అహోబిలంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి 04 నుండి ప్రారంభంకానున్నాయి.
ఫాల్గుణ శుద్ధ పంచమి నుండి పౌర్ణమి వరకు అహోబిలంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి . బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి వారికి కళ్యాణోత్సవం కడు రమణీయంగా జరుగుతుంది. శ్రీవైష్ణవ సాంప్రదాయంలో పరమ పవిత్రంగా భావించే 108 దివ్యక్షేత్రాలలో ఒకటి అహోబిల నవనారసింహ క్షేత్రం. నల్లమల అడవులలో ఉన్న ఈ క్షేత్రం భక్తి ప్రపత్తులకేకాదు ప్రకృతి రామణీయతకుకూడా ఆలవాలం. ఈ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో వివరించారు.
రాక్షస రాజైన హిరణ్యకశిపుని రాజ్యం ఇది. తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడడానికి హరి స్తంభంనుండి నరసింహుని రూపంలో వెలువడి హిరణ్యకశిపుని వధించింది ఇక్కడే. నరసింహస్వామి ఆవిర్భవించి హిరణ్యకశిపుని తన గోళ్ళతో చీల్చి చంపినప్పుడు ఆయన బలాన్ని, శక్తిని దేవతలు అహో బలం.. అహో బలం.. అని ప్రశంసించారుగనుక ఈ స్థలానికి వారు కీర్తించినట్లు అహోబలం అన్నారు. ఎగువ అహోబిలంలో ప్రహ్లాదుని తపస్సుకి మెచ్చి నరసింహస్వామి బిలంలో స్వయంభువుగా వెలిశాడుగనుక అహో బిలం అన్నారు. ఈ క్షేత్రంలో స్వామీ తొమ్మిది ప్రదేశాలలో తొమ్మిది రూపాలలో ఆవిర్భవించారు. అందుచేతనే ఈ క్షేత్రం నవ నారసింహ క్షేత్రం గా ప్రసిద్ధి చెందింది. జ్వాలా నరసింహ, అహోబల నరసింహ, మాలోల నరసింహ, క్రోడా (వరాహ) నరసింహ, కారంజ నరసింహ, భార్గవ నరసింహ, ఛత్రవట నరసింహ, పావన నరసింహ మూర్తులైన నవనారసింహ మూర్తులతో శోభాయమానంగా విరాజిల్లుతున్న దివ్య క్షేత్రమిది.
ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు అనేక ప్రాంతాలనుండి తరలివస్తారు. ఎంతో వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలలో స్వామివారు రోజుకో వాహనంలో విహరిస్తే భక్తులను అనుగ్రహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణం కడు రమణీయంగా నిర్వహిస్తారు.
వాహన సేవల వివరాలు
మార్చి 04
మార్చి 04
ఎగువ అహోబిలంలో అంకురార్పణ,
దిగువ అహోబిలంలో సెల్వార్ కూత్తు ఉత్సవం
మార్చి 05
ఎగువ అహోబిలంలో ధ్వజారోహణం, భేరి పూజ, సింహవాహనం.
దిగువ అహోబిలంలో అంకురార్పణ
మార్చి 06
ఎగువ అహోబిలంలో హంస వాహనం, అభిషేకం, సూర్యప్రభ వాహనం.
దిగువ అహోబిలంలో ధ్వజారోహణం, భేరి పూజ, సింహవాహనం.
మార్చి 07
ఎగువ అహోబిలంలో ఉత్సవం, అభిషేకం, హనుమంత వాహనం
దిగువ అహోబిలంలో హంస వాహనం, అభిషేకం, సూర్యప్రభ వాహనం.
మార్చి 08
ఎగువ అహోబిలంలో శేష వాహనం, చంద్రప్రభ వాహనం
దిగువ అహోబిలంలో యోగ నృసింహ గరుడ విమానం, అభిషేకం, హనుమంత వాహనం
మార్చి 09
ఎగువ అహోబిలంలో ఉత్సవం, అభిషేకం, శరభ వాహనం
దిగువ అహోబిలంలో శేష వాహనం, అభిషేకం, చంద్రప్రభ వాహనం
మార్చి 10
ఎగువ అహోబిలంలో ఉత్సవం, అభిషేకం, పొన్నచెట్టు వాహనం
దిగువ అహోబిలంలో ప్రహ్లదవరదుడికి మోహిని అలంకారం, అభిషేకం, శరభ వాహనం
మార్చి 11
ఎగువ అహోబిలంలో అభిషేకం, గజ వాహనం(సాయంత్రం), తిరుకల్యాణోత్సవం(రాత్రి).
దిగువ అహోబిలంలో వేణుగోపాల స్వామి అలంకారం, అభిషేకం, పొన్నచెట్టు వాహనం
మార్చి 12
ఎగువ అహోబిలంలో ఉత్సవం, తొట్టి తిరుమంజనం, అశ్వ వాహనం
దిగువ అహోబిలంలో అభిషేకం, గజ వాహనం(సాయంత్రం), తిరుకల్యాణోత్సవం(రాత్రి).
మార్చి 13
ఎగువ అహోబిలంలో రథోత్సవం, అభిషేకం
దిగువ అహోబిలంలో తొట్టి తిరుమంజనం(సాయంత్రం), అశ్వ వాహనం(రాత్రి)
మార్చి 14
ఎగువ అహోబిలంలో ఉత్సవం,చక్ర స్నానం, ద్వాదశారాధనం(సాయంత్రం), ఫుష్ప యాగం, గరుడ వాహనం(రాత్రి), ధ్వజావరోహణం
దిగువ అహోబిలంలో రథోత్సవం
మార్చి 15
దిగువ అహోబిలంలో ఉత్సవం, తీర్థవారి చక్రస్నానం, ద్వాదశారాధనం ఫుష్ప యాగం, గరుడ వాహనం(రాత్రి), ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి.
మార్చి 16 నుండి 08 వరకు
దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులు ప్రహ్లదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి, అమ్మవార్లకు తెప్పోత్సవం
ఎలా వెళ్ళాలి :
ఆళ్లగడ్డ నుండి 24 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం
No comments:
Post a Comment