గ్రామదేవతలందరూ శక్తి స్వరూపిణులే. నూట ఎనిమిది మంది గ్రామదేవతలు వారి సోదరుడైన పోతురాజుతో కలిసి గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారు. ఆ దేవతలకు శిష్టసంప్రదాయంలోని దేవతల మాదిరిగా ఆలయం, ధ్వజస్తంభం వంటివన్నీ ఇటీవలి కాలంలో భక్తులు నిర్మించుకుంటున్నారు. ఒకప్పుడు బొడ్రాయినే గ్రామదేవతగా పూజించే ఆచారం ఉండేది. అన్నివర్ణాలవారూ గ్రామదేవతలను ఆరాధిస్తారు. రహదారివెంట వెళుతున్న అందరికీ గ్రామదేవతల దర్శనం సులభంగా జరగాలి. గ్రామదేవతల ఆలయాల్లోకి తరచుగా వచ్చి దర్శనం చేసుకోని శిష్టాచార సంపన్నులు సైతం దసరా రోజుల్లో గ్రామదేవతలకు నైవేద్యాలు సమర్పిస్తారు.
రఘువంశరాజులకి కులదేవత సూర్యుడు. సూర్యుని పూజించిన తరువాతనే వారు ఇతర దేవతలను ఆరాధన చేసేవారు. కులం అనే మాటకి సమాన లక్షణాలున్న సముదాయం, గుంపు అని అర్థం. ఈ కాలంలో అది వర్ణభేదం అనే అర్ధంలో వాడుకలోకి వచ్చింది. కానీ కులం అంటే వంశం అనే అర్థం సరైనది. ఒక వంశంలో తరతరాలుగా పూజలందుకునే దైవాన్ని కులదేవత అంటారు. ప్రతివంశానికి ఒకకులదేవత ఉంటుంది. ఇష్టదేవతారాధనకు ముందు కులదేవతారాధన చేయడం తప్పనిసరి.
Comments
Post a Comment