షిరిడి లో శ్రీ సాయిబాబా వారు జీవించి ఉన్న కాలం నుంచి ఇప్పటి వరకు షిరిడిలో అన్నదానం ఒక యజ్ఞంగా సాగుతోంది. షిరిడి సాయి ప్రసాదం ఎన్నో జన్మల పుణ్యఫలం. 2007 వరకు సాయి ప్రసాదాలయ సాధారణంగానే ఉండేది.భక్తుల రద్దీ పెరగడంతో షిర్డీ సాయి సంస్థాన్ కొత్త ప్రసాదాలయ నిర్మించింది. 7 ఎకరాల భూమిలో 11 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మహాభవనాన్ని నిర్మించారు. 2001 లో తొలిసారి సౌరశక్తితో మూడువేలమందికి కావాల్సిన భోజనం తాయారు చేసేవారు. షిరిడి ప్రసాదాలయంలో 73కి పైగా సౌరశక్తిని ఉత్త్పతి చేసే డిష్ లున్నాయి.ఇవి అన్నీ సూర్యగమనం ఆధారంగా కదులుతూ సౌర్యవిద్యుత్ ఉత్త్పతి చేస్తాయి. ఇలా చేయడం వల్ల సంస్థాన్ కి ఒక సంవత్సరానికి 30 లక్షల వరకు ఆదా అవుతుంది. రోజు 600 నుంచి 800 కిలోల వరకు కూరగాయల్ని ఉడికిస్తారు. అదే పర్వదినాల్లో అయితే ఈ సంఖ్య 1000 నుంచి 1200 కిలోల వరకు ఉంటుంది. రోజుకి 40 నుంచి 50 వేల మందికి సరిపడే చపాతీలు షిరిడి ప్రసాదాలయాలో తయారు అవుతున్నాయి. ఒక గంటకు రెండువేల చపాతీలు ఆధునిక యంత్రాల ద్వారా తయారు చేస్తున్నారు.ఒక రోజుకు 6 నుంచి 7 వేల కిలోల గోధుమ పిండి ఖర్చుఅవుతుంది. గంటకు 30 వేల చపాతీలు చేసే సామర్థ్యం ఈ ప్రసాదా