Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట - HINDU DHARMAM

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Friday, February 28, 2025

demo-image

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Responsive Ads Here
yadagirigutta%20temple

యాదగిరిగుట్ట ఆలయం త్రేతాయుగం కాలం నాటిది.శ్రీరాముని బావగారైన ఋష్యశృంగ మహర్షి కుమారుడే యాదర్షి. ఆయన తపస్సు వల్లనే లక్ష్మీనరసింహ స్వామి యాదగిరిపై పంచనారసింహ రూపాలలో వెలిశాడు. ఆనాడు యాదమహర్షి చూసిన ఉగ్రనారసింహ రూపమే యాదగిరి గుట్ట అయిందని చెబుతారు. యాదాద్రికి క్షేత్రపాలకుడు ఆంజనేయుడు. ఆయన ఆజ్ఞ మేరకే యాదర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేయడానికి వచ్చాడు. యాదర్షి తపస్సుకు కూడా ఆంజనేయుడు ఎంతో సహాయం చేసినట్లు స్థలపురాణం చెబుతోంది. యాదాద్రిలో ప్రసన్నాంజనేయుని మనం దర్శించుకోవచ్చు. అక్కడే గండభేరుండ స్వామి దర్శనం కూడా అవుతుంది. ఆయనకు ప్రదక్షిణలు చేస్తే సర్వరోగాలు, భూతప్రేత పిశాచాదుల బాధలు పోతాయి. యోగానంద నారసింహుడు. దక్షిణాభిముఖుడై యోగముద్రలో జ్ఞానదాయకునిగా ప్రసిద్ధి పొందాడు. దేవప్రాచీదిశలో వెలిసిన లక్ష్మీనృసింహస్వామి దర్శన మాత్రంతో కోరికలను నెరవేరుస్తాడు. రెండు శిలాఫలకాల మధ్య సర్పాకారంలో శ్రీచూర్డరేఖను ధరించివున్న రూపం జ్వాలానృసింహమూర్తి. ఇక యాదాద్రి కొండంతా ఆవరించివున్న మహారూపం ఉగ్రనృసింహమూర్తి. మూలమూర్తిగా విరాజిల్లుతున్న స్వయం భూనృసింహమూర్తి ఈ పంచనృసింహుల సమ్మేళన రూపం.

యాదగిరిగుట్టలోని గుహలో కృతయుగం నుంచి స్వామి ఉండేవాడని ప్రతీతి. ఆ స్వామి వారిని ఆనాడు బ్రహ్మాది దేవతలు ఆకాశగంగతో అభిషేకం చేశారు. ఆ పవిత్ర పాదతీర్థం విష్ణుకుండమై పవిత్ర దివ్యధారగా యాదాద్రిలో నేటికీ భక్తులను పునీతులను చేస్తోంది.

ఆ తరువాత యాదమహర్షి తపస్సు చేసుకునే కాలంలో ఒకసారి భయంకర ఆకృతి గల రాక్షసుడొకడు మహర్షిని కబళించడానికి రావడంతో భక్తరక్షణార్థం భగవానుడు శ్రీచక్రరాజాన్ని ప్రయోగించాడు. అది దివ్యమైన అగ్ని జ్వాలలతో మండిపడుతూ ఆ రాక్షసుని శిరస్సును తెంచివేసింది. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ గోపురంపై షట్కోణ ఆకారంలో ఆవిర్భవించాడు. దర్శనమాత్రం చేత భక్తులకు రోగ ఉపశమనం చేస్తున్నాడు. 12వ శతాబ్దిలో పశ్చిమ చాళుక్య చక్రవర్తి ఇక్కడి భువనగిరిలో కోటను నిర్మించుకుని, ఈ స్వామిని కొలిచాడని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తున్నది.

బ్రహ్మోత్సవ శోభ

సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకూ యాదాద్రిలో పాంచరాత్రాగమాన్ని అనుసరించి నిర్వహిస్తారు. నిత్యోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాలు, ఆళ్వారాదుల తిరునక్షత్ర మహోత్సవాలు, ఇంకా అనేక ఉత్సవాలు నిర్వహిస్తారు. నవాహ్నిక దీక్షతో 11రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ విదియ నుంచి ద్వాదశి వరకూ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ధ్వజారోహణం నుంచి శృంగార డోలోత్సవం వరకూ అన్ని కైంకర్యాలను ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎదుర్కోలు మహోత్సవం, తిరు కల్యాణ మహోత్సవం, దివ్య విమాన రథోత్సవం ముఖ్యమైనవిగా ఉంటాయి. భక్త జనుల సంకీర్తనలు, మేళతాళాల మధ్య బ్రహ్మోత్సవ వైభవం కోలాహలంగా ఉంటుంది. యాదాద్రీశుని కల్యాణానికి ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. ప్రతిరోజూ స్వామివారికి అలంకార, దివ్యవాహన సేవలు జరుపుతారు. రథోత్సవం కన్నుల పండువగా ఉంటుంది. చివరిగా శతఘటాభిషేకం నిర్వహిస్తారు. పుష్కరిణిలో జరిగే చక్రస్నాన ఘట్టంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటారు. అదేరోజున జరిగే శృంగార డోలోత్సవంతో యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమవుతాయి.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి 01 నుండి ప్రారంభం కానున్నాయి.

Yadagirigutta-Images-1-e1549559398513


వాహన సేవల వివరాలు :

మార్చి 01 - విశ్వకేశన పూజ (ఉదయం 10 ), అంకురార్పణం(సాయంత్రం)

మార్చి 02 - ధ్వజారోహణం(ఉదయం 11), దేవత ఆహ్వానం, భేరీపూజ,హవనం (సాయంత్రం)

మార్చి 03  - మత్స్య అవతారం(ఉదయం 11), శేష వాహన సేవ (రాత్రి)

మార్చి 04  - శ్రీ కృష్ణ అలంకార సేవ, హంస వాహన సేవ(రాత్రి 9 )

మార్చి 05 - వట పత్రశాయి అలంకారం,  పొన్న వాహన సేవ(రాత్రి 9 )

మార్చి 06 -  గోవర్ధన గిరి  అలంకారం, సింహ వాహన సేవ (రాత్రి)

మార్చి 07 - జగన్మోహిని అలంకార సేవ, అశ్వ వాహన సేవ ఎదురుకోలు(రాత్రి 9)

మార్చి 08 - శ్రీరామ అలంకారం, గజ వాహన సేవ, కల్యాణోత్సవం(ఉదయం ), కొండ కింద స్వామి వారి కళ్యాణం (రాత్రి)

మార్చి  09 - మహావిష్ణు అలంకారం , గరుడ వాహన సేవ(ఉదయం),  రథోత్సవం(రాత్రి)

మార్చి 10 - మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, పుష్ప యాగం దోపు ఉత్సవం

మార్చి 11 - శత ఘటాభిషేకం(ఉదయం), డోలోత్సవం(రాత్రి), ఉత్సవాల పరిసమాప్తి 

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages