Skip to main content

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

 

తిరుమలలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు గరుడసేవ నిర్వహిస్తారు. ఆ రోజు దాదాపు 5 లక్షల మందికి పైగా భక్తులు తిరుమలను సందర్శిస్తారు. కాబట్టి తిరుమలలో గరుడసేవకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. 

ఇప్పుడు ప్రతి పౌర్ణమి రోజున స్వామి వారు గరుడ వాహనం పై భక్తులను అనుగ్రహిస్తారు. 

2024 తేదీలు 

జనవరి 25, గురువారం

ఫిబ్రవరి 24, శనివారం

మార్చి 25, సోమవారం

ఏప్రిల్ 23, మంగళవారం

మే 23, గురువారం

జూన్ 22, శనివారం

జూలై 21, ఆదివారం

ఆగస్టు 19, సోమవారం

సెప్టెంబర్ 18, బుధవారం

అక్టోబర్ 17, గురువారం

నవంబర్ 15, శుక్రవారం

డిసెంబర్ 15, ఆదివారం.

Comments

Popular posts from this blog

Kuladevata Puja: కులదేవతలు అని ఎవరిని అంటారు? వారిని తప్పక పూజించాలా?

రఘువంశరాజులకి కులదేవత సూర్యుడు. సూర్యుని పూజించిన తరువాతనే వారు ఇతర దేవతలను ఆరాధన చేసేవారు.  కులం అనే మాటకి సమాన లక్షణాలున్న సముదాయం, గుంపు అని అర్థం.  ఈ కాలంలో అది వర్ణభేదం అనే అర్ధంలో వాడుకలోకి వచ్చింది.  కానీ కులం అంటే వంశం అనే అర్థం సరైనది. ఒక వంశంలో తరతరాలుగా పూజలందుకునే దైవాన్ని కులదేవత అంటారు. ప్రతివంశానికి ఒకకులదేవత ఉంటుంది. ఇష్టదేవతారాధనకు ముందు కులదేవతారాధన చేయడం తప్పనిసరి.

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలో గాణగాపురం క్షేత్రం ఉంది. ఆలయ స్థల పురాణం అత్రి మహర్షి భార్య మహా సాధ్వి అనసూయమ్మ పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులను అనసూయ పసి బాలురుగా మార్చి వేయగా లక్ష్మి సరస్వతి పార్వతి అనసూయను ప్రార్ధించి తమ పతులను తిరిగి పొందగా అప్పుడు త్రిమూర్తుల అనుగ్రహంతో అత్రి అనసూయలకు త్రిమూర్తుల అంశగా దత్తుడిగా జన్మిస్తాడు. ఆ దత్తాత్రేయుని రెండవ అవతారమే శ్రీ నరసింహ సరస్వతిగా అవతరించినట్లుగా కథనం. అలా అవతరించిన శ్రీ నరసింహ సరస్వతి కాశీకి వెళ్ళి కృష్ణ సరస్వతి స్వామి దగ్గర సన్యాస దీక్షను చేపట్టి దేశమంతా తీర్ధ యాత్రలు చేస్తూ చివరకు కర్ణాటకలోని గాణగాపురంకు వచ్చి 23 సంవత్సరాలు అక్కడే ఉండి చివరకు తన పాదుకలను అక్కడే వదిలేసి శ్రీశైలంలోని కదళీ వనంలో అవతార పరిసమాప్తి గావించాడని పురాణగాథ. పాదుకలకు పూజ అలా నరసింహ సరస్వతి స్వామి వారు గాణగాపురంలో విడిచి వెళ్లిన పాదుకలను నిర్గుణ పాదుకలు అని అంటారు. నిర్గుణం అంటే ఎలాంటి ఆకారం లేనిదని అర్ధం. ఇలాంటి నిర్గుణ పాదుకలు ఒక్క గాణగాపురంలో తప్ప ప్రపంచంలో ఎక్కడ చూడలేం. ఈ పాదుకలనే స్వామిగా భావించి పూజలు జరుపుతారు. గాణగాపురం లోని స్వామి పాద...

Dhanurmasam: ధనుర్మాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరు?

ఏడాది పొడవునా నిత్య దైనందిన కార్యక్రమాలతో ఉంటూ భగవంతుని కోసం సమయం కేటాయించలేని వారి కోసమే ఈ ధనుర్మాసం. అందుకే ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. శుభకార్యాలు ఉండవు కాబట్టి ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు. ఎందుకంటే రవి ధనస్సు రాశిలోకి ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనుస్సు, మీనంలో రవి ఉన్నప్పుడు, సూర్యుని రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదు. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు. ఇంకా విష్ణుముర్తిని నిత్యం వేకువనే పూజించడం శుభం.

Kadiri Brahmotsavam 2024: శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు 2024 - కదిరి

  శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి 19 నుంచి ప్రారంభం కానున్నాయి . వాహన సేవ వివరాలు మార్చి 19 - అంకురార్పణ మార్చి 20 - శ్రీవారి కల్యాణోత్సవం మార్చి 21 - హంస వాహనం మార్చి 22 - సింహ వాహనం మార్చి 23 - హనుమంత వాహనం మార్చి 24 - బ్రహ్మ గరుడ వాహనం మార్చి 25 - శేష వాహనం మార్చి 26 - సూర్యప్రభ వాహనం, చంద్ర ప్రభ వాహనం మార్చి 27 - మోహిని ఉత్సవం  మార్చి 28 - ప్రజా గరుడ సేవ మార్చి 29  - గజ వాహనం మార్చి  20 - బ్రహ్మ రథోత్సవం మార్చి 31 - అశ్వవాహనం (అలకోత్సవం) ఏప్రిల్ 01 - తీర్థవాది, చక్రస్నానం, వసంతోత్సవం  ఏప్రిల్ 02 - ఫుష్ప యాగం

Karthika Masam: కార్తీకమాస మహత్యం (స్కంద పురాణం)

  దీపారాధన  కార్తీకమాసంలో శివాలయ గోపురంలో, ద్వారం దగ్గర, శిఖరం మీద శివలింగం సన్నిధిలో దీపారాధన చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి. ఎవరైతే కార్తీక మాసంలో ఆవునేతితో గానీ, నువ్వుల నూనెతో గానీ విప్పనూనెతో గానీ, నారింజనూనెతో గానీ శివాలయంలో భక్తిగా దీపారాధన చేస్తారో వారు సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందుతారు. కేవలం ఆముదంతో కార్తీక దీపాన్ని వెలిగించినా అఖండమైన పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో యోగ్యుడైన విప్రుడికి దక్షిణతో సహా దీపదానం చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుంది. వన భోజనం  కార్తీకమాసంలో చేసే వనభోజనం చాలా విశేషమైన ఫలితాన్నిస్తుంది. ఎన్నో రకాల  వృక్షాలతో వున్న వనంలోకి వెళ్ళాలి. అక్కడ ఉసిరి చెట్టు తప్పకుండా ఉండాలి. ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామాన్ని ఉంచి గంధపుష్పాక్షతలతో యథావిధిగా పూజించాలి.  ఆ తరువాత శక్తికొద్దీ విప్రుల్ని దక్షిణ తాంబూలాలతో తగిన విధంగా సత్కరించి తరువాత భోజనం చేయాలి. ఈ విధంగా శాస్త్ర బద్ధంగా కార్తీకమాస వనభోజనాన్ని చేస్తే సకల పాపాలూ నశించి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది గీతాపారాయణం కార్తీకమాసంలో శ్రీహరి సన్నిధిలో భగవద్గీతని పారాయణ చేస్తే అనంతమైన పుణ్యం కలుగుతుంది...

Tirumala Shanivaralu: తిరుమల శనివారాలు 2024

తమిళ మాసం అయిన పెరటాశి  మాసంలో తిరుమల శనివారాలు జరుపుకుంటారు. ఈ మాసం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వస్తుంది.  ఈ మాసంలోని శనివారాలు పవిత్రంగా భావించి విష్ణు ఆలయాలలో భక్తులు ప్రతేక్య పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలోనే తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరగడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.చాల మంది భక్తులు ఈ మాసంలో కేవలం శాకాహారం మాత్రమే స్వీకరిస్తారు. శ్రీమహావిష్ణువు శ్రీవేంకటాచలపతిగా అవతరించిన మాసమే పెరటాసి. ఈ మాసంలో శ్రవణ నక్షత్రంలో తిరుమలేశుడు అవతరించినట్లు శ్రీవేంకటాచల మహత్యం చెబుతోంది.  ప్రత్యేకించి శనివారం ఆయనకు ఎంతో ప్రీతి. పెరటాసిలో శనివారాలు నాలుగు లేక ఐదు వస్తాయి. వీటిలో మూడవ శనివారాన్ని తమిళులు చాలా విశేషంగా భావించడం ఆనవాయితీగా వస్తోంది.    ఈ మాసంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారికి  పిండి దీప సమర్పణ ఎంతో విశేషంగా జరుపుకుంటారు.  ఈ మాసంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాల  వైభవాన్ని  గురించి ఎంత చెప్పినా తక్కువే.  ప్రతి బ్రహ్మోత్సవం  తిరుమలలో విశేషంగా, వైభవంగా జరుగుతుంది. ఈ మాసంలో ముఖ్యంగా  కొంతమంది శ్రీ వైష్ణవుల తిరుమాళిగల్లో (ఇళ్ళల్లో...

Karthika Masam: కార్తీక మాసంలో ఏమి తినాలి ? ఏ పనులు చేయాలి ? ఏ వ్రతాలు చేయాలి ?

కార్తిక మాసంతో సమానమైన మాసం, కృతయుగంతో సమమైన యుగం, వేదానికి సరితూగే శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేవని అర్థం. శివ కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ఉపవాస నిష్టలకూ, నోములకూ, వ్రతాలకూ ఈ మాసంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రత్యేకించి శివారాధకులు అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించే మాసం ఇది. ఈ నెల రోజులూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగిస్తారు. కార్తీక మహా పురాణాన్ని పారాయణం చేస్తారు. కార్తిక సోమవారాలు, కార్తిక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో ప్రాతఃకాల స్నానాలకు ఎంతో విశిష్టత ఉంది. స్నానం పూర్తయిన తరువాత దీపారాధన చెయ్యాలనీ, రావిచెట్టు, తులసి, ఉసిరిక చెట్ల దగ్గర దీపాలు పెట్టడం ఉత్తమమనీ పెద్దలు చెబుతారు. మాసాలలో అసమానమైనదిగా పేరు పొందిన కార్తిక మాసంలో ఎన్నో పర్వదినాలున్నాయి.  పఠించదగిన స్తోత్రాలు వామన స్తోత్రం,  మార్కండేయకృత శివస్తోత్రం,  సుబ్రహ్మణ్యాష్టకం,  శ్రీ కృష్ణాష్టకం, సూర్య స్తుతి,  గణేశ స్తుతి, దశావతార స్తుతి,  దామోదర స్తోత్రం, అర్ధ నారీశ్వర స్తోత్రం,  లింగాష్టకం, బిల్వాష్టకం, శివషడక్షరీ స్తోత్రం శ్రీ శివ స్తోత్రం,శివాష్టక...

Karthika Masa Snan: కార్తీక మాసంలో స్నానానికి ఎందుకంత ప్రాధాన్యం?

కార్తికంలో గోష్పాదమంత (ఆవుకాలిగిట్ట) జలంలో కూడా దేవదేవుడు ఉంటాడని విశ్వసిస్తారు భక్తులు. అందుకే కార్తికమాసంలో స్నానానికి అంత ప్రత్యేకత ఉంది.  ఈ మాసంలో సూర్యోదయానికి ముందుగా చేసే స్నానాన్ని హంసోదక స్నానం అంటారు.  శరదృతువులో సూర్యోదయానికి ముందు హంసమండలానికి సమీపంలో అగస్త్య నక్షత్రం ఉదయిస్తుంది. అటువంటి సమయంలోని నీరు స్నానపానాదులకు అమృతతుల్యంగా ఉంటుందని మహర్షి చరకుడు పేర్కొన్నాడు.  ఓషధులకు రాజు చంద్రుడు. చంద్రకిరణాలు సోకిన నీటితో సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. శరదృతువులో నదీప్రవాహంలో ఓషధుల సారం ఉంటుంది.  చీకటి ఉండగానే ఉషఃకాలంలో అంటే సూర్యోదయానికి పదిహేను నిమిషాల ముందు స్నానం చేయడం ఉత్తమం.  ఇందువల్ల మానసిక, శారీరక రుగ్మతలన్నీ నశిస్తాయి. పరిపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఆయుష్షు పెరుగుతుంది.

మన పండుగలు సంస్కృతీ ప్రతిబింబాలు

మానవ జీవితం ముఖ్యంగా ప్రకృతిపై ఆధారపడి వుంటుంది. ఈ ప్రకృతిలోని మార్పులను జ్యోతిషశాస్త్రం ఆధారంగా గుర్తించి, గ్రహ నక్షత్రాదుల ప్రభావాలను పరిశీలిస్తూ, కాలానుగతికమైన పండుగలను ధర్మశాస్త్రం నిర్ణయిస్తుంది. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవడం పండుగల ఏర్పాటులో ముఖ్యమైన ఉద్దేశం. నోములు, వ్రతాలు, ఉత్సవాలు, పర్వాలు, పండుగలు అంటూ వాటికి మనం పేర్లు పెట్టుకుంటున్నాం. ఈ దేశంలో సంవత్సరం మొత్తం ఏదో రూపంలో ఏదో ఒక పర్వం నిర్వహిస్తూనే వుంటారు. పండుగలు జరుపడంలో  మహిళల దే  ప్రముఖ పాత్ర.   మహిళలు   అధికసంఖ్యలో ఐకమత్యంతో పాల్గొని చురుకుగా చేసే పండుగల్లో బోనాలు, బతుకమ్మ, గొబ్బెమ్మ లు అగ్రస్థానంలో నిలుస్తాయ. శ్రావణమంగళ, శుక్రవారాల్లో నోచే నోములకూ ప్రముఖస్థానమే.   మాసాలపరంగా ఆలోచిస్తే మన పండుగల్లో మొట్టమొదటి చైత్రశుద్ధ పాడ్యమినాడు నిర్వహించే 'ఉగాది' పండుగ. తెలుగువారికే ఇది ప్రత్యేకమైన పండుగ. ఈరోజు ఆరు రుచులతో కూడుకున్న వేపపువ్వు పచ్చడిని ఆరగించిన తర్వాతనే మిగిలిన పనులు ప్రారంభిస్తాము. ప్రకృతికి నమస్కరించే తెలుగువారి మొదటి పండుగ ఇది. సంక్రాంతి తెలుగువారు న...

Karvetinagaram Sri Krishna Temple: శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం - కార్వేటినగరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంనుంచి 58 కిలో మీటర్ల దూరంలో కార్వేటినగరం ఉంది. నారాయణవనంను పరిపాలించిన సూర్యవంశరాజులు ఒకసారి వేటకు ఈ ప్రాంతానికి రాగా కుక్కలను కుందేళ్ళ తరుముతుండడం వారి కంటపడింది. దీనిని చూసి ఆశ్చర్యానికి లోనైన వారు ఈ ప్రాంతంలో ఉన్న అడవిని నరికి ఒక ఊరు నిర్మింపజేశారు. అడవిని నరికి కట్టిన ఊరు కనుక ఈ ఊరికి 'కాడువెట్టి నగరం' అనే పేరు ఏర్పడింది. అది కాల క్రమంలో కార్వేటినగరంగా మార్పు చెంది. నట్లు స్థలపురాణం వెల్లడిస్తోంది. 1541వ సంవత్సరంనాటి శాసనం ఈ ఊరిని 'కార్వేడు' అని పేర్కొంది. కార్వేటి అనే దేవత ఈ ప్రాంతంలో కొలువుదీరడం వల్ల ఆమె పేరు మీదే కార్వేటినగరం అని ఈ క్షేత్రానికి పేరు వచ్చినట్లు కూడా ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణభగవానుడు ఈ క్షేత్రంలో కొలువుదీరడం వెనుక ఆసక్తికరమైన స్థల పురాణం ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతం నారాయణవనం రాజ్యంలో భాగంగా ఉండేది. ఈ రాజ్యాన్ని సూర్య వంశానికి చెందిన కరికాల చోళుడు పరిపాలించాడు. ఆయన కుమారుడు తొండమాన్చక్రవర్తి. తొండమాన్చక్రవర్తి మునిమనవడు నారాయణరాజు. తన పూర్వీకుల మాదిరే నారాయణరాజు కూడా దైవభక్తి పరాయణుడు. ప్...