభంగం అయింది. పశ్చాతాపంతో క్షమాపణలు వేడుకున్నాడు. స్వామివారు ఏది అడిగితే అది ఇస్తానన్నాడు. స్వామివారి కోరిక మేరకు తుంగభద్ర తీరంలోని మంచాల ప్రాంతాన్ని స్వామివారికి ఇచ్చాడు. పూర్వం ఆ ప్రదేశం ప్రహ్లాదుని యజ్ఞవాటికగా ఉండేది. అందుకే స్వామి వారి ఆ కోరిక కోరారు. నిరంతర వేద ఘోషలు ప్రతిధ్వనించే ఆ ప్రాంతంలో స్వామివారు ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యం మూలరాముని పూజలు చేయడం ప్రారంభించారు. అలా అది నేడు మంత్రాలయం గురు రాఘవేంద్రస్వామి మఠంగా సుప్రసిద్ధమైంది.
పాల్గుణమాసం శుద్ధ విదియ నాడు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సన్యాసాశ్రమం స్వీకరించిన రోజు,సప్తమి తిధి వారి జయంతి.
ఈ రెండు సందర్భాల నేపథ్యంలో ఏటా మంత్రాలయంలో గురువైభోత్సవాలు ఘనంగా జరుగుతాయి.ఈ ఉత్సవాలకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తారు.
No comments:
Post a Comment