ఉత్తరాంధ్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రామ తీర్ధం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఉంది. పురాణాల ప్రకారం వనవాసం సమయంలో శ్రీరాముడు ఇక్కడ సంచరించాడని, ఆ సమయంలో శివుని మంత్రాన్ని జపించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్థల పురాణం ద్వాపరయుగంలో పాండవులు ఈ ప్రాంతంలో సంచరించారని ప్రతీతి. ఆ సమయంలో పాండవులు కృష్ణుని తమతో కూడా రమ్మని పిలిస్తే శ్రీకృష్ణుడు సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఇచ్చి తనకు బదులుగా వాటిని పూజించమని చెప్పాడంట! ఈ ప్రాంతంలో ఉండే భీముని గృహం ఇందుకు ఆధారంగా నిలుస్తోంది. 16 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పూసపాటి సీతారామచంద్ర మహారాజుకు శ్రీరాముడు కలలో కనిపించి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఇచ్చిన విగ్రహాలు ఇక్కడ బోడి కొండపైన నీటి మడుగులో ఉన్నట్లు చెప్పాడంట. వెంటనే రాజు ఆ విగ్రహాలను వెలికి తీయించి ఆలయాన్ని నిర్మించాడంట! తీర్ధంలో దొరికిన విగ్రహాలు కాబట్టి ఈ క్షేత్రానికి రామతీర్ధమని పేరు వచ్చింది. చరిత్ర పుటలను పరిశీలిస్తే ఈ ఆలయం అతి ప్రాచీనమైనది, ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరొందినదని తెలుస్తోంది. రామ తీర్ధం ఆలయ పరిసర ప్రాంతాల్లో బౌద్ధులు, జైనులు నివసించినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయ