శివాలయంలో తప్పనిసరిగా మూడు లింగాలను దర్శించాలి. వీటినే లింగత్రయం అంటారు. ఆలయ గోపురాన్ని స్థూలలింగంగా భావించాలి. విమానంపై ఉండేది కూడా స్థూలలింగమే.
బలిపీఠం భద్రలింగం. మూలమూర్తి సూక్ష్మలింగం. ఆలయాన్ని సమీపిస్తూనే మొదట గోపురానికి నమస్కరించాలి. ధ్వజస్తంభం వద్ద సాష్టాంగ నమస్కారం చేయాలి. ధ్వజస్తంభం వద్ద తప్ప శివాలయంలో మరెక్కడా సాష్టాంగ పడకూడదు. మొదటిసారి ఆలయ ప్రదక్షిణ చేయాలి. నంది అనుమతి పొంది ఆలయంలో ప్రవేశించాలి. మొదట వినాయకుని, ఆ తరువాత శివుని, అమ్మవారిని, ఉత్సవ విగ్రహాన్ని కూడా దర్శించి మొక్కాలి.
రెండోసారి ఆలయ ప్రదక్షిణం చేసుకోవాలి. ఇతర పరివార దేవతలను దర్శించి నమస్కరించాలి. ఆపై సుబ్రహ్మణ్యుని దర్శించి, నవగ్రహ సన్నిధికి వెళ్లాలి.
చివరిగా మూడోసారి ఆలయానికి ప్రదక్షిణ చేయాలి. అప్పుడు చండీశ్వరుని దర్శించాలి. శివాలయ దర్శన ఫలితాన్నిచ్చేది చండీశ్వరుడే. చివరగా ధ్వజస్తంభం వద్దకు వచ్చి మరోసారి సాష్టాంగ నమస్కారం చేయాలి.
No comments:
Post a Comment