మూడులోకాలలోనూ సృసింహునికి సాటిదైవం లేదు. సింహాచలం వంటి క్షేత్రం లేదని ప్రతీతి. నిరంతరం మైపూతగా శ్రీచందనాన్ని ధరించే సింహాద్రి అప్పన్న పరమ శాంతమూర్తి. దర్శనం చేసి వరం వేడుకున్న క్షణంలోనే అనుగ్రహించే సద్యోజాత మూర్తి. సింహాచలం కొండ సాక్షాత్తూ నృసింహ స్వామి రూపం. కూర్చున్న సింహంలా సింహాచలం కనిపించడం విశేషం.
ఫాల్గుణ మాసంలో సాధారణంగా నృసింహ కల్యాణాలు జరుగుతాయి.సింహాచలంలో ఫాల్గుణ పూర్ణిమకు అప్పన్నకు డోలోత్సవం నిర్వహిస్తారు. కల్యాణం చైత్రమాసంలో ఉంటుంది.
ఫాల్గుణ పూర్ణిమ నాడు సింహాద్రిపై డోలోత్సవం జరుగుతుంది. ఉత్సవంలో భాగంగా స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరిస్తారు. సింహగిరిపైనుంచి మెట్ల మార్గంలో కొండ దిగువకు తీసుకువస్తారు. అనంతరం పుష్కరిణి ఉద్యాన మండపంలో వసంతోత్సవం చేస్తారు. అప్పన్నస్వామి సోదరి పైడితల్లిని పిల్లనిమ్మని అడుగుతాడు. తిరువీధి నిర్వహించిన అనంతరం స్వామి తిరిగి సింహగిరి చేరుకుంటాడు.
2025: మార్చి 14.
No comments:
Post a Comment