చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసి ఉండే రోజు కావున ఈ నెలకు చైత్ర మాసమని పేరు వచ్చింది. వసంత ఋతువు ఆగమనాన్ని సూచించే చైత్ర మాసంలో ఎన్నో పండుగలు, మరెన్నో విశేష తిధులు ఉన్నాయి.
వసంత ఋతువులో తొలి మాసం, తెలుగు సంవత్సరంలో మొదటి నెల చైత్రమాసం. చైత్రమాసం అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉగాది, శ్రీరామనవమి, హనుమజ్జయంతి వంటి విశేష పర్వదినాలు. ఇవి కాకుండా ఈ మాసంలో ఎన్నో పండుగలు, పుణ్య తిధులు ఉన్నాయి.
చైత్రమాసం ఎప్పటి నుంచి?
మార్చి 30వ తేదీ ఆదివారం నుంచి చైత్రమాసం మొదలై తిరిగి ఏప్రిల్ 27 వ తేదీ ఆదివారం అమావాస్యతో చైత్రమాసం ముగుస్తుంది.
చైత్రమాసంలో ముఖ్యమైన తిథులు & పండుగలు
- మార్చి 30వ తేదీ ఆదివారం చైత్ర శుద్ధ పాడ్యమి: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ. తిరుమల శ్రీవారి ఆస్థానంలో కొలువు.
- మార్చి 31వ తేదీ సోమవారం చైత్ర శుద్ధ విదియ: బాలేందు వ్రతం, చంద్రోదయం.
- ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం చైత్ర శుద్ధ తదియ: సౌభాగ్య గౌరీవ్రతం, పార్వతి పరమేశ్వరుల డోలోత్సవం
- ఏప్రిల్ 2వ తేదీ బుధవారం చైత్ర శుద్ధ చవితి: గణేశ దమనపూజ
- ఏప్రిల్ 3వ తేదీ గురువారం చైత్ర శుద్ధ పంచమి/ షష్టి: శ్రీలక్ష్మి జయంతి, మత్స్యజయంతి, స్కంద దమనపూజ
- ఏప్రిల్ 4వ తేదీ శుక్రవారం చైత్ర శుద్ధ సప్తమి: సూర్యపూజ, సూర్య దమనపూజ, అయోధ్యలో బాలరామునికి సూర్యాభిషేకం.
- ఏప్రిల్ 5వ తేదీ శనివారం చైత్ర శుద్ధ అష్టమి: భవానీ అష్ఠమి, అశోకాష్టమి
- ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం చైత్ర శుద్ధ నవమి: శ్రీరామనవమి, సీతాకళ్యాణం, సమర్థ రామదాసు జయంతి, ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
- ఏప్రిల్ 7వ తేదీ సోమవారం చైత్ర శుద్ధ దశమి: ధర్మరాజ దశమి, శ్రీరామ పట్టాభిషేకం, తిరుమల శ్రీవారి ఆస్థానం
- ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం చైత్ర శుద్ధ ఏకాదశి: కామదాఏకాదశి
- ఏప్రిల్ 9వ తేదీ బుధవారం చైత్ర శుద్ధ ద్వాదశి: వామన ద్వాదశి
- ఏప్రిల్ 10వ తేదీ గురువారం చైత్ర శుద్ధ త్రయోదశి: మహావీర జయంతి, పక్ష ప్రదోషం
- ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం చైత్ర శుద్ధ చతుర్దశి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి కల్యాణోత్సవం.
- ఏప్రిల్ 12వ తేదీ శనివారం చైత్ర పూర్ణిమ: హనుమత్ విజయోత్సవం, హనుమజ్జయంతి, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి రధోత్సవం, తుంబురుతీర్ధ ముక్కోటి
- ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం చైత్ర బహుళ పాడ్యమి: మేష సంక్రమణం
- ఏప్రిల్ 14వ తేదీ సోమవారం చైత్ర బహుళ విదియ: అంబేద్కర్ జయంతి, తమిళ సంవత్సరాది
- ఏప్రిల్ 16వ తేదీ బుధవారం చైత్ర బహుళ చవితి: సంకష్టహర చతుర్థి
- ఏప్రిల్ 18వ తేదీ శుక్రవారం చైత్ర బహుళ పంచమి: గుడ్ ఫ్రైడే
- ఏప్రిల్ 24వ తేదీ గురువారం చైత్ర బహుళ ఏకాదశి: మతత్రయ ఏకాదశి
- ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం చైత్ర బహుళ ద్వాదశి/ త్రయోదశి: పక్ష ప్రదోషం
- ఏప్రిల్ 26వ తేదీ శనివారం చైత్ర బహుళ త్రయోదశి/చతుర్దశి: మాసశివరాత్రి
- ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం చైత్ర బహుళ అమావాస్య: ధర్మ అమావాస్య, భరణి కార్తె ప్రారంభం.
- ఏప్రిల్ 27వ తేదీ ఆదివారంతో చైత్రమాసం ముగుస్తుంది.
No comments:
Post a Comment