ప్రసిద్ధి చెందిన జానకంపేట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం బ్రహ్మోత్స వాలకు ముస్తాబైంది. ఫిబ్రవరి 5 నుండి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఆలయ ప్రాంగణంలోని అష్టముఖి కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు, గ్రహ దోషాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం.
ఏటా మాఘమాసం శుద్ధ అష్టమి నుండి ఉత్సవాలు జరుగుతాయి.
ఫిబ్రవరి 5 నుండి 7వరకు - అధ్యయనోత్సవాలు, ద్రావిడ ప్రబంధ పారాయణం
ఫిబ్రవరి 8న స్థాపనం, పుణ్యవచనం. మాతృక పూజ, రక్షాబంధనం, అంకురార్పణం, హారతి
ఫిబ్రవరి 9న శాల ప్రతిష్ట, వాస్తు హోమం, యజ్ఞం, దేవతా ఆహ్వానం, భేరి పూజ, బలిహరణం, హారతి, మంత్రపుష్పం
ఫిబ్రవరి 10న యజ్ఞం. స్వామి వారి కల్యాణం, హోమం
ఫిబ్రవరి 11న యజ్ఞం, మంత్రపుష్పం
ఫిబ్రవరి 12న స్వామివారి రథోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు
ఫిబ్రవరి 13న చక్ర తీర్థం, శేష హోమం
నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి 10 కి.మీ దూరంలో లక్ష్మీనర సింహస్వామి ఆలయం ఉంది.
No comments:
Post a Comment