Amrutha Lakshmi Vrat: అమృత లక్ష్మీ వ్రతం

ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్ల పక్ష విదియ రోజున జరుపుకుంటారు.

ఈ వ్రతం సంపదలకు ప్రతిరూపమైన లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ఆచరిస్తారు. ఈ వ్రతం చేసేవారు ఈ రోజు ఉపవాసం ఉంటారు. ఈ రోజున అన్నదానం, వస్త్రదానం వంటి వివిధ రకాల దానాలను చేయడం శ్రేష్ఠం. భౌతిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం అమృత లక్ష్మీ వ్రతం చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన లక్ష్మీదేవి శీఘ్రంగా అనుగ్రహిస్తుందని పండితులు చెబుతారు.

అమృత లక్ష్మీ వ్రతం ఆచరించేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాదులు ముగించుకొని పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. ఒక పీఠంపై ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహం ఉంచి పసుపు కుంకుమ, పూలతో అలంకరించుకోవాలి. మొదట గణపతిని ప్రార్థించి లక్ష్మీపూజ ప్రారంభించాలి.లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి, శ్రీ సూక్తం లేదా లక్ష్మీదేవికి సంబంధించిన ఇతర స్తోత్రాలను పారాయణం చేయాలి.

కొబ్బరికాయ కొట్టి పండ్లు, తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. వీలయితే బంగారం, వెండి నాణేలు సమర్పించాలి. ఇవి సమర్పించడం వలన లక్ష్మీదేవి సంతుష్టురాలై మనకు మరిన్ని సంపదలు ప్రసాదిస్తుంది. చివరగా హారతి ఇచ్చి పూజ ముగించాలి.

2025: జూన్ 27.

Comments

Popular posts from this blog

Puri Ratha Yatra: పూరీ జగన్నాధుని రథయాత్ర

Ashada Month 2025: ఆషాడ మాసం

Ashada Navratri 2025: ఆషాడ నవరాత్రి, వారాహి నవరాత్రి

Pandharpur Yatra 2025: పండరీపుర్ యాత్ర – భక్తి, ఐక్యతకు ప్రతిరూపం

Angaraka Chaturdasi: కృష్ణ అంగారక చతుర్దశి

Jyestha Amavasya: జ్యేష్ఠ అమావాస్య

Skanda Panchami: స్కంద పంచమి

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Srisailam Temple: శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం - శ్రీశైలం