Posts

Showing posts from September, 2024

Mahalaya Amavasya: మహాలయ అమావాస్య రోజు ఏమి చేయాలి ?

భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ లేదా సర్వ పితృ అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజు పూర్వీకులకు శ్రాద్ధం  , తర్పణం కర్మలను చేయడం ద్వారా ప్రత్యేక ఫలాలను పొందవచ్చు. పితృ పక్షాలు ఈరోజుతో ముగుస్తాయి. ఈ రోజు  పూర్వీకులకు తర్పణం సమర్పించడం వల్ల పితృ దోషం నుండి  విముక్తి లభిస్తుంది. ఈ సమయంలో విడిచే తర్పణంతో పూర్వీకులు   సంతోషించి తమ వారసులను ఆశీర్వదిస్తారు. చేయాల్సిన పనులు ఈ రోజు  ఉదయం నిద్రలేచి స్నానం చేసి పూర్వీకులను జ్ఞాపకం చేసుకుంటూ తర్పణ విడవాలి. బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి, లేదా అన్నదానం కూడా చేయవచ్చు  ఈ రోజు అన్నదానం చేసిన వారి ఆర్ధిక కష్టాలు తీరుతాయి అని నమ్మకం  ఈ రోజు ఇంటి ఈశాన్యంలో పూజ చేసి ఆవు నెయ్యి దీపం వెలిగిస్తే సమస్యలు దూరం అవుతాయి. చేయకూడని పనులు  ఈ రోజున మాంసం, ఉల్లిపాయ, వెల్లుల్లిని ఆహారంగా తీసుకోరాదు. ఈ రోజున జుట్టు, గోళ్లను కత్తిరించకూడదు, క్షవరం చేయకూడదు. 

Mahalaya Amavasya: మహాలయ అమావాస్య

భాద్రపద బహుళ అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు. చనిపోయినవారందరి స్మృతికోసం చేసే ఈ అమావాస్యను సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు. చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్ధం ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది.  హిందువులు తర్పణలు వదులుతారు. కొందరు పెద్దలకి బియ్యమిస్తారు. ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, వాళ్ళెక్కడవున్నా, వారి వారి సంప్రదాయాన్నిబట్టి, ఇంటి ఆచారాల్నిబట్టి, వాళ్ల వాళ్ల అనుకూలతనుబట్టి పితృ దేవతలను సంస్మరించుకునే రోజు ఇది. లేకపోతే రౌరవాది నరకాలకి పోతారంటారు. ఈ కార్యక్రమంలో కేవలం చనిపోయిన తండ్రి, తల్లులనే కాదు వారి ముందు ఇంకో రెండు తరాల వారిని కూడా సంస్మరిస్తారు  ఈ  రోజున శివున్ని భక్తిశ్రద్దలతో కొలుస్తారు, ఇలా చేస్తే కీర్తి ప్రతిష్టలు పొందుతారు అని నమ్మకం ఉంది. అంతే కాదు భక్తి శ్రద్దలతో పూజిస్తే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శనిదేవుడిని కూడా ఈ అమావాస్య వేళ పూజిస్తే జీవితంలో ఎదుర్కొంటోన్న కష్టాలన్నీ తీరిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ  రోజు పెద్దలకు తర్పణలు వదలాలి. వారిని తలచుకుని బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అ...

Dasara Bommala Koluvu: దసరాలో బొమ్మల కొలువు ఎందుకు పెడతారు?

Image
భగవంతుని అవతారాలు మొత్తం 21 అని భాగవతం పేర్కొంది. అయితే వాటిలో అందరికీ సుపరిచితమైనవి, సుప్రసిద్ధమైనవి దశావతారాలు. రాబోయే తరాలకు మన పురాణ విజ్ఞానం అందచేయడానికే బొమ్మల కొలువు సంస్కృతి ఏర్పడింది. దసరాలాంటి విశేష పర్వదినాల సందర్భాల్లో బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి అనేక దేవతా స్వరూపాలను పిల్లలు నెలకొల్పుతారు. వాటితో పాటు మన సంస్కృతిని ప్రతిబింబించే బొమ్మలు కూడా ఉంటాయి. ఈ కొలువును అవకాశం ఉన్నవారు పది రోజులూ ఉంచుకోవచ్చు. ఏడు వరసల్లో బొమ్మల్ని అందంగా పేర్చాలి. వాటిలో జీవ కోటి, ప్రాణికోటి, వృక్షకోటి, పక్షులు, భగవంతుని అవతారాలు, భక్తుల మూర్తులు, దేశ భక్తులు, వీరులు మహా కవులు తదితరులనందరినీ అలంకరించుకోవచ్చు. బొమ్మలకొలువు చూడగానే మన భారతీయ సనాతన సంప్రదాయమంతా స్పష్టంగా కనబడేలా ఉండాలి. ఏడువరసల బొమ్మలు అంటే ఏడు లోకాలకు ప్రతీకలుగా భావిస్తారు. బొమ్మల కొలువులో బొమ్మలకు ప్రతిరోజూ హారతి సమర్పించాలి. నైవేద్యం అవసరం లేదు. బొమ్మల కొలువు చూడడానికి వచ్చినవారికి తాంబూలం అందించాలి.

Dasara Gramadevata Puja: దసరాల్లో గ్రామదేవతలను ఏవిధంగా పూజించాలి?

Image
గ్రామదేవతలందరూ శక్తి స్వరూపిణులే. నూట ఎనిమిది మంది గ్రామదేవతలు వారి సోదరుడైన పోతురాజుతో కలిసి గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారు. ఆ దేవతలకు శిష్టసంప్రదాయంలోని దేవతల మాదిరిగా ఆలయం, ధ్వజస్తంభం వంటివన్నీ ఇటీవలి కాలంలో భక్తులు నిర్మించుకుంటున్నారు. ఒకప్పుడు బొడ్రాయినే గ్రామదేవతగా పూజించే ఆచారం ఉండేది. అన్నివర్ణాలవారూ గ్రామదేవతలను ఆరాధిస్తారు. రహదారివెంట వెళుతున్న అందరికీ గ్రామదేవతల దర్శనం సులభంగా జరగాలి. గ్రామదేవతల ఆలయాల్లోకి తరచుగా వచ్చి దర్శనం చేసుకోని శిష్టాచార సంపన్నులు సైతం దసరా రోజుల్లో గ్రామదేవతలకు నైవేద్యాలు సమర్పిస్తారు. 

Theerthams in Tirumala: తిరుమలగిరులలో 66 కోట్ల తీర్థాలు..

Image
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవంగా శ్లాఘించబడే శ్రీ వేంకటేశ్వరస్వామి శేషపర్వతం యొక్క ముఖభాగాన్ని వేంకటాద్రి అని, మధ్యభాగాన్ని నృసింహాద్రి అని, వెనుక భాగాన్ని శ్రీశైలంగా పురాణాలు అభివర్ణిస్తున్నాయి. ఈ శేషగిరులు అనేకానేక వృక్షసంపదకు, జీవసంపదకు, జంతుకోటికి ఆలవాలమే కాకుండా అనేకానేక పుణ్యతీర్థాలు కలిగి జలసంపదకు కూడా నిలయంగా ఉంటుంది.  తిరుమలగిరులలో 66 కోట్ల తీర్థాలు! ”పుణ్యతీర్థ” మనగా శుభము కలుగజేయు జలమని భావం. అట్టి పుణ్యతీర్థములు తిరుమల పర్వతశ్రేణుల్లో 66 కోట్లున్నవని బ్రహ్మపురాణం, స్కంధపురాణము తెలుపుచున్నవి. అయితే ఈ తీర్థములను ధర్మరతి, జ్ఞాన, భక్తి వైరాగ్య, ముక్తిప్రద తీర్థములు నాలుగుగా విభజించడమైనది. వీనిలో ముఖ్యమైనవి ఈ విధంగా ఉన్నాయి. ధర్మరతిప్రద తీర్థములుః- ఈ తీర్థముల దగ్గర నివసించిన లేక స్నానమాచరించిన లేక సేవించిన ధర్మాసక్తి కలుగునని పురాణములు తెలుపుచున్నవి. వీటి సంఖ్య 1008 గా నిర్దేశించడమైనది. జ్ఞానప్రద తీర్థములుః- ఈ తీర్థ జలములను సేవిస్తే జ్ఞానయోగం ప్రాప్తి కలుగునని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇవి 108 కలవు. అవి  1.⁠ ⁠మను తీర్థము 2. ఇంద్ర 3. వసు 4. రద్ర(11) 5. ...

Mandapams in Tirumala: తిరుమల ఆలయంలో మండపాలు

Image
తిరుమల శ్రీవారి ఆలయంలో మండపాలు చాలా ఉంటాయి.. ఏ మండపంలో ఎలాంటి క్రతువులు నిర్వహిస్తారు ? ప్రతిమా మండపం తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం నుంచి లోపలికి వెళ్లగానే 16 స్తంభాలతో  విజయనగర శిల్పసంప్రదాయం ఉట్టిపడేలా ప్రతిమా మండపం ఉంటుంది. దీన్నే శ్రీ కృష్ణదేవరాయ మండపం అని అంటారు. ఈ మండపంలో దక్షిణభాగాన శ్రీకృష్ణదేవరాయలు ఆయన దేవేరులు, తిరుమలదేవి-చిన్నాదేవి నమస్కరిస్తూ నిలువెత్తు రాగి విగ్రహాలు కనిపిస్తాయి. శ్రీ మలయప్పస్వామి మాడవీధుల్లో విహరించి లోపలికి వచ్చి ఈ ప్రతిమా మండపంలోనే కొంతసేపు విశ్రమిస్తారు. ఇక్కడే ఆచార్యపురుషులు దివ్యప్రబంధగానం చేస్తారు. అద్దాలమండపం   ప్రతిమా మండపానికి ఉత్తరదిక్కున ఎత్తైనప్రదేశంలో అద్దాలమండపం (ఆయినామహల్‌) ఉంది. అందులో డోలోత్సవానికి గొలుసులు వేలాడతీసి ఉంటాయి. ఊయలలో ఊగేటప్పుడు స్వామివారు అద్దాలలో అన్నివైపులా ప్రతిబింబిస్తారు. ఇక్కడ నిత్యం డోలోత్సవం జరుగుతుంది. క్రీ.శ.1831 నాటికే ఈ మండపముందని రికార్డుల ద్వారా తెలుస్తోంది. రంగమండపం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే ప్రముఖులకు వేద ఆశీర్వచనం అందించే సమయం లో ఈ పేరును మనం ఎక్కువగా వింటుంటాము. రంగమండపం లేదా రంగనాయకమ...

Navaratri Deeksha: నవరాత్రి దీక్షల్లో పాటించాల్సిన నియమాలు ఏమిటి ?

పూజకు కూర్చున్న వ్యక్తి తప్పనిసరిగా ఉతికిన వస్త్రాలు లేదా పట్టువస్త్రాలు ధరించాలి. ఎరుపు రంగు వస్త్రాలు శ్రేష్ఠం పురుషులు తప్పనిసరిగా ప్రతిరోజూ తలస్నానం చేయాలి నవరాత్రి దీక్ష స్వీకరిస్తే కనుక తొమ్మిది రోజులూ క్షుర కర్మ చేయించుకోకూడదు.  నేలపైన మాత్రమే నిద్రించాలి. బ్రహ్మచర్యం పాటించాలి  మద్యమాంసాదులు ముట్టుకోకూడదు. అబద్ధం ఆడకూడదు.  చేపట్టిన పూజా కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతమైనది అని నమ్మకంతో, భక్తితో ముందుకు సాగిపోవాలి.

Navaratri: శరన్నవరాత్రుల్లో అఖండ దీపం ఏ రోజున వెలిగించాలి ?

Image
  తొలిరోజునే అఖండ దీపం వెలిగించాలి. ఉదయవేళలోనే  దీపారాధన, కలశస్థాపన చేయాలి.  రాత్రిపూట పూజలు చేసేవారు కూడా తొలిరోజు ఉదయవేళలోనే దీపారాధన, కలశస్థాపన చేయవలసి ఉంటుంది. అఖండ దీపారాధనలో రెండు పెద్ద ప్రమిదలు తీసుకుని ఒకదానిలో ఒకటి ఉంచాలి. అందులో మూడు వత్తులు వేయాలి. దీపాన్ని తూర్పు వైపు వెలిగే విధంగా పెట్టాలి. దీపం తూర్పు వైపు వెలిగితే శాంతి చేకూరుతుంది. ఉత్తరం వైపు ధనధాన్యవృద్ధి కలుగుతుంది.  పడమటివైపు శత్రుపీడ, అనారోగ్యం కలుగుతాయి. దక్షిణం వైపు పెట్టే దీపాన్నియమ దీపం అని పిలుస్తారు. మొత్తంమీద తూర్పు ఉత్తరం దిక్కులలో దీపాన్ని వెలిగేలా ఉంచితే విధాలా మంచిది. దీక్ష కొనసాగినన్ని రోజులూ అఖండదీపం కొండెక్కకుండా చూసుకోవాలి. రాత్రింబవళ్లు దీపాన్ని చూసుకుంటూ ఉండడం కష్టం అనుకునేవారు  అఖండ దీపాన్ని వెలిగించకపోవడం మంచిది.  ప్రతివారూ తప్పనిసరిగా అఖండదీపం వెలిగించాలన్న నియమం లేదు.  ప్రతిసారి పూజా ప్రారంభంలో దీపారాధన చేసినా సరిపోతుంది.

Navratri Puja: నవరాత్రి పూజలను ఏ విధంగా చేసుకోవాలి ?

Image
  నవ అంటే తొమ్మిది అని అర్థం. సంవత్సరంలో నాలుగుసార్లు నవరాత్రి దీక్ష చేయవచ్చు. అవే చైత్రం, ఆషాఢం, భాద్రపదం, ఆశ్వయుజ నవరాత్రులు. ఆశ్వయుజ మాసంలో వచ్చేవాటిని దేవీ నవరాత్రులు అంటారు. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకూ శరన్నవరాత్రులను పాటిస్తారు. శరన్నవరాత్రులు హస్తా నక్షత్రం తో ఆరంభమై శ్రవణ నక్షత్రం పూర్తి కావడం విశేషం. ఈ తొమ్మిది రోజుల్లో ఆచార సంప్రదాయాల మేరకు అమ్మవారిని యధాశక్తి పూజించవచ్చు. అమ్మవారిని తొమ్మిది రోజులూ అర్చించడంతో పాటు తొమ్మిది అలంకారాలతో తొమ్మిది రూపాల్లో దర్శింప చేస్తారు.

Dasara: దసరా రోజుల్లో ఏం చెయ్యాలి ?

Image
  సూర్యోదయానికి పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానాదికాలు పూర్తి చేయాలి.  పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి... జగదంబను దుర్గ తదితర రూపాల్లో నెలకొల్పుకుని, ఆరాధించాలి.  అమ్మవారి చిత్రపటం లేదా విగ్రహం లేదా కలశానికి పసుపుకుంకుమ, పుష్పమాలలతో పూజించాలి. దేవీ అష్టోత్తర శతనామ స్తోత్రాలు, సహస్రనామ స్తోత్రాలు పారాయణ చేయడం మంచిది. శ్రీచక్రార్చన విశేష ఫలితాలనిస్తుంది, చండీహోమం, శాకదానం వంటివి చేయడం కూడా శుభప్రదమే.  దసరా నాడు జమ్మిపూజ చేయాలి. ఆనాటి సూర్యాస్తమయంలో ఉండే కాలానికి విజయ ముహూర్త కాలం అని పేరు. ఈ ముహూర్తంలో ఎవరైనా పరిశుద్ధమైన మనసుతో ఏ కార్యాన్ని తలపెట్టినా అది పరిపూర్ణంగా సిద్ధిస్తుంది.  తెలంగాణ ప్రాంతంలో పాలపిట్టను చూస్తారు.

Indira Ekadasi: ఇందిరా ఏకాదశి

Image
భాద్రపద మాసంలోని బహుళ ఏకాదశికి ఇందిరా ఏకాదశి అని పేరు దీనిని ఆచరించడం ద్వారా మానవుడు తన పితృదేవతలను ఉద్ధరిస్తాడు, సమస్త పాపాలు నశిస్తాయి. పూర్వం ఇంద్రసేనుడు అనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించాడు ఏకాదశి ముందురోజు తెల్లవారుజామునే స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ఒక పూట భోజనం చేసి నేల పై పాడుకోవాలి. ఏకాదశి రోజు తెల్లవారుజామునే స్నానం చేసి వ్రత నియమం ప్రకారం ఉపవాసం ఉండాలి. మధ్యాహ్నం సాలగ్రామశిలా ఎదురుగా పితృతర్పణాలు చేయాలి. బ్రాహ్మణులకు భోజనము పెట్టి దక్షిణతో సంతృప్తి పరచాలి. చందన ఫుష్ప దూపదీప నైవేద్యాలతో విష్ణువుని అర్చించాలి. విష్ణు స్మరణంతో రాత్రి జాగరణ చేయాలి. తరువాత రోజు వ్రతపారణం చేయాలి ఈ ఇందిరా ఏకాదశి మహిమను చదివేవాడు, వినేవాడు సమస్త పాపవిముక్తుడై చివరకు విష్ణుపదాన్ని చేరుకుంటాడు. పురాణాల ప్రకారం, మాహిష్మతి రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ఇంద్రసేనుడు సత్యయుగంలో విష్ణువుకు గొప్ప భక్తుడు. అతని మాహిష్మతి రాజ్యంలో అందరూ ఆనందంగా జీవించారు. అక్కడి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒకరోజు రాజు తన మంత్రులతో ఆస్థానంలో కూర్చొని చర్చిస్తుండగా, నారద ముని అతని ఆస్థానానికి వచ్చాడు. మీ రాజ్యంలో ప్...

Bathukamma Dates 2024: బతుకమ్మ పండుగ 2024

Image
బతుకమ్మ పండుగ తెలంగాణా రాష్ట్రములోని ప్రతి సంవత్సరం అశ్వీయుజ మాసంలో శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య తిథి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో దసరా నవరాత్రులు అప్పుడు బతుకమ్మ జరుపుకుంటారు.బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సంస్కృతికి  ప్రతీక ఈ పండుగ. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం.వీటన్నింటి నేపధ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ...

Paiditali Sirimanotsavam 2024: శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం 2024 - విజయనగరం

Image
విజయనగరం పైడిమాంబ ఉత్తరాంధ్ర ప్రజలకు ఇలవేల్పు. పైడిమాంబ సిరిమానోత్సవానికి దేశ విదేశాల నుంచి లక్షలాది భక్తులు విచ్చేస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి పదహారురోజుల పాటు పైడితల్లి అమ్మవారి ఉత్సవం కన్నులపండువగా జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో విజయదశమి తరువాత వచ్చే మంగళవారంనాడు నిర్వహించే సిరిమానోత్సవం ప్రధానం. పైడితల్లి అమ్మవారికి తొలి సిరిమానోత్సవాన్ని 1758లో నిర్వహించారు. 50 అడుగులు పొడవుండే సిరిమానుకు చివర... అమ్మవారి రూపంలో పూజారి కూర్చునే విధంగా ఆసనం ఏర్పాటు చేస్తారు. సిరిమానును ఒకబండిపై అమర్చుతారు. ముత్తైదువలు సిరిమానుకి పసుపు కుంకుమలు పూసి.. నూతన వస్త్రాలు చుట్టబెట్టి పళ్లగెలలు కడతారు. సిరిమానుపై అధిష్టించిన పైడితల్లి తిరువీధుల్లో విహరిస్తూ ముమ్మారు కోటశక్తికి ప్రణమిల్లుతుంది. సిరిమానోత్సవం ప్రధానంగా రైతుల ఉత్సవం. అమ్మవారి వద్ద ఉంచిన విత్తనాలు రైతులందరికీ ఇస్తారు. బెస్తవారి వల, ఈటెలు - బల్లేలు, తెల్లఏనుగు వంటివి సిరిమానోత్సవం చూడదగిన విశేషాలు. సిరిమానోత్సవం తరువాత మంగళవారంనాడు పెద్ద చెరువులో తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఆ తరువాత వచ్చే మంగళవారం రాత్రి ఉయ్యాల కంబాలతో పదహారు రోజుల ఉత్సవం పూ...

Tirumala Brahmotsavam: తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రాముఖ్యత

Image
  సుమారు తిరుమలలో ఏడాదికి 450 పైనే ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో అత్యంత ప్రముఖమైనవి మాత్రం స్వామివారికి తొమ్మిది రోజుల పాటు జరిగే  బ్రహ్మోత్సవాలు. బ్రహ్మదేవుడు నిర్వహించినందువల్ల బ్రహ్మోత్సవాలని అంటారు. ముందురోజు సాయంత్రం అంకురార్పణ, శ్రీవారి సేనాధిపతి విష్వక్సేన వారి ఆధ్వర్యంలో మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. తరువాతరోజు ధ్వజారోహణనాడు బంగారు ధ్వజస్తంభం పై గరుడకేతనాన్ని ఎగురవేస్తూ సర్వలోకవాసులు ఆహ్వానింపబడతారు. మరునాడు ఉదయం సాయంత్రం రెండువేళలా రెండవరోజు చిన్నశేషవాహనం, హంసవాహనం మూడవరోజు సింహవాహనం ముత్యపుపందిరి, నాల్గవరోజు కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం ఐదవరోజు ఉదయం దంతపు పల్లకిలో మోహినీ అవతారం, ఆ రాత్రి గరుడోత్సవం జరుగుతుంది. శ్రీవిల్లి పుత్తూరు నుంచి గోదాదేవి ధరించిన పూలమాల, మద్రాసు నుంచి కొత్త గొడుగులు వస్తాయి. వీటినన్నింటిని ధరించిన మలయప్పస్వామి బంగారు గరుడునిపై ఊరేగింపబడుతాడు. లక్షలాది మంది భక్తులు గరుడోత్సవాన్ని తిలకిస్తారు. ఇక ఆరవరోజు హనుమద్వాహనం, గజవాహనం, ఏడవరోజు సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, ఎనిమిదో రోజు రథోత్సవం, అశ్వవాహనం జరుగుతాయి. తొమ్మిదో రోజు చక్...

Tirumala Brahmotsavam: తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు 2024

Image
తిరుమలేశుని ఆలయంలో  బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావటంతో, ఇవి 'బ్రహ్మోత్సవాలు' అయ్యాయని అంటారు. వాహన సేవ వివరాలు అక్టోబర్ 03 -  అంకురార్పణం అక్టోబర్ 04 - ధ్వజారోహణం, పెద్ద శేష వాహనం అక్టోబర్  05 - చిన్న శేష వాహనం, హంస వాహనం అక్టోబర్  06 - సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం అక్టోబర్ 07  - కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం అక్టోబర్ 08   - మోహిని అవతారం,  గరుడ వాహనం అక్టోబర్ 09   - హనుమంత వాహనం, పుష్పక విమానం,గజ వాహనం అక్టోబర్ 10 - సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం అక్టోబర్ 11 - రథోత్సవం, అశ్వ వాహనం. అక్టోబర్ 12 - చక్ర స్నానం, ధ్వజావరోహణం .

Dasara Navratri Importance: దసరా నవరాత్రుల ప్రాముఖ్యత

Image
  ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దేవి నవరాత్రుల పూజను ప్రారంభించాలి అని శాస్త్రం చెబుతోంది. ఆలా  వీలుకానివారు తదియ, పంచమి, సప్తమి రోజునుండి దేవీపూజను ప్రారంభించవచ్చు. దేవీ పూజలో భక్తితో పాటు నియమనిష్టలను పాటించడం ఎంతో అవసరం ఈ నవరాత్రి పూజను కలశస్థాపన చేసి ప్రారంభించాలి. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి, తలంటు స్నానం చేసి  శుద్ధమైన వస్త్రాలు ధరించి అమ్మవారిని విధివిధానంగా పూజించాలి. సాయంకాలం కూడా అమ్మవారిని శాస్త్రబద్ధంగా పూజించడం తప్పనిసరి. దీక్షాకాలంలో ఒక్కపూటనే భోజనం చేసి, ఏకభుక్త వ్రతాన్ని ఆచరించాలి. అది సాధ్యంకాని వారు మధ్యాహ్నం అల్పాహారాన్ని స్వీకరించి, రాత్రి భోజనం చేయవచ్చు. దేవీ నవరాత్రులలో అవకాశం వున్నవారు కుమారీ పూజ, సువాసిని పూజ, దంపతి పూజ చేసుకోవడం శుభప్రదం. కుమారీపూజలో 2 నుండి 8 యేళ్ళ వయసుగల బాలికలను జగన్మాతగా భావించి పూజిస్తారు.  అలాగే సువాసినీ పూజలో ముత్తైదువులను, దంపతి పూజలో దంపతులను పూజించాలి. ఈ నవరాత్రి పూజలో ఆయా రోజులందు ఆయా అమ్మవారి రూపాలు విధివిధానంగా పూజించడం సంప్రదాయం. అమ్మవారికి పుష్ప అలంకరణలు పాడ్యమి నాడు - మల్లెలమాల, బిల్వదళమాలతో విదియ నాడు -...

Sri Chengalamma Temple: శ్రీ చెంగాళమ్మ అమ్మవారి ఆలయం - సూళ్లూరుపేట

Image
  ప్రస్తుత కాలంలో సూళ్ళూరుపేటగా పిలుస్తున్న ఈ పట్టణానికి పూర్వనామం శుభగిరి. ఈ గ్రామానికి పడమరవైపుగా ప్రవహించే నది ఒకరోజు సాయంత్రం ఆ గ్రామంలోని పశువుల కాపర్లు నదిలో దిగి ఉల్లాసంగా స్నానం చేస్తున్నారు. ఇంతలో వారిలో ఒకతను హఠాత్తుగా సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఆ సుడిగుండం అతన్ని నది లోపలికి ఈడ్చుకుని అడుగుభాగానికి తీసుకువెళ్ళింది. సుడిగుండం నుండి బయటపడటానికి అతను విశ్వప్రయత్నం చేస్తూండగా, ఒక బండరాయి చేతికి తగిలింది ప్రాణా పాయస్థితిలో వున్న అతను ఆ బండ రాయిని గట్టిగా పట్టుకొని సుడికి ఎదురు తిరగగా ఒక్క ఉదుటన అతనికి అసరాగా వున్న బండరాయితో సహా ఒడ్డుకు విసిరి వేయబడ్డాడు. సుడిగుండంలో మునిగిన అతని కోసం స్నేహితులు అత్రుతగా వెదుకుతుండగా హఠాత్తుగా, ఒక్క ఉదుటన ఒడ్డుకు విసిరివేయబడ్డ అతడిని వారు సంభ్రమాశ్చర్యాలతో చూశారు. అతను సుడిగుండం నుండి బయటపడటానికి తనకు సహాయపడ్డ బండరాయిని గురించి స్నేహితులకు వివరించాడు. అందరూ కలసి బండరాయిని ఒడ్డుకు చేర్చి ఆ బండరాయిని పరిశీలించగా అది ఓ స్త్రీమూర్తి విగ్రహం అని తెలుసు కుని, నది ఒడ్డునే ఆ విగ్రహాన్ని పడుకో బెట్టి, తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. మరునాడు గ్రామపెద్దలు, పశువ...

Bikkavolu Ganapati Temple: శ్రీ లక్ష్మి గణపతి ఆలయం - బిక్కవోలు

Image
  ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోటకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో సామర్లకోట నుంచి అనవర్తికి వెళ్లే మార్గంలో బిక్కవోలు ఉంది. 9-10 శతాబ్దాలలో ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన చాళుక్యరాజుల రాజధాని నగరంగా బిక్కవోలు విరాజిల్లింది. ఈ సమయంలో బిక్కవోలుకు బిరుదాంకినవోలు, బిరుదాంకపురం అనే పేర్లు ఉండేవని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. బిరుదాంకినవోలు అనేది కాలక్రమంలో ప్రజల వాడుకలో మార్పు చెంది బిక్కవోలు అయింది. స్థల పురాణం పూర్వం ఈ ప్రాంతంలో ఒక మోతుబరి రైతు నివసిస్తుండేవాడు. వ్యవసాయం, పశుపాలన వంటి వృత్తులను నిర్వహిస్తూ పరోపకారం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాదు. ఆయనకు ఆవులమంద ఒకటి ఉండేది. దానిని పశువుల కాపరి ఒకడు, ప్రతిరోజు పచ్చిక బయళ్లకు తోలుకొని పోయి మేపుకుని వస్తూ ఉండేవాడు. అందులో ఒక అవు మంద నుంచి విడిపోయి.. కొంతదూరం గడ్డి మేస్తూ వెళ్లి ఒక ఎత్తైన ప్రాంతానికి చేరుకొని పాలు జారవిడిచి తిరిగి మండలో వచ్చి కలిసేది, సాయంత్రం ఇల్లు చేరిన ఆవు ప్రతిరోజు పాలు ఇవ్వకపోవడంతో రైతుకు అనుమానం కలిగి ఆవును గమనించవలసినదిగా పశువుల కాపరికి తెలిపాడు. పశువుల కాపరి మరునాడు మేతకు ఆవులను తోలుకొని పోయి గమనించసాగ...

Mahalaya Pakshalu: మహాలయ పక్షాలు || పితృ పక్షాలు

  భాద్రపద బహుళ పాడ్యమి మొదలు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి వరకు పదహారు రోజులకు మహాలయపక్షం అని పేరు. మహాలయం అంటె గొప్ప వినాశనం లేదా ప్రళయం సంభవించిన రోజు అని అర్ధం, లేదా ప్రళయకాలం వరకు నిలిచిఉంది ఎప్పుడు లయమైయేది, గొప్పది. మహాలయ పక్షాలలో మన పెద్దవారిని స్మరించి,ఆరాధించటం వల్ల సుఖ సమృద్ధి, సంతోషం కలుగుతాయి. దైవగుణాలకూ సంబంధించి దక్షిణాయనం రాత్రికాలం. ఇది ఆషాడ మాసం శుక్లపక్షం నుండి ప్రారంభవుతుంది. దైవబలం తక్కువగా వున్నా సమయంలో పితృగణాలకు తిరిగి జన్మ పొందాలన్న కాంక్ష పెరుగుతుంది, కర్మాధికారం కలిగిన మనవైపు అవి చూస్తుంటాయి అని పురాణాలు చెబుతున్నాయి. మనుస్మృతి ప్రకారం ఆషాఢమాసంలోని కృష్ణపక్షం నుంచి అయిదు పక్షాల కాలం వరకు అంటె భాద్రపద కృష్ణపక్షం పితరులు మన నుంచి అన్నాదులు కోరుకుంటారు. ఈ విషయాన్ని స్కాందపురాణంలోని నాగరఖండంలో కూడా చెప్పబడింది. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించింది మొదలు పితృదేవతలకు శ్రాద్ధం పెట్టాలని మహాభారతం నిర్దేశించింది. సూర్యుడు కన్యారాశిలో సంచారం చేసే, పదహారు పగటి కాలాలు పితృయజ్ఞం చేయాలి అని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఇలా చేయడం వల్ల ప్రతిరోజు గయాశ్రాద్ధం చేసిన ఫలితం లభిస్తోంది....

Srisailam Bramaramba Devi: శ్రీ భ్రమరాంబ దేవి - శ్రీశైలం

Image
శ్రీశైలం భూమండలానికి కేంద్రస్థానం. ఇది జ్యోతిర్లింగక్షేత్రమే కాదు, అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరవది కూడా. ఇక్కడ సతీదేవి శరీరభాగాల్లో కంఠభాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. మల్లికార్జునస్వామివార్కి పశ్చిమభాగంలో వెనుకవైపు అమ్మవారు కొలువై ఉంది. స్కాందపురాణాంతర్గతమైన శ్రీశైలఖండంలో ఈ అమ్మవారి విశేషాలు దాదాపు 20 అధ్యాయాలతో భ్రమరాంబికోపాఖ్యానం పేరుతో ఉన్నాయి. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు తనకు సకల దేవ, యక్ష, గంధర్వ, పురుష, స్త్రీ, మృగ, జంతుజాలంతో మరణం కలుగరాదని బ్రహ్మతో వరం పొందాడు. వరగర్వంతో భక్తులు సకలలోకాలవారినీ హింసించసాగాడు. దీంతో అందరూ అమ్మవారిని శరణు వేడుకున్నారు. అప్పుడు అమ్మవారు భ్రమరరూపం ధరించి అరుణాసురుణ్ణి సంహరించి లోకాలను కాపాడింది. అరుణాసురసంహారం తరువాత భక్తుల విన్నపంతో శ్రీగిరిపై స్థిరంగా వెలిసింది. అమ్మవారి మూలమూర్తి స్థితరూపంలో (నిలుచుని) ఎనిమిది చేతులతో కుడివైపు చేతులలో త్రిశూలం, చురకత్తి, గదా, ఖడ్గం వంటి ఆయుధాలు, ఎడమవైపు మహిషముఖాన్ని బంధించి, విల్లు, డాలు, పరిఘలను ధరించి ఎడమకాలిని మహిషం (దున్నపోతు) వీపుపై అదిమిపెట్టిత్రిశూలంతో కంఠభాగంలో పొడుస్తూ మహిషాసురమర్దిని వలె కనిపిస్తుం...

Tirumala Shanivaralu: తిరుమల శనివారాలు 2024

Image
తమిళ మాసం అయిన పెరటాశి  మాసంలో తిరుమల శనివారాలు జరుపుకుంటారు. ఈ మాసం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వస్తుంది.  ఈ మాసంలోని శనివారాలు పవిత్రంగా భావించి విష్ణు ఆలయాలలో భక్తులు ప్రతేక్య పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలోనే తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరగడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.చాల మంది భక్తులు ఈ మాసంలో కేవలం శాకాహారం మాత్రమే స్వీకరిస్తారు. శ్రీమహావిష్ణువు శ్రీవేంకటాచలపతిగా అవతరించిన మాసమే పెరటాసి. ఈ మాసంలో శ్రవణ నక్షత్రంలో తిరుమలేశుడు అవతరించినట్లు శ్రీవేంకటాచల మహత్యం చెబుతోంది.  ప్రత్యేకించి శనివారం ఆయనకు ఎంతో ప్రీతి. పెరటాసిలో శనివారాలు నాలుగు లేక ఐదు వస్తాయి. వీటిలో మూడవ శనివారాన్ని తమిళులు చాలా విశేషంగా భావించడం ఆనవాయితీగా వస్తోంది.    ఈ మాసంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారికి  పిండి దీప సమర్పణ ఎంతో విశేషంగా జరుపుకుంటారు.  ఈ మాసంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాల  వైభవాన్ని  గురించి ఎంత చెప్పినా తక్కువే.  ప్రతి బ్రహ్మోత్సవం  తిరుమలలో విశేషంగా, వైభవంగా జరుగుతుంది. ఈ మాసంలో ముఖ్యంగా  కొంతమంది శ్రీ వైష్ణవుల తిరుమాళిగల్లో (ఇళ్ళల్లో...

Tirumala Naivedyam: తిరుమల శ్రీవారికి ఏ నైవేద్యం ? ఎప్పుడు సమర్పిస్తారు

Image
తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది.సర్వజగద్రక్షకుడైన ఏడుకొండలవాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఏమి పెట్టాలి, ఏ పదార్థాలు ఏ కొలతలతో ఉండాలి, ఎవరు వండాలి, ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి వంటివన్నీ ఆగమశాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. దాని ప్రకారమే ప్రసాదాల తయారీ, సమర్పణ జరుగుతుంది. ప్రసాదం వండేవారు వంట సమయంలోనూ, తర్వాతా వాసన సోకకుండా ముక్కుకు, నోటికీ అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు. నైవేద్యం పెట్టేది ఇలా... ♦ ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్ళతో శుద్ధి చేస్తారు. ♦ గాయత్రీ మంత్రం జపిస్తూ నీళ్లు చల్లుతారు. వండిన ప్రసాదాలను మూత పెట్టిన గంగాళాల్లో దేవుడి ముందు ఉంచుతారు. ♦ స్వామి, ప్రసాదాలు, నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. గర్భాలయం తలుపులు మూసేస్తారు. ♦ విష్ణు గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు ప్రసాదాల మీద నెయ్యి, తులసి దళాలను అభికరిస్తారు.   ♦ కుడిచేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడిచేతికి దానిని తాకించి, నోటి దగ్గర తాకుతారు. (స్వామికి గోరు ముద్దలు తినిపించడం అన్న మాట.) పవిత్ర మంత్రాలు ఉచ్చరిస్తూ అన్నసూక్తం పఠిస్తారు. ♦ ...

Tirumala Pancha Beram: పంచబేరాలు - తిరుమల

Image
  ఆనందనిలయంలో కొలువై, పంచబేరాలుగా పేర్గాంచిన శ్రీనివాసుని ఇదు దివ్యమంగళ స్వరూపాలు ఈ విధంగా పిలువ బడుతాయి. ధ్రువబేరం పదడుగుల ఎత్తైన, అతిసుందర మనోహర రూపం కలిగిన, అందరికీ తెలిసిన తిరుమల మూలవిరాట్ స్వయంభు శ్రీనివాసుడు. ఈ విగ్రహం యోగ, భోగ, విరహ రూపాల్లో కాక వీరస్థానక విధానంలో ఉంటుంది. స్థిరమై ఉన్న విగ్రహం కావున ఉత్సవాల్లో సంచార లక్షణం కలిగిన మిగతా నాలుగు బేరాలను చూడవచ్చు. మూలవిరాట్ కళ్ళను నామం దాదాపు పూర్తిగా కప్పేసి ఉంటుంది. ఇదివరకు రెండుసార్లు ఆ నామం పరిమాణం తగ్గించగా, రెండు సార్లూ ఆలయంలో గొడవలు, రక్తపాతం జరిగినట్టు చరిత్ర. శంఖచక్రాలు స్వయంభు విగ్రహంలో భాగం కానందున శంఖచక్ర ఆభరణాలు అమర్చి ఉంటాయి.  కౌతుకబేరం ఆగమ శాస్త్రానుసారం ప్రతి ధ్రువబేరానికి కౌతుకబేరం ఉంటుంది. తిరుమల గర్భాలయంలోని కౌతుకబేరం భోగ శ్రీనివాసుడు. శంఖచక్రాల మినహా ఈ విగ్రహ లక్షణాలు పూర్తిగా ధ్రువబేరంలాగానే ఉంటాయి. పల్లవ యువరాణి సామవాయి ఈ వెండి విగ్రహాన్ని చేయించి క్రీ.శ.614లో సమర్పించినట్టు శాసనం చెబుతోంది. నిత్యదీపారాధన, నిత్యనైవేద్యం, నిత్యాభిషేకం వంటి సేవలు ఈ కౌతుకబేరానికి జరుగుతాయి. ఉత్సవబేరం భక్తులు మలయప్పస్వామి ...

Radha Ashtami: రాధాష్టమి

Image
శ్రీకృష్ణాష్టమి తర్వాత 15 రోజులకు వచ్చే భాద్రపద శుక్ల అష్టమి రాధాష్టమి పర్వదినం. ఆమె ఆరాధనకు ఇదొక అపురూప సమయం. లోకంలో పవిత్రమైన ప్రేమకు ప్రతిరూపాలుగా మొట్టమొదట రాధాకృష్ణులనే పేర్కొంటాం. రాధ అంటే ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుని ఆంతరంగిక శక్తి స్వరూపమే. పరమాత్మ అనేకానేక శక్తులలో రాధాదేవి ఒకరు. శ్రీకృష్ణ పరమాత్మ కటాక్షాన్ని పొందడానికి అత్యంత దగ్గరి దారి ఆయన హృదయాంశ అయిన రాధమ్మ అనుగ్రహం పొందడమే. హరేకృష్ణ మంత్రంలోని హరే అన్న పదంకూడా ఆమెను సూచించేదే. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా రాధాకృష్ణులను ఇద్దరినీ కలిపి ఆరాధిస్తున్నట్టే లెక్క. రాధా దేవి ఆవిర్భవించిన తిథిని రాధాష్టమిగా జరుపుకుంటాము.ఉత్తర భారతదేశంలో రాధాష్టమి పండుగను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. అమ్మవారికి కుంకుమార్చలను నిర్వహిస్తారు. షోడశోపచార పూజలు  చేస్తారు రంగులు చల్లుకుంటారు..ఈ రోజు కూడా కృష్ణాష్టమి లానే ఉట్టి కొడతారు. రాధా అష్టమి రోజు పేదలకు  అన్నదానం, వస్త్రదానం   చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయని భావిస్తారు. సమస్త సిరిసంపదలకు, ఐశ్వర్యానికి అధిదేవత రాధాదేవి అని చెబుతారు సప్తరుషులు. పూజామందిరంలో రాధ...

Venkatagiri Jatara: వెంకటగిరి పోలేరమ్మ జాతర 2024 తేదీలు

Image
రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర జరగనుంది. వినాయక చవితి పూర్తయిన రెండు వారాలకు పోలేరమ్మ అమ్మవారి జాతర నిర్వహించడం ఆనవాయితీ. రెండు రోజులపాటు జరిగే ఈ జాతరకు వెంకటగిరిలోని ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నా స్వస్థలాలకు చేరుకుంటారు. దేశ విదేశాలనుంచి కూడా ఆ రెండురోజుల ఉత్సవాలనూ చూసేందుకు స్థానికులు తరలి వస్తారు. 2024 ముఖ్య తేదీలు  సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం మొదటి చాటింపు ఉంటుంది సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం రెండో చాటింపు ఉంటుంది.  సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం ఘటోత్సవం నిర్వహిస్తారు.  సెప్టెంబర్ 26వ తేదీ గురువారం అమ్మవారి ఉత్సవం జరుపుతారు సెప్టెంబర్ 26వ తేదీ గురువారం అమ్మవారి నిలువు, నిష్క్రమణం, నగరోత్సవంతో జాతర ముగుస్తుంది. జాతర తొలిరోజు రాత్రి అమ్మవారి మట్టి ప్రతిమను తయారు చేస్తారు, ఆ తర్వాత అమ్మగారింటినుంచి అత్తగారింటికి ఆ ప్రతిమను తీసుకొస్తారు. అక్కడ బుక్క చుక్క పెట్టి అమ్మవారి మూర్తిని దర్శనాలకు అనుమతిస్తారు. అత్తగారింటి నుంచి పోలేరమ్మ ఆలయానికి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఉంచుతారు. ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. అర్థరాత్రి ఈ తంతు అంత...

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Image
 చాంద్రమానంలో భాద్రపద మాసం ఆరవ నెల. ఈ నెలలోని పౌర్ణమినాడు చంద్రుడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రానికి సమీపంలో ఉండటం చేత ఇది భాద్రపద మాసం అని అంటారు.  దశావతారాలలో మూడవ అవతారమైన వరాహ అవతారాన్ని, అయిదవ అవతారమైన వామన అవతారాన్ని శ్రీ మహావిష్ణువు భాద్రపదమాసంలోనే ధరించాడు.  ఈ నెలలో హృషీకేశుని ప్రీతీ కొరకు ఉప్పును, బెల్లంను, దానం చేయడం మంచిది. ఈ నెలలో ఏకన్నా ఆహారవ్రతం ముఖ్యమైనది. ఈ వ్రతంలో ఒక పూట భోజనం చేసి మరోపూట ఉపవాసం ఉండాలి. ఇలా చేయడం వల్ల సంపదలు చేకూరుతాయి అని ధర్మసింధు చెబుతోంది. పితృదేవతల పూజకు కూడా ఈ మాసం ఎంతో అనువైనది. ఈ నెలలోని శుక్లపక్షం దేవతాపూజకు ఉత్తమమైనది కాగా, కృష్ణపక్షం పితృపూజకు విశేషమైనది. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు గల కాలానికి "మహాలయపక్షం" అని పేరు .దీనిని పితృపక్షం అని కూడా పిలుస్తారు . మహాలయ పక్షాలలో ఎటువంటి శుభకార్యాలు చేయరు. మహాలయపక్షంలో ప్రతిరోజు చనిపోయిన తల్లితండ్రులకు, పూర్వీకులకు తర్పణాలు వదిలి  , కర్మలు చేయాలనీ శాస్త్రం చెబుతోంది.  ఈ మహాలయ పక్షంలోని కర్మల గురించి, స్కందపురాణంలోని నాగ ఖండంలోను, మహాభారతంలోను వివరించబడింది....