ప్రతి పండుగకు, పూజలు వ్రతాలు నిర్వహించే సమయంలో పిండివంటలతో పాటు వడపప్పు, పానకం కూడా దేవతలకు నివేదిస్తూ ఉంటాం. కేవలం శ్రీరామనవమికే పరిమితం కాదు. అయితే శ్రీరామనవమికి అన్నిచోట్లా చలువ పందిళ్లు వేసి వడపప్పు, పానకం పెద్దఎత్తున పంచిపెడతారు. పెసరపప్పును నీటిలో నానబెట్టి, నీటిని తీసివేస్తే వడపప్పు తయారవుతుంది. పెసరపప్పు చలవచేస్తుంది. శరీరం ఉష్ణాన్ని తగ్గిస్తుంది. కేవలం శ్రీరామనవమికే పరిమితం కాదు. మండుతున్న ఎండల్లో వడకొట్టకుండా ఉంటుంది. ఇక పానకంలో ఉపయోగించే బెల్లం, మిరియాలు, ఏలకులు ఔషధంలా పనిచేస్తాయి. దాహం తీరుతుంది. వేసవికాలంలో దాహం తీర్చడం పుణ్యకార్యం.
No comments:
Post a Comment