మాఘమాసంలో వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ మాసంలో 30 రోజులు పుణ్య తిధులే. మాఘ మాసం జనవరి 30 (గురువారం) నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 28 శుక్రవారంతో ముగుస్తుంది.
జనవరి 30 మాఘ శుద్ధ పాడ్యమి: పరమ పవిత్రమైన మాఘ మాసం ప్రారంభం. నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఆరంభం. ఆలయాలలో మాఘ పురాణం ప్రారంభం.
జనవరి 31 మాఘ శుద్ధ విదియ: చంద్రోదయం. మాఘ మాసంలో శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది.
ఫిబ్రవరి 2 మాఘ శుద్ధ చవితి : దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి గరుడ సేవ. తిల చతుర్థి, కుంద చతుర్థి.
ఫిబ్రవరి 3 మాఘ శుద్ధ పంచమి/ షష్ఠి : వసంత పంచమి , శ్రీ పంచమి. దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం. మహా కుంభ మేళాలో నాలుగవ రాజస్నానం.
ఫిబ్రవరి 4 మాఘ శుద్ధ సప్తమి : రథసప్తమి. తిరుమల శ్రీవారి ఆలయంలో సకల వాహన సేవలు.
ఫిబ్రవరి 5 మాఘ శుద్ధ అష్టమి : భీష్మాష్టమి
ఫిబ్రవరి 6 మాఘ శుద్ధ నవమి: మధ్వనవమి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవం ప్రారంభం. దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సమాప్తం.
ఫిబ్రవరి 7 మాఘ శుద్ధ దశమి: తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ కామాక్షిదేవి చందనోత్సవం, దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి పుష్పయాగం.
ఫిబ్రవరి 8 మాఘ శుద్ధ ఏకాదశి: భీష్మ ఏకాదశి.
ఫిబ్రవరి 9 మాఘ శుద్ధ ద్వాదశి : ద్వాదశి పారణ
ఫిబ్రవరి 10 మాఘ శుద్ధ త్రయోదశి : సోమ ప్రదోష వ్రతం
ఫిబ్రవరి 12 మాఘ శుద్ధ పౌర్ణమి : మాఘ పౌర్ణమి. నదీ స్నానం. కుంభ సంక్రమణం, రామకృష్ణ తీర్ధ ముక్కోటి, మహా కుంభ మేళాలో అయిదవ రాజస్నానం.
ఫిబ్రవరి 13 మాఘ బహుళ పాడ్యమి : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిన ప్రణయ కలహ మహోత్సవం
ఫిబ్రవరి 16 మాఘ బహుళ చవితి : సంకష్ట హర చతుర్థి
ఫిబ్రవరి 17 మాఘ బహుళ పంచమి : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిన పెద్ద శాత్తుమొర
ఫిబ్రవరి 18 మాఘ బహుళ షష్ఠి : తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ఫిబ్రవరి 19 మాఘ బహుళ సప్తమి : తిరుపతి కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఫిబ్రవరి 22 మాఘ బహుళ నవమి : తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి గరుడసేవ.
ఫిబ్రవరి 24 మాఘ బహుళ ఏకాదశి : సర్వ ఏకాదశి, విజయ ఏకాదశి
ఫిబ్రవరి 25 మాఘ బహుళ ద్వాదశి : భౌమ ప్రదోషం, శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి రధోత్సవం
ఫిబ్రవరి 26 మాఘ బహుళ త్రయోదశి / చతుర్దశి : మహాశివరాత్రి పర్వదినం. తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు సమాప్తం. తిరుపతి కపిలేశ్వర స్వామి వారి నంది వాహనోత్సవం, తిరుకచ్చినంబి ఉత్సావారంభం
ఫిబ్రవరి 27 మాఘ బహుళ చతుర్దశి/అమావాస్య : తిరుపతి కపిలేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం
ఫిబ్రవరి 28 మాఘ బహుళ అమావాస్య : తిరుపతి కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు సమాప్తం. దర్శఅమావాస్య. ద్వాపర యుగాది, మాఘమాసం సమాప్తం.
పరమ పవిత్రమైన మాఘ మాసంలో నెల రోజుల పాటు శివ కేశవులను పూజించే వారిపట్ల శివకేశవులు ప్రసన్నులై శుభాలు కలిగిస్తారని పురాణాలు తెలుపుతున్నాయి.
No comments:
Post a Comment