Skip to main content

Posts

Showing posts with the label sleeping rules

Sleeping Rules: పురాణాలలో చెప్పిన నిద్ర నియమాలు

  మన హిందూ స్మృతులు, పురాణాలలో చెప్పిన శయన నియమాలు  నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం మరియు స్మశానవాటికలో కూడా పడుకోకూడదు.( మనుస్మృతి) పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు. ( విష్ణుస్మృతి) విద్యార్థి,నౌకరు,మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో,వీరిని మేల్కొలపవచ్చును.( చాణక్య నీతి) ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలి.( దేవీ భాగవతము) పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు.( పద్మ పురాణము) తడి పాదములతో నిద్రించవద్దు. పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి (ధనం)ప్రాప్తిస్తుంది.( అత్రి స్మృతి)  విరిగిన పడకపై,ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం.( మహాభారతం) నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు.( గౌతమ ధర్మ సూత్రం) తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య,పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత,ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన హాని,మృత్యువు,ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో ధనము,ఆయువు ప్రాప్తిస్తుంది. పగటిపూట ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసంలో 1 ముహూర్తం(48నిమిషాలు) నిద్రిస్తారు.(పగటిపూట నిద్ర రోగహేతువు,మరియు ఆయుక్షీణత