Bhavani Deeksha Rules: భవాని దీక్ష నియమాలు

భవాని దీక్ష విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ కోసం స్వీకరిస్తారు. ఈ దీక్ష కార్తీక మాసంలోని ఉత్థాన ఏకాదశి రోజు లేదా కార్తీక పౌర్ణమి రోజు నుండి దీక్ష స్వీకరిస్తారు.ఈ దీక్ష మండలం( 41 రోజులు) లేదా అర్ధ మండలం( 21 రోజులు) కొనసాగుతుంది.


పురుషులకు

  • దీక్షా ప్రారంభమునకు ముందుగా సోమ-బుధ- గురు వారములలో ఒక మంచిరోజున శిరోముండ నము (గుండు) చేయించుకొని (మీసము ఉంచు కొనరాదు), (శిఖపెట్టుకునట్లైతే విశేషము) భవానీ దీక్షను ప్రారంభము చేయవలెను.
  • దీక్షాకాలమంతయు రెండు పూటల శిరఃస్నానము (తలస్నానము) చేయవలెను.
  • దీపారాధన తడివస్త్రములతో చేయరాదు. ఆరిన (పొడిగానున్న) దుస్తులు ధరించి దీపారాధన చేయ వలెను.
  • ఒక వస్త్రము మాత్రమే ధరించి (భుజం పై రెండవ వస్త్రము లేకుండా) దీపారాధన చేయకూడదు.
  • నుదుట విభూతి రేఖలు గంధము. కుంకుమబొట్టు ధరించవలెను.

స్త్రీలకు
  • దీక్షా ప్రారంభమునకు ముందు తలంటు స్నానము చేసి పవిత్రముగ దీక్షను ప్రారంభము చేయవలెను.
  •  రెండు చేతులకు గాజులు, నుదుట కుంకుమ బొట్టు కాళ్ళకు పసుపు విధిగా ధరించవలెను.
  •  దీపారాధన చేయునపుడు పూజచేయునపుడు తల జుట్టు (జడ) ముడివేసికొని చేయవలెను.
  • స్నానముచేసి తడిసిన వస్త్రములతో దీపారాధన చేయరాదు.
  •  ఆరిన (పొడిగానున్న) దుస్తులు ధరించి దీపారాధన చేయవలెను.
  • ప్రతిరోజు పొద్దున శిరఃస్నానము సాయంత్రము కంఠస్నానము చేసిన చాలును.
ఆహార నియయములు

  • పవిత్రముగు ఆహారము భుజించవలెను.
  • ఉల్లి, పుట్టగొడుగులు, మద్యము, మాంసము, స్వీకరించరాదు.
  • పొగత్రాగకూడదు.
  • ఛద్ది అన్నము తినకూడదు.
  • ఎంగిలి భుజంచరాదు.
  • రోజులో ఒక పూట మాత్రమే భోజనము చేయవలెను.
  • ఇద్దరు కలిసి ఒక పాత్రలో భుజించకూడదు. 
భవానీదీక్షలలో స్త్రీ-పురుషులందరు ఆచరించవలసిన నియమములు

  • దీక్షా ప్రారంభము నుండి దీక్షా సమాప్తివరకు ఎఱ్ఱని దుస్తులు ధరించుట-భవానీ మాలా ధారణ (మాలిక ఎప్పుడు మెడలో నుండుట) చేయవలెను.
  • భవానీ నామమును లేక అమ్మవారి నామమును జపించుచుండవలెను.
  • రోజూ దుర్గాదేవిని కొంతసేపు ధ్యానించాలి.
  • మైల సోకకుండా పవిత్రముగా ఉండవలెను.
  • పవిత్రమైన-ప్రశాంతమైన మనస్సుతో ఉండవలెను.అహంకారము లేకుండా
  • ప్రతి రోజు రెండు పూటల అమ్మవారి పటమునకు గాని లేక చిన్న పసుపు ముద్దకు గాని పూజ చేయవలెను.
  • దీక్షా కాలములో కనీసము ఒకరోజైనా కృష్ణా నదీ స్నానము చేయుట మంచిది.
  • అశ్లీలము, అబద్ధములు పల్కకూడదు.
  • పగటివేళ నిద్ర పోకూడదు.
  • కాళ్ళకు తోలు చెప్పులు వేయకూడదు
  • సూర్యోదయ సూర్యాస్తమయ సమయములలో పడుకొనుట, నిద్రపోవుట నిషేధము.
  • కాలకృత్యములకు వెళ్ళిన తర్వాత కాళ్ళు కడిగి కొని 3 పర్యాయములు నీరు పుక్కిలిచేయుట చేయవలెను.
  • సినిమాలు చూడకూడదు.
  • బ్రహ్మచర్యము చేయవలెను.
  • దీక్షాకాలములో జాతాశౌచ-మృతాశౌచములు వచ్చినచో - దీక్ష పనికిరాదు. మాలిక తీసివేసి ఆశౌచము పాటించవలెను.
  • చాపమీద పడుకొనవలెను.
  • ఉదయం - సాయంత్రం ఉపాహారము స్వీకరించవచ్చును.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 3వ అధ్యాయం- శివపార్వతుల సంవాదం- సుమిత్రుడు తపస్సు చేసి మోక్షం పొందిన కథ

Amrutha Lakshmi Vrat: అమృత లక్ష్మీ వ్రతం

Magha Masam 2025: మాఘమాసంలోని విశేషమైన పండుగలు- పుణ్య తిథులు

Maa Kamakhya Temple: శ్రీ కామాఖ్యా దేవి ఆలయం - గువాహటి

Srinivasa Mangapuram Temple: శ్రీనివాస మంగాపురం ఆలయంలో జరిగే ఉత్సవాలు

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Bikkavolu Ganapati Temple: శ్రీ లక్ష్మి గణపతి ఆలయం - బిక్కవోలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి

Bhagavan Venkaiah Swamy: శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన 2024 - గొలగమూడి

Magha Puranam Telugu: మాఘ పురాణం 15వ అధ్యాయం - వెయ్యేళ్ల పాటు సాగిన బ్రహ్మమహేశ్వరుల కలహం- విశ్వరూపంతో శాంతింపజేసిన శ్రీహరి