కొల్లేరు సరస్సు నడిమధ్యలో ఉన్న కొల్లేటికోటలో పెద్దింట్లమ్మ వారి ఆలయం శతాబ్దాల చరిత్ర కలిగినది. తొమ్మిది అడుగుల పైబడి, విశాల నేత్రాలతో పద్మాసన భంగిమతో పెద్దింట్లమ్మ దర్శనమిస్తుంది. ఏటా ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకూ ఉత్సవాలు జరుగుతాయి. ద్వాదశి రోజున పెద్దింట్లమ్మ సమేత జలదుర్గకు కొల్లేటి కోట సమీపాన కల గోకర్ణేశ్వరస్వామి వారికి కళ్యాణము జరిపిస్తారు. వేంగీ చాళుక్యుల కాలంలో ఈ ప్రాంతాన్ని సరోనాథులు పరిపాలించారు. తరువాత ఈ ప్రాంతం ఓధ్ర గజపతుల పాలనలోకి వెళ్లింది. గజపతి రాజుకు ఇక్కడ ఒక కోట ఉండేది. ఆ కోటను వశం చేసుకోవడానికి మహ్మదీయులు కొల్లేరు సరస్సు సమీపంలోని చిగురుకోట వద్ద డేరా వేసి ఒక కాలువను తవ్వి (నేటి ఉప్పటేరు) సరస్సును సముద్రంలోకి ఇంకించి వేశారు. ఆ సమయంలో గజపతి రాజు సైన్యాధ్యక్షుడు ఒకడు యుద్ధంలో విజయం లభించాలని తన కూతురైన పేరంటాలమ్మను బలి ఇవ్వబోయాడు. ఆవిడ ఒక శక్తి స్వరూపముగా మారి మహిషాసురమర్దినిగా శత్రువులను సంహరించింది. అప్పుడే అంటే, క్రీ.శ 1237-82 మధ్యకాలంలో పేరంటాలమ్మ ఆలయం నిర్మితమైంది. ఆమెనే నేడు పెద్దింట్లమ్మగా పిలుస్తున్నారు.
జాతర 2025 తేదీలు: మార్చి 01 నుండి 13 వరకు
మార్చి 10 - శ్రీ జలదుర్గ గోకర్ణేశ్వర్ల స్వామివార్ల కళ్యాణం
మార్చి 13 - తెప్పోత్సవం
ఆకివీడు నుండి లాంచీల ద్వారా, ఏలూరు (40కి.మీ. దూరం), కైకలూరు (20 కిలోమీటర్ల దూరం) నుంచి బస్సు ద్వారా కొల్లేటికోటకు చేరుకోవచ్చు.
No comments:
Post a Comment