- మాఘమాసంలో వచ్చే శుద్ధ చతుర్థిని 'తిలచతుర్థి' అంటారు.
- ఈ వ్రతానికి సాయంకాలం చవితి ముఖ్యం.
- ఈ రోజు గణపతిని పూజించాలి.
- నువ్వులతో వండిన పదార్ధాన్ని నివేదించాలి.
- నువ్వులతో హోమం చేయాలి, రాగి పంచపాత్రను నువ్వులతో నింపి బ్రాహ్మణుడికి దానం చేయాలి.
- అతనికి తిలలతో చేసిన పదార్థంతో భోజనం పెట్టాలి.
- నువ్వులతో చేసిన వాటిని స్వయంగా తినాలి.
- ఈ విధంగా అయిదు 'చవితి' లు అంటే ఆషాడ శుద్ధ చవితి వరకు చేయాలి.
- ఆ తరువాత పూజించిన గణపతి మూర్తిని బ్రాహ్మణునికి దానం చేయాలి. దీనినే వరాహపురాణం ' అవిఘ్నకరవ్రతం' అంటోంది.
సగరుడు అశ్వమేధయాగానికి ముందు, శివుడు త్రిపురాసుర సంహారానికి ముందు, శ్రీ మహావిష్ణువు సముద్ర మధనానికి ముందు ఈ వ్రతాన్ని ఆచరించినట్లు తెలుస్తోంది.
తిల చతుర్థి పూజా విధానం
తిల చతుర్థి పూజా విధానం గురించి స్కంద పురాణంలో వివరంగా ఉంది. ఈ రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి శుచియై నిత్య పూజాదికాలు ముగించుకొని గణపతి సమక్షంలో దీక్ష తీసుకోవాలి. పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం గణపతిని పూజించాలి. ఇంట్లో కానీ, ఆలయంలో కానీ గణేశుని పంచామృతాలతో అభిషేకించి, జిల్లేడు పూలు, గరిక సమర్పించాలి. అష్టోత్తర శతనామాలతో వినాయకుని పూజించాలి. వినాయకునికి నువ్వులు, బెల్లంతో తయారు చేసిన లడ్డులు, ఉండ్రాళ్ళు, కొబ్బరికాయ, అరటిపండ్లు, మోదకాలు నైవేద్యంగా సమర్పించాలి. 'ఓం గం గం గణపతయే నమః' అనే గణేశ మూల మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. పూజ పూర్తి అయ్యాక ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టి, దక్షిణ తాంబూలం ఇచ్చి నమస్కరించుకోవాలి. అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు.
ఈ దానాలు శ్రేష్ఠం
ఈ రోజున నువ్వులు, నువ్వులతో తయారు చేసిన పదార్థాలు దానం చేయడం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా అన్నదానం, వస్త్ర దానం చేయడం వలన అఖండ ఐశ్వర్యం లభిస్తుంది.
కుంద చతుర్థి
తిల చతుర్ధినే కుంద చతుర్థి అని కూడా అంటారు. ఈ రోజు ప్రదోష సమయంలో అంటే సూర్యాస్తమయం తరువాత శివునికి కుంద పుష్పాలు సమర్పించాలి. కుంద పుష్పాలు అంటే మల్లెపూలు. ఎవరైతే ఈ రోజు శివుని మల్లెలతో పూజిస్తారో వారికి జీవితంలో సకల సౌభాగ్యాలు కలిగి కుటుంబ సౌఖ్యం, వ్యాపారాభివృద్ధి, సిరి సంపదలు ప్రాప్తిస్తాయని శాస్త్రం చెబుతోంది.
ఇవి కూడా చేయాలి
ఈ రోజున నువ్వుల నూనెతో దీపారాధన, నువ్వులతో హోమము చేయడం శ్రేయస్కరం. అంతేకాక ఈ రోజున బెల్లం, ఉప్పు దానం చేయాలని శాస్త్రవచనం.
No comments:
Post a Comment