- మాఘ స్నానాలకు సాటివచ్చే క్రతువులుగాని, క్రియలుకాని లేవని శాస్త్రాలు చెబుతున్నాయి.
- ఈ పుణ్యస్నానం విశేషాలు బ్రహ్మపురాణంలోను, పద్మపురాణంలోను వివరించబడాయి.
- పుష్యబహుళ అమావాస్య రోజున అంటే మాఘమాసం ప్రారంభమయే ముందురోజు ఆరంభించి, మాఘమాసం అంత నియమంగా ప్రతి రోజు చేయాలి.
- అన్ని రోజులు వీలుకానప్పుడు మాఘశుద్ధ పాడ్యమి, విదియ, తదియలలో మూడురోజులు చేయవచ్చు.
- మాఘ స్నానాలను పుణ్యనదులలో చేయడం విశేష ఫలదాయకం. అందుకు అవకాశం లేకపోతే చెరువుల వద్ద, బావుల వద్ద కనీసం బోరు బావుల దగ్గరైనా ఈ మాఘ స్నానాలు చేయవచ్చు.
- ఈ స్నానాన్ని నక్షత్రాలు ఉండగా తెల్లవారుజామున చేయడం ఉత్తమం.
- మాఘ స్నానాలు నూనె రాసుకొని చేయకూడదు అని శాస్త్రం స్పష్టంగా చెబుతోంది.
- ఈ మాఘస్నానాలు చేయడం వల్ల కాయిక, వాచిక , మానసిక దోషాలు తొలగిపోతాయి. అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. ఆయురారోగ్యాలు చేకూరతాయి.
మాఘమాసంలో ప్రతి రోజు నియమానుసారంగా మాఘమాస స్నానం చేస్తే వారి వారి కోరికలన్నీ నెరవేరుతాయని పద్మపురాణంలో పేర్కొన్నారు. మాఘస్నానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. మాఘస్నానం వలన మహాపాపాలు కూడా నశిస్తాయని నిర్ణయ సింధులో చెప్పారు. వర్ణ, వర్గ, ప్రాంత బేధాలు లేకుండా అందరూ మాఘస్నానం ఆచరించవచ్చు. ఈ మాసంలో సూర్యారాధన, శివోపాసన, విష్ణు అర్చన లాంటివి చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని శాస్త్ర వచనం. సర్వదేవతలకు ప్రీతికరమైన మాసం మాఘమాసం. సూర్యోదయానికి ముందు నదీ స్నానం ఉత్తమం. నది అందుబాటులో లేనివారు తటాకంలోగానీ, బావి నీళ్లతో గాని స్నానమాచరించాలి. ఇవేమీ అందుబాటులో లేనప్పుడు ఇంట్లోనే స్నానమాచరించేవారు “గంగేచ యమునేచైవ గోదావ సరస్వతీ నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు" అని శ్లోకం చెప్పుకొని స్నానం చేయాలి. మాఘ స్నానాల్లో త్రివేణి సంగమ స్నానం ఉన్నతమైనదని ధర్మశాస్త్రం చెబుతోంది. మాఘ పూర్ణిమ నాడు పెద్ద ఎత్తున జనం త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తారు.
No comments:
Post a Comment