Jyestha Amavasya: జ్యేష్ఠ అమావాస్య

జ్యేష్ఠ మాసంలో లో కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యను  జ్యేష్ఠ అమావాస్య అంటారు. జ్యేష్ఠ అమావాస్య పూర్వీకులను స్మరించుకోవడానికి, గౌరవించుకోవడానికి, వారి నుండి ఆశీస్సులు పొందడానికి మంచి రోజు. పూజలు, దానం మొదలైన అనేక కార్యక్రమాలతో పాటు పిండ ప్రదానం లేదా తర్పణం ఇవ్వడం జ్యేష్ఠ అమావాస్య నాడు పితృదేవతల పట్ల గౌరవాన్ని ప్రదర్శించడానికి చేస్తారు. ఇలా చేయడం వలన పితృదేవతలు ప్రశాంతంగా ఉండగలుగుతారు.

జ్యేష్ఠ అమావాస్య రోజు శివుడిని పూజించడం వలన ప్రతికూలతలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతుంది. ఈరోజున ఉపమా కలుగుతుంది. ఉపవాసం ఆత్మ శుద్ధి కలుగుతుంది. కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున పవిత్ర నదులు, జలాశయాలలో స్నానం చేయాలి. ఇలా చేస్తే పాపాలు తొలగిపోతాయి,

జ్యేష్ఠ అమావాస్య రోజున వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం, ఆనందకరమైన వైవాహిక జీవితం గడపడానికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారు. పెళ్లికాని అమ్మాయిలు కూడా తాము కోరుకున్న వరుడిని పొందడానికి ఈ రోజున రావి చెట్టును పూజించడం, సావిత్రి కథను చదువుతారు లేదా వింటారు.

ఈ రోజున పవిత్ర నది లేదా ఆలయ ప్రాంతాన సంధ్యా సమయంలో దీప దానం చేయాలి. రావి చెట్టు ముందు దీపం వెలిగించి దాని చుట్టూ ప్రదక్షిణలు చేయడం శుభఫలితాలనిస్తుంది. ఈ రోజున ధ్యానం చేయడం కూడా మంచిది. సంతానం లేనివారు రావి చెట్టును పూజించడంతో పాటు రావి మొక్కను నాటితే సంతానం కలుగుతుంది.

జ్యేష్ఠ అమావాస్య రోజున మద్యం, మాంసం మానుకోవాలి. డబ్బు అప్పుగా తీసుకోకూడదు. కొత్త వస్తువులు కొనకూడదు. ఎలాంటి తప్పుడు పనులు చేయవద్దు.

2025: జూన్ 25.

Comments

Popular posts from this blog

Yogini Ekadasi: యోగిని ఏకాదశి

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Bikkavolu Ganapati Temple: శ్రీ లక్ష్మి గణపతి ఆలయం - బిక్కవోలు

Magha Puranam Telugu: మాఘ పురాణం 10వ అధ్యాయం - ఇంద్రుని శాపానికి ఉపశమనం చెప్పిన శ్రీహరి- విశ్వామిత్రునికి వానర రూపం

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Angaraka Chaturdasi: కృష్ణ అంగారక చతుర్దశి

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Tiru Arimeya Vinnagaram Divyadesam: శ్రీ కుడమాడుకూత్తన్ దేవాలయం - తిరు అరిమేయ విణ్ణగరం