Skip to main content

Mahalaya Amavasya: మహాలయ అమావాస్య రోజు ఏమి చేయాలి ?

  • భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ లేదా సర్వ పితృ అమావాస్యగా పిలుస్తారు.
  • ఈ రోజు పూర్వీకులకు శ్రాద్ధం  , తర్పణం కర్మలను చేయడం ద్వారా ప్రత్యేక ఫలాలను పొందవచ్చు.
  • పితృ పక్షాలు ఈరోజుతో ముగుస్తాయి.
  • ఈ రోజు  పూర్వీకులకు తర్పణం సమర్పించడం వల్ల పితృ దోషం నుండి  విముక్తి లభిస్తుంది.
  • ఈ సమయంలో విడిచే తర్పణంతో పూర్వీకులు   సంతోషించి తమ వారసులను ఆశీర్వదిస్తారు.

చేయాల్సిన పనులు

  • ఈ రోజు  ఉదయం నిద్రలేచి స్నానం చేసి పూర్వీకులను జ్ఞాపకం చేసుకుంటూ తర్పణ విడవాలి.
  • బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి, లేదా అన్నదానం కూడా చేయవచ్చు 
  • ఈ రోజు అన్నదానం చేసిన వారి ఆర్ధిక కష్టాలు తీరుతాయి అని నమ్మకం 
  • ఈ రోజు ఇంటి ఈశాన్యంలో పూజ చేసి ఆవు నెయ్యి దీపం వెలిగిస్తే సమస్యలు దూరం అవుతాయి.

చేయకూడని పనులు 

  • ఈ రోజున మాంసం, ఉల్లిపాయ, వెల్లుల్లిని ఆహారంగా తీసుకోరాదు.
  • ఈ రోజున జుట్టు, గోళ్లను కత్తిరించకూడదు, క్షవరం చేయకూడదు. 

Comments

Popular posts from this blog

Upanga Lalitha Vratam: ఉపాంగ లలితా వ్రతం

  ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజు లలితా దేవిని విశేషంగా అర్చించి, ఆ రాత్రి అంతా అమ్మవారిని భజన చేస్తూ జాగరణ చేయాలి. ఈ వ్రతం ఎక్కువగా మహారాష్ట్ర ప్రాంతంలో ఆచరణలో ఉంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల అమ్మవారి కటాక్షం లభించి, సకల శుభాలు కలుగుతాయి.  వ్యాస మహర్షి రచించిన దేవీ భాగవతం ప్రకారం 'త్రిపురత్రయం'లో రెండవ శక్తి స్వరూపిణి లలితా పరాభట్టారిక. అందుకే శరన్నవరాత్రులలో వచ్చే పంచమిని 'లలితా పంచమి' అని కూడా అంటారు. చెరకుగడ, విల్లు, పాశము, అంకుశము ధరించి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి కుడి ఎడమలు సేవలు అందిస్తుండగా శ్రీ లలితా పరాభట్టారిక భక్తుల కష్టాలు తొలగించి, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. కన్యలు మంచి భర్త కొరకు, ముత్తైదువులు దీర్ఘ సుమంగళి గా అఖండ సౌభాగ్యం కొరకు ఈ నవ రాత్రులలో అయిదవ రోజు ‘ఉపాంగ లలితా వ్రతం’ ఆచరిస్తారు. ఈ రోజు అమ్మవారిని శ్రీ లలితా దేవి అలంకారంలో సహస్రనామ, అష్టోత్తర నామాలతో కుంకుమ పూజలు చేయాలి. ముత్తైదువలకు యధాశక్తి తాంబూలాలు ఇచ్చుకోవాలి. ఈ రోజు ఇళ్లల్లో, దేవాలయాలలో కూడా ముత్తైదువులచే సువాసినీ పూజలు చేయిస్తారు. ఉపాంగ లలితా వ్రతం రోజు శ్రీ లలితా దేవ

Srisailam Bramaramba Devi: శ్రీ భ్రమరాంబ దేవి - శ్రీశైలం

శ్రీశైలం భూమండలానికి కేంద్రస్థానం. ఇది జ్యోతిర్లింగక్షేత్రమే కాదు, అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరవది కూడా. ఇక్కడ సతీదేవి శరీరభాగాల్లో కంఠభాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. మల్లికార్జునస్వామివార్కి పశ్చిమభాగంలో వెనుకవైపు అమ్మవారు కొలువై ఉంది. స్కాందపురాణాంతర్గతమైన శ్రీశైలఖండంలో ఈ అమ్మవారి విశేషాలు దాదాపు 20 అధ్యాయాలతో భ్రమరాంబికోపాఖ్యానం పేరుతో ఉన్నాయి. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు తనకు సకల దేవ, యక్ష, గంధర్వ, పురుష, స్త్రీ, మృగ, జంతుజాలంతో మరణం కలుగరాదని బ్రహ్మతో వరం పొందాడు. వరగర్వంతో భక్తులు సకలలోకాలవారినీ హింసించసాగాడు. దీంతో అందరూ అమ్మవారిని శరణు వేడుకున్నారు. అప్పుడు అమ్మవారు భ్రమరరూపం ధరించి అరుణాసురుణ్ణి సంహరించి లోకాలను కాపాడింది. అరుణాసురసంహారం తరువాత భక్తుల విన్నపంతో శ్రీగిరిపై స్థిరంగా వెలిసింది. అమ్మవారి మూలమూర్తి స్థితరూపంలో (నిలుచుని) ఎనిమిది చేతులతో కుడివైపు చేతులలో త్రిశూలం, చురకత్తి, గదా, ఖడ్గం వంటి ఆయుధాలు, ఎడమవైపు మహిషముఖాన్ని బంధించి, విల్లు, డాలు, పరిఘలను ధరించి ఎడమకాలిని మహిషం (దున్నపోతు) వీపుపై అదిమిపెట్టిత్రిశూలంతో కంఠభాగంలో పొడుస్తూ మహిషాసురమర్దిని వలె కనిపిస్తుం

Dasara Bommala Koluvu: దసరాలో బొమ్మల కొలువు ఎందుకు పెడతారు?

భగవంతుని అవతారాలు మొత్తం 21 అని భాగవతం పేర్కొంది. అయితే వాటిలో అందరికీ సుపరిచితమైనవి, సుప్రసిద్ధమైనవి దశావతారాలు. రాబోయే తరాలకు మన పురాణ విజ్ఞానం అందచేయడానికే బొమ్మల కొలువు సంస్కృతి ఏర్పడింది. దసరాలాంటి విశేష పర్వదినాల సందర్భాల్లో బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి అనేక దేవతా స్వరూపాలను పిల్లలు నెలకొల్పుతారు. వాటితో పాటు మన సంస్కృతిని ప్రతిబింబించే బొమ్మలు కూడా ఉంటాయి. ఈ కొలువును అవకాశం ఉన్నవారు పది రోజులూ ఉంచుకోవచ్చు. ఏడు వరసల్లో బొమ్మల్ని అందంగా పేర్చాలి. వాటిలో జీవ కోటి, ప్రాణికోటి, వృక్షకోటి, పక్షులు, భగవంతుని అవతారాలు, భక్తుల మూర్తులు, దేశ భక్తులు, వీరులు మహా కవులు తదితరులనందరినీ అలంకరించుకోవచ్చు. బొమ్మలకొలువు చూడగానే మన భారతీయ సనాతన సంప్రదాయమంతా స్పష్టంగా కనబడేలా ఉండాలి. ఏడువరసల బొమ్మలు అంటే ఏడు లోకాలకు ప్రతీకలుగా భావిస్తారు. బొమ్మల కొలువులో బొమ్మలకు ప్రతిరోజూ హారతి సమర్పించాలి. నైవేద్యం అవసరం లేదు. బొమ్మల కొలువు చూడడానికి వచ్చినవారికి తాంబూలం అందించాలి.

Kashi Yama Aditya Temple: యమ ఆదిత్య ఆలయం - కాశీ

 కాశీ పట్టణంలో 12 సూర్యుని ఆలయాలు ఉంటాయి. ఒక్కో ఆలయంలో సూర్యభగవానుడు ఒక్కో పేరుతో పిలవబడుతూ పూజలందుకుంటున్నాడు. కాశీ క్షేత్రానికి వెళ్లిన భక్తులు, అక్కడి యమాదిత్యుడిని కూడా తప్పకుండా దర్శించుకోవాలి. శ్రీనాథుడు రచించిన కాశీ ఖండంలో యమాదిత్యుని ఆలయ విశేషాల గురించిన ప్రస్తావన ఉంది. సింధియా ఘాట్​లోని సంకట దేవి ఆలయం సమీపంలో యమాదిత్యుడు కొలువై ఉన్నాడు. సూర్యుని పుత్రుడైన యమధర్మరాజు ఒకసారి తన భటులను పిలిచి, శ్రీమహావిష్ణువును అనునిత్యం ఆరాధించే మహా భక్తుల జోలికి వెళ్లొద్దని చెప్పాడట. యమధర్మరాజు మాటలు విస్మరించిన యమ భటులు సూర్యభగవానుడి భక్తుడైన సత్రాజిత్తు దగ్గరికి వెళ్లి, సూర్యుని ఆగ్రహానికి గురవుతారు. జరిగిన విషయం తెలుసుకున్న యమధర్మరాజు, యమ భటుల అపరాధాన్ని మన్నించమని సూర్యభగవానుడిని కోరుతూ అందుకు ప్రాయశ్చిత్తంగా సూర్యభగవానుని మూర్తిని కాశీ క్షేత్రంలో ప్రతిష్ఠిస్తాడు. కాశీలో యమధర్మరాజు సూర్యుని సేవిస్తూ ఆయన అనుగ్రహానికి పాత్రుడవుతాడు. యమధర్మరాజు ప్రతిష్ఠించిన ఆదిత్యుడు కాబట్టి ఇక్కడి సూర్యభగవానుడు యమాదిత్యుడుగా పూజలు అందుకుంటున్నాడు. అలాగే యమధర్మరాజు తండ్రి ఆనతి మేరకు శ్రీ విశ్వేశ్వరుని దర్శనం

Bathukamma Dates 2024: బతుకమ్మ పండుగ 2024

బతుకమ్మ పండుగ తెలంగాణా రాష్ట్రములోని ప్రతి సంవత్సరం అశ్వీయుజ మాసంలో శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య తిథి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో దసరా నవరాత్రులు అప్పుడు బతుకమ్మ జరుపుకుంటారు.బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సంస్కృతికి  ప్రతీక ఈ పండుగ. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం.వీటన్నింటి నేపధ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతు

Navratri Puja: నవరాత్రి పూజలను ఏ విధంగా చేసుకోవాలి ?

  నవ అంటే తొమ్మిది అని అర్థం. సంవత్సరంలో నాలుగుసార్లు నవరాత్రి దీక్ష చేయవచ్చు. అవే చైత్రం, ఆషాఢం, భాద్రపదం, ఆశ్వయుజ నవరాత్రులు. ఆశ్వయుజ మాసంలో వచ్చేవాటిని దేవీ నవరాత్రులు అంటారు. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకూ శరన్నవరాత్రులను పాటిస్తారు. శరన్నవరాత్రులు హస్తా నక్షత్రం తో ఆరంభమై శ్రవణ నక్షత్రం పూర్తి కావడం విశేషం. ఈ తొమ్మిది రోజుల్లో ఆచార సంప్రదాయాల మేరకు అమ్మవారిని యధాశక్తి పూజించవచ్చు. అమ్మవారిని తొమ్మిది రోజులూ అర్చించడంతో పాటు తొమ్మిది అలంకారాలతో తొమ్మిది రూపాల్లో దర్శింప చేస్తారు.

Mandapams in Tirumala: తిరుమల ఆలయంలో మండపాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో మండపాలు చాలా ఉంటాయి.. ఏ మండపంలో ఎలాంటి క్రతువులు నిర్వహిస్తారు ? ప్రతిమా మండపం తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం నుంచి లోపలికి వెళ్లగానే 16 స్తంభాలతో  విజయనగర శిల్పసంప్రదాయం ఉట్టిపడేలా ప్రతిమా మండపం ఉంటుంది. దీన్నే శ్రీ కృష్ణదేవరాయ మండపం అని అంటారు. ఈ మండపంలో దక్షిణభాగాన శ్రీకృష్ణదేవరాయలు ఆయన దేవేరులు, తిరుమలదేవి-చిన్నాదేవి నమస్కరిస్తూ నిలువెత్తు రాగి విగ్రహాలు కనిపిస్తాయి. శ్రీ మలయప్పస్వామి మాడవీధుల్లో విహరించి లోపలికి వచ్చి ఈ ప్రతిమా మండపంలోనే కొంతసేపు విశ్రమిస్తారు. ఇక్కడే ఆచార్యపురుషులు దివ్యప్రబంధగానం చేస్తారు. అద్దాలమండపం   ప్రతిమా మండపానికి ఉత్తరదిక్కున ఎత్తైనప్రదేశంలో అద్దాలమండపం (ఆయినామహల్‌) ఉంది. అందులో డోలోత్సవానికి గొలుసులు వేలాడతీసి ఉంటాయి. ఊయలలో ఊగేటప్పుడు స్వామివారు అద్దాలలో అన్నివైపులా ప్రతిబింబిస్తారు. ఇక్కడ నిత్యం డోలోత్సవం జరుగుతుంది. క్రీ.శ.1831 నాటికే ఈ మండపముందని రికార్డుల ద్వారా తెలుస్తోంది. రంగమండపం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే ప్రముఖులకు వేద ఆశీర్వచనం అందించే సమయం లో ఈ పేరును మనం ఎక్కువగా వింటుంటాము. రంగమండపం లేదా రంగనాయకమండపం. ఈ మండపం

Navaratri Deeksha: నవరాత్రి దీక్షల్లో పాటించాల్సిన నియమాలు ఏమిటి ?

పూజకు కూర్చున్న వ్యక్తి తప్పనిసరిగా ఉతికిన వస్త్రాలు లేదా పట్టువస్త్రాలు ధరించాలి. ఎరుపు రంగు వస్త్రాలు శ్రేష్ఠం పురుషులు తప్పనిసరిగా ప్రతిరోజూ తలస్నానం చేయాలి నవరాత్రి దీక్ష స్వీకరిస్తే కనుక తొమ్మిది రోజులూ క్షుర కర్మ చేయించుకోకూడదు.  నేలపైన మాత్రమే నిద్రించాలి. బ్రహ్మచర్యం పాటించాలి  మద్యమాంసాదులు ముట్టుకోకూడదు. అబద్ధం ఆడకూడదు.  చేపట్టిన పూజా కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతమైనది అని నమ్మకంతో, భక్తితో ముందుకు సాగిపోవాలి.

Tirumala Shanivaralu: తిరుమల శనివారాలు 2024

తమిళ మాసం అయిన పెరటాశి  మాసంలో తిరుమల శనివారాలు జరుపుకుంటారు. ఈ మాసం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వస్తుంది.  ఈ మాసంలోని శనివారాలు పవిత్రంగా భావించి విష్ణు ఆలయాలలో భక్తులు ప్రతేక్య పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలోనే తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరగడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.చాల మంది భక్తులు ఈ మాసంలో కేవలం శాకాహారం మాత్రమే స్వీకరిస్తారు. శ్రీమహావిష్ణువు శ్రీవేంకటాచలపతిగా అవతరించిన మాసమే పెరటాసి. ఈ మాసంలో శ్రవణ నక్షత్రంలో తిరుమలేశుడు అవతరించినట్లు శ్రీవేంకటాచల మహత్యం చెబుతోంది.  ప్రత్యేకించి శనివారం ఆయనకు ఎంతో ప్రీతి. పెరటాసిలో శనివారాలు నాలుగు లేక ఐదు వస్తాయి. వీటిలో మూడవ శనివారాన్ని తమిళులు చాలా విశేషంగా భావించడం ఆనవాయితీగా వస్తోంది.    ఈ మాసంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారికి  పిండి దీప సమర్పణ ఎంతో విశేషంగా జరుపుకుంటారు.  ఈ మాసంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాల  వైభవాన్ని  గురించి ఎంత చెప్పినా తక్కువే.  ప్రతి బ్రహ్మోత్సవం  తిరుమలలో విశేషంగా, వైభవంగా జరుగుతుంది. ఈ మాసంలో ముఖ్యంగా  కొంతమంది శ్రీ వైష్ణవుల తిరుమాళిగల్లో (ఇళ్ళల్లో) శనివారాలలో  శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం  పెద్ద

Venkatagiri Jatara: వెంకటగిరి పోలేరమ్మ జాతర 2024 తేదీలు

రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర జరగనుంది. వినాయక చవితి పూర్తయిన రెండు వారాలకు పోలేరమ్మ అమ్మవారి జాతర నిర్వహించడం ఆనవాయితీ. రెండు రోజులపాటు జరిగే ఈ జాతరకు వెంకటగిరిలోని ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నా స్వస్థలాలకు చేరుకుంటారు. దేశ విదేశాలనుంచి కూడా ఆ రెండురోజుల ఉత్సవాలనూ చూసేందుకు స్థానికులు తరలి వస్తారు. 2024 ముఖ్య తేదీలు  సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం మొదటి చాటింపు ఉంటుంది సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం రెండో చాటింపు ఉంటుంది.  సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం ఘటోత్సవం నిర్వహిస్తారు.  సెప్టెంబర్ 26వ తేదీ గురువారం అమ్మవారి ఉత్సవం జరుపుతారు సెప్టెంబర్ 26వ తేదీ గురువారం అమ్మవారి నిలువు, నిష్క్రమణం, నగరోత్సవంతో జాతర ముగుస్తుంది. జాతర తొలిరోజు రాత్రి అమ్మవారి మట్టి ప్రతిమను తయారు చేస్తారు, ఆ తర్వాత అమ్మగారింటినుంచి అత్తగారింటికి ఆ ప్రతిమను తీసుకొస్తారు. అక్కడ బుక్క చుక్క పెట్టి అమ్మవారి మూర్తిని దర్శనాలకు అనుమతిస్తారు. అత్తగారింటి నుంచి పోలేరమ్మ ఆలయానికి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఉంచుతారు. ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. అర్థరాత్రి ఈ తంతు అంతా జరుగుతుంది. అనంతర