Skip to main content

Ramatheertham Temple: శ్రీ రామస్వామి వారి దేవస్థానం - రామతీర్థం

 

ఉత్తరాంధ్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రామ తీర్ధం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఉంది. పురాణాల ప్రకారం వనవాసం సమయంలో శ్రీరాముడు ఇక్కడ సంచరించాడని, ఆ సమయంలో శివుని మంత్రాన్ని జపించారని పురాణాల ద్వారా తెలుస్తోంది.

స్థల పురాణం

ద్వాపరయుగంలో పాండవులు ఈ ప్రాంతంలో సంచరించారని ప్రతీతి. ఆ సమయంలో పాండవులు కృష్ణుని తమతో కూడా రమ్మని పిలిస్తే శ్రీకృష్ణుడు సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఇచ్చి తనకు బదులుగా వాటిని పూజించమని చెప్పాడంట! ఈ ప్రాంతంలో ఉండే భీముని గృహం ఇందుకు ఆధారంగా నిలుస్తోంది. 16 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పూసపాటి సీతారామచంద్ర మహారాజుకు శ్రీరాముడు కలలో కనిపించి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఇచ్చిన విగ్రహాలు ఇక్కడ బోడి కొండపైన నీటి మడుగులో ఉన్నట్లు చెప్పాడంట. వెంటనే రాజు ఆ విగ్రహాలను వెలికి తీయించి ఆలయాన్ని నిర్మించాడంట! తీర్ధంలో దొరికిన విగ్రహాలు కాబట్టి ఈ క్షేత్రానికి రామతీర్ధమని పేరు వచ్చింది. చరిత్ర పుటలను పరిశీలిస్తే ఈ ఆలయం అతి ప్రాచీనమైనది, ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరొందినదని తెలుస్తోంది. 

రామ తీర్ధం ఆలయ పరిసర ప్రాంతాల్లో బౌద్ధులు, జైనులు నివసించినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. ఇక్కడి కొండల్లో ఉన్న గురుభక్త కొండ, దుర్గకొండలపై ఉన్న ప్రాచీన బౌద్ధాలయాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ కొండలకు ఉత్తరాన నీలాచలం, పశ్చిమాన జైన మందిరం ఉన్నాయి.

రామ తీర్ధం క్షేత్రంలో వరాహ లక్ష్మీ నరసింహ స్వామి, మాధవ స్వామి, వైకుంఠ నాథస్వామి, వేణు గోపాలుడు, లక్ష్మీదేవి, ఆంజనేయస్వామి, ఆళ్వారుల సన్నిధి, ఉమాసహిత సదాశివ స్వామి ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు.

సీతారామలక్ష్మణులు ఈ ప్రాంతంలో కొంతకాలం సంచరించారనడానికి నిదర్శనంగా ఈ ఆలయానికి ఉత్తరాన ఉన్న ఏకశిలా పర్వతంపై శ్రీరాముని పాదముద్రికలు, ఆంజనేయస్వామి అడుగులు కానవస్తాయి. అలాగే సీతారామ లక్ష్మణుల విగ్రహాలు దొరికిన మడుగుకు పశ్చిమాన భీముని బుర్ర, గాడీ పొయ్యి, బుద్ధ విగ్రహం, పర్ణశాల, పలుకురాయి, సీతమ్మ పురిటి మంచం తాలూకు చిహ్నాలు కనిపిస్తాయి. విశేషమేమిటంటే రామాలయం పక్కనే ఉన్న కోనేరులో నీరు ఏ కాలంలోనైనా ఇంకిపోవంటారు.

రామ తీర్ధం ఆలయంలో శివకేశవ అభేదంగా ఉత్సవాలు జరగడం ప్రత్యేకత. ఏడాది పొడవునా ఉత్సవాలతో నిత్యం భక్తుల రద్దీతో ఉండే రామ తీర్ధంలో ఇటు శివునికి, కేశవునికి కూడా పూజలు జరుగుతాయి.

దసరా సమయంలో ఇక్కడ 10 రోజులపాటు వేంకటేశ్వరస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

విజయదశమి రోజు స్వామి అశ్వ వాహనంపై నీలాచలం వద్దకు చేరుకొని జమ్మి వృక్ష పూజ, ఆయుధ పూజ నిర్వహించడం కన్నుల పండుగలా సాగుతుంది.

ఏడాదికోసారి జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు జరిగే జ్యేష్టాభిషేకం రోజు శ్రీరాముని నిజరూప దర్శనం ఉంటుంది.

ఇక కార్తీకమాసంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు రామ కోనేరులో సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులకు అంగరంగ వైభవంగా తెప్పోత్సవం జరుగుతుంది.

రామతీర్ధాన్ని శైవక్షేత్రంగా కూడా భావించి శైవులు మహాశివరాత్రి పర్వదినానికి విశేషంగా తరలి వస్తారు. ఆ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడం వల్ల రామ తీర్ధం భక్త జనసంద్రంగా మారుతుంది.

ఇక ఉత్తరాంధ్రలో అతి పెద్ద జాతర పైడితల్లి సిరిమాను ఉత్సవాలకు విచ్చేసిన భక్తులు రామ తీర్ధాన్ని కూడా దర్శించడం పరిపాటి.

Comments

Popular posts from this blog

Karthika Puranam: కార్తీక పురాణం 14వ అధ్యాయము - మాసచతుర్దశీమాహాత్మ్యము, మాసశివరాత్రివ్రత ఫలము

  కార్తిక పూర్ణిమాదినమందు వృషోత్సర్గమును (ఆబోతు, అచ్చు పోయుట) చేయువానికి జన్మాంతరీయ పాపములుకూడా నశించును. కార్తిక వ్రతము మనుష్యలోక మందు దుర్లభము సులభముగా ముక్తినిచ్చునది కార్తిక పూర్ణిమనాడు పితృప్రీతిగా వృషోత్సర్గమును జేయువానికి కోటి మాఱులు గయాశ్రాద్ధమును జేసిన ఫలముగలుగును. రాజా ! స్వర్గమందున్న పితరులు మన వంశమందెవ్వడైనను కార్తిక పూర్ణిమనాడు నల్లని గిత్తను, గిత్తదూడనులేక ఆబోతును విడుచునా, అట్లయిన మనము తృప్తిబొందుదు మని కోరుచుందురు. ధనవంతుడు గాని దరిద్రుడు గాని కార్తిక పూర్ణిమ రోజున వృషోత్సర్గ మును జేయనివాడు యమలోకమందు అంథతమిశ్రమను నరకమును బొందును. కార్తిక పూర్ణిమ రోజున వృషోత్సర్గమును జేయక గయాశ్రాద్ధ మాచరించినను, ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను, పుణ్యతీర్ధములు సేవించినను, మహాలయము పెట్టినను పితరులకు తృప్తిలేదు. వాటన్నిటికంటే కోడెదూడను అచ్చుపోయుట మిక్కిలి గొప్పది. గయాశ్రాద్ధము వృషోత్స ర్గము సమానమని విద్వాంసులు వచించిరి కాబట్టి కార్తికపూర్ణిమనాడు వృషోత్సర్గము సుఖమునిచ్చును. అనేక మాటలతో పనియేమున్నది? కార్తికమాసమందు అన్నిపుణ్య ముల కంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవృణ మనుష్యఋణ పితృఋణముల నుండి

Isannapalli Temple: శ్రీ కాలభైరవస్వామివారి జన్మదిన ఉత్సవాలు 2024 తేదీలు - ఇసన్నపల్లి

ప్రతి కార్తికమాసంలో స్వామి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.  2024 ఉత్సవ వివరాలు నవంబర్ 20 - గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంతతధారాభిషేకం, అగ్నిప్రతిష్ట, గణపతిహోమం, రుద్రహవనం, బలిహారణం. నవంబర్ 21 -  బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు  నవంబర్ 22 - లక్షదీపార్చన నవంబర్ 23 - ధ్వజారోహణ, మహాపూజ, సింధూరపూజ(మధ్యాహ్నం ఒంటి గంటకు), డోలారోహణం(మధ్యాహ్నం మూడు గంటలకు), సాయంత్రం ఎడ్ల బళ్ల ఊరేగింపు. నవంబర్ 24 - రథోత్సవం (తెల్లవారుజామున మూడు గంటలకు), అగ్నిగుండాలు (ఉదయం 6 నుంచి).

Kapilatheertham Temple: శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం - కపిలతీర్థం

కపిల తీర్థం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ప్రసిద్ధ శైవక్షేత్రం, పుణ్యతీర్థం. ఈ ఆలయంలోని శివలింగం కపిల ముని ప్రతిష్టించారని స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే ఇక్కడ స్వామివారిని శ్రీ కపిలేశ్వర స్వామిగా పిలుస్తారు. ఆలయ స్థల పురాణం ప్రకారం కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళం నుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడని స్థలపురాణం.ఇక్కడి లింగాన్ని కూడా కపిల లింగం అంటారు. ఆ తరవాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించాడట. అందువల్ల, ఈ లింగాన్ని ఆగ్నేయ లింగమని కూడా పిలుస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు. ఈ ఆలయానికి నలువైపులా కనిపించే తిరుమల కొండలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయండంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఆ కొండల మీద నుంచి దాదాపు 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకి ప్రవహించే ఆకాశగంగను కపిల తీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్‌ తీర్థమనీ పిలుస్తారు. కోనేటికి నలువైపులా మెట్లు నిర్మించి ఉండటం వలన ఇక్కడ భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు

Karthika Puranam: కార్తీక పురాణం 15వ అధ్యాయము - కార్తికదీపమాలార్పణ మహిమా, కర్మనిష్ట చరితము

  ఓ జనకమహారాజా ! తిరిగి కార్తిక మాహాత్మ్యమును జెప్పెదను. భక్తితో వినుము. విన్నవారికి పాపములు నశించును. పుణ్యము గలుగును. కార్తికమాసమందు హరిముం దఱ నాట్యము చేయువాడు విగతపాపుడై హరిమందిర నివాసియగును. కార్తికమాసమందు ద్వాదశినాడు హరికి దీవమాలార్పణ చేయువాడు వైకుంఠమునకుబోయి సుఖించును. కార్తిక మాసమున శుక్లపక్షమందు సాయంకాలమందు హరిని పూజించువాడు స్వర్గాధిపతి యగును. కార్తికమాసమందు నెల రోజులు నియతముగా విష్ణ్వాలయమునకు దర్శనార్ధము పోవువాడు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలమును బొందును. సందేహములేదు. కార్తికమాసమందు హరిసన్నిధికిపోయి హరిని దర్శించువాడు విష్ణు సాలోక్యముక్తిని పొందును. కార్తికమాసమందు విష్ణ్వాలయ దర్శనార్ధము వెళ్ళనివాడురౌరవ నరకమును, కాలసూత్రనరకమును పొందును. కార్తికశుద్ధ ద్వాదశి హరిబోధిని గనుక ఆ రోజున పూజచేసిన పుణ్యమునకు అంతములేదు. కార్తిక శుక్లద్వాదశినాడు బ్రాహ్మణులతో గూడి భక్తితో హరిని గంధములతోను, పుష్పములతోను, అక్షతలతోను, ధూపముతోను, దీపములతోను, ఆజ్యభక్ష్య నైవేద్యముల తోను పూజించువాని పుణ్యమునకు మితిలేదు. కార్తికశుద్ధ ద్వాదశినాడు విష్ణ్వాలయ మందుగాని, శివాలయమందుగాని లక్షదీపములను వెలిగించ

Anantapur Kodandarama Viseswara Temple: శ్రీ కోదండ రామ కాశీ విశేశ్వర స్వామి ఆలయం - అనంతపురం

అనంతపురం నగరంలో ఫస్టురోడ్డులో రైల్వేస్టేషన్ ఎదురుగా గల శ్రీ కాశీ విశ్వేశ్వర మరియు కోదండ రామాలయం చూపరులకు కనువిందు చేస్తున్నది. ఇది నగరం నడిబొడ్డులో దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. కాశీవిశ్వేశ్వర శివలింగాన్ని, సీతాలక్ష్మణ మారుతి సమేత శ్రీరామచంద్రుని విగ్రహాలను 1923వ సంవత్సరములో ప్రతిష్టించారు.  శివ పంచాయతనం ఈ ఆలయం ప్రత్యేకత. మధ్య భాగంలో కాశీ విశ్వేశ్వర స్వామి నైఋతి దిశలో గణపతి, వాయువ్యంలో పార్వతీ దేవి, ఈశాన్యంలో శ్రీమహా విష్ణువు, ఆగ్నేయంలో సూర్యుడు కన్నుల పండుగగా దర్శనమిస్తారు. అయ్యప్ప స్వామి మందిరం   శ్రీశారదాదేవి, శ్రీశంకరాచార్యులు, శ్రీత్యాగరాజస్వాముల మందిరం  ఆంజనేయస్వామి మందిరం   శ్రీకృష్ణ మందిరం  వినాయక స్వామి మందిరం ఈ ప్రాంగణంలో ఉపాలయాలు  కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో విశేషపూజలు జరుగుతాయి. ఆశ్వయుజ మాసంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో శ్రీశారదా దేవి ఆరాధనోత్సవాలు ఆరాధన వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం పుష్యశుద్ధ పంచమినాడు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు నిర్వహించబడతాయి.  నాగుల చవితి నాడు అశేష భక్తజన సందోహం, అశ్వత్థ నారాయణస్వామిని దర్శించి సేవిస్తారు.  మహాశివరాత్రి నాడు నాలుగ

Karthika Puranam: కార్తీక పురాణం 13వ అధ్యాయము - కార్తికద్వాదశీమాహాత్మ్యము, సువీరశ్రుతకీర్తి కథ

  వసిష్ఠుడిట్లు చెప్పెను. జనకరాజా ! కార్తికమాసమందు చేయదగిన ధర్మములను జెప్పెదను. నీవు స్వచ్ఛమైన మనస్సుతో వినుము. ఆ ధర్మము లన్నియు ఆవశ్యకములైనవి. రాజా! కార్తికధర్మములు మా తండ్రియైన బ్రహ్మచేత నాకుజెప్పబడినవి. అవియన్నియు చేయదగినవి చేయని యెడల పాపము సంభవించును. ఇది నిజము. సంసార సముద్రము నుండి దాట గోరువారును, నరకభయముగలవారును ఈ ధర్మములను తప్పక చేయ వలెను. కార్తీకమాసమందు కన్యాదానము, ప్రాతస్నానము, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము జేయించుటకు ధనమిచ్చుట విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ఇవి ముఖ్యములు. కార్తికమాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణపుత్రునకు ఉపనయన మును జేయించ దక్షిణనిచ్చిన యెడల అనేక జన్మములలోని పాపములు నశించును. తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆ వటువుచే చేయబడిన గాయత్రీ జపఫలములు వలన పంచమహాపాతకములు భస్మ మగును. గాయత్రీ జపము, హరిపూజ, వేద విద్యాదానము వీటి ఫలమును జెప్పుటకు నాకు శక్యముగాదు. పదివేలు తటాకములను త్రవ్వించు పుణ్యమును, నూరు రావిచెట్లు పాతించిన పుణ్యమును, నూతులు దిగుడు బావులు నూరు బావులు త్రవ్వించిన పుణ్యమును, నూరు తోటలు వేయించిన పుణ్యమును ఒక బ్రాహ్మనున కుపనయనము చేయించిన పుణ

Karthika Puranam: కార్తీక పురాణం 20వ అధ్యాయము - అత్య్ర్యగస్త్య సంవాదము, పురంజయోపాఖ్యానము

  జనకమహారాజు మరల ఇట్లడిగెను. మునీంద్రా! సర్వపాపములను నశింపజేయు నదియు, సౌభాగ్యప్రదమగు కార్తిక మహాత్మ్యమును మరియు వినవలెననుకోరిక కలదు గాన చెప్పుము. వశిష్ఠమునిపల్కెను. రాజా! వినము. కార్తిక మహాత్మ్యమును గురించి అగస్త్యమునికిని, అత్రిమహా మునితో జరిగిన సంవాదము ఉన్నది. అది చాలా ఆశ్చర్యకర మయినది దానిని నీకు చెప్పెదను. అత్రి మహాముని ఇట్లు పల్కెను. అగస్త్యమునీంద్రా! లోకత్రయోప కారము కొరకు కార్తిక మాహాత్మ్యబోధకరమైన హరికథను జెప్పెదను వినుము. అగస్త్యుడడిగెను. విష్ణ్వంశ సంభూతుడవైన యో అత్రిమునీశ్వరా! సద్ధర్మశ్రవణమున కార్తికమాసము కీర్తించబడినది. కార్తీకమాస ధర్మమును వినగోరితిని గాన చెప్పుము. అత్రిముని ఇట్లు చెప్పెను. ఓఅగస్త్యమునీంద్రా ! బాగు బాగు. నీ ప్రశ్న పాపనాశ కరము. నీవు హరికథా సందర్భమును జ్ఞాపకము చేసితివి. చెప్పెదను వినుము. కార్తిక మాసముతో సమానమైన మాసములేదు. వేదముతో సమానమైన శాస్త్రములేదు. ఆరోగ్య ముతో సమానమైన ఉల్లాసములేదు. హరితో సమానమైన దేవుడులేడు. కార్తిక మాసమందు స్నానము, దీపదానము, హరిపూజయు చేయువాడు ఇష్టార్ధమును బొందును. విష్ణుభక్తివలన కలియుగమందు వివేకము, ధనము, యశస్సు, ప్రతిష్ఠ, లక్ష్మి, విజ్ఞానము,

Dasara: దసరా, విజయదశమి

  ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమిగా చెప్పబడుతోంది. దీనికే అపరాజిత దశమి, దసరా అని కూడా పేర్లు. అపరాజిత అంటే పరాజయం లేనిది అని అర్థం.  ఈ రోజున ఏ పనిని ప్రారంభించినా అందులో తప్పక విజయం లభిస్తుంది.అందుకే యిది విజయదశమిగా ప్రసిద్ధి చెందింది.  దేవీనవరాత్రులలో కలశాన్ని స్థాపించి, దీక్షతో వున్నవారు ఈ దశమిరోజున ఉద్వాసన చెప్పాలి. ఇక 'దశాహరాత్రం' అనే సంస్కృత పదాలకి ఏర్పడ్డ “దశహరం" అనే వికృతి రూపంనుండి వచ్చిన పేరే దసరా. ఈ రోజున అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. ఈ రోజు సాయంత్రం జమ్మిచెట్టును దర్శించి పూజించాలి. సాధారణంగా గ్రామాలలో సామూహికంగా ఈ శమీపూజ చేస్తుంటారు. ఈ శమీపూజ చేయడం వల్ల అనుకున్న పనులలో 'విజయం' తప్పక లభిస్తుందంటారు. విజయదశమి రోజున ప్రత్యేకంగా విజయకాలాన్ని కూడా పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రవణానక్షత్రం, దశమి తిధి వున్న విజయదశమి రోజున సంధ్యాకాలం దాటిన తర్వాత వుండే సమయాల్ని పురాణాలు విజయకాలమని పేర్కొంటున్నాయి. ఒకవేళ శ్రవణం నక్షత్రం లేకపోయినా దశమి తిథిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని దాన్ని విజయముహూర్తంగా భావించాలని స్కాందపురాణం చెబుతోంది. ఈ సమయంలో అ

Karthika Puranam: కార్తీక పురాణం 10వ అధ్యాయము - అజామిళ పూర్వజన్మ వృత్తాంతము

  జనకుడు  తిరిగి ఇట్లు అడిగెను. ఓమునీశ్వరా! ఈ అజామిళుడు పూర్వజన్మ మందెవ్వడు? ఏమిపాపమునుజేసెను? విష్ణుదూతలు చెప్పిన మాటలనువిని యమభటులు ఎందుకు యూరకుడిరి? యముని వద్దకు పోయి యమునితో ఏమనిచెప్పిరి ? వసిష్ఠుడు ఇట్లు చెప్పెను. యమదూతలు విష్ణుదూతలమాటలు విని శీఘ్రముగా యమునివద్దకుబోయి సర్వవృత్తాంతమును యమునితో జెప్పిరి. అయ్యా! పాపత్ముడును, దురాచారుడును, నిందితకర్మలను ఆచరించు వాడును నగు అజామిళుడు తోడితెచ్చుటకు పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్ములను ధిక్కరించి అతనిని విడిపించిరి. మేము వారిని ధిక్కరించు టకు అశక్తులమైవచ్చితిమి అని చెప్పిది. ఆ మాటను వినికోపించి యముడు జ్ఞానదృష్టితో చూచి యిట్లనియె. ఈ అజా మిళుడు దుర్మార్గుడైనను అంత్యకాలమందు హరినామస్మరణ చేయుట చేత పాపములు నశించి వైకుంఠప్రియుడాయెను. అందువలననే అతనిని విష్ణుదూతలు స్వీకరించిరి. దుష్టాత్ములై మహిమను తెలిసికొనక హరినామస్మరణ చేసినను పాపములు నశించును. తెలియక తాకినను అగ్నికాల్చునుగదా! భక్తితో నారాయణ స్మరణను జేయువాడు జీవన్ముక్తుడై అంతమందు మోక్షము నొందును. యముడిట్లు విచారించి యూరకుండెను. అజామిళుడు పూర్వజన్మమున సౌరాష్ట్రదేశమందు బ్రాహ్మణుడై శివార్చకుడుగా ఉండ

Karthika Puranam: కార్తీక పురాణం 19వ అధ్యాయము - జ్ఞానసిద్ధకృతహరిస్తవము

  జ్ఞానసిద్ధుడిట్లు స్తుతిజేసెను. వేదవేత్తలు మిమ్ము వేదవేద్యునిగాను, వేదాంతము లందు ప్రతిపాదింపబడిన వానినిగాను, గుహ్యమైనవానిగాను, నిశ్చలునిగాను, అద్వితీయ మునిగాను దెలిసికొనుచున్నారు. చంద్రసూర్య శివ బ్రహ్మాదులచేతను రాజుల చేతను స్తుతించబడు రమ్యములైన మీ పాదపద్మములకు నమస్కరించుచున్నాము. వాక్యములతో జెప్ప శక్యముగానివాడవు. శివునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడవు. సంసార భయమును దీసివేయుసమర్ధుడవు జన్మసంసార సముద్రమందున్న శివాదులచేత నిత్యము కొనియాడబడు వాడవు. చరాచర ప్రాణులచే స్తుతింపబినవాడవు. పంచమహాభూతములు చరాచర రూపములైన అన్న భూతములు నీ విభూతి విస్తారమే. శంకరునిచే సేవింపబడిన పాదాలు కలవాడా! మీరు పరముకంటే పరుడవు. నీవే యీశ్వరుడవు. ఈ చరాచరరూపమైన ప్రపంచమంతయును, దానికి కారణమైన మాయతో కూడా నీయందు తోచు చున్నది. త్రాడునందుపాము భ్రాంతివలె పూలమాల భ్రాంతివలె తోచుచున్నది అనగా లేదనిభావము. ఓకృష్ణా! నీవు ఆది మధ్యాంతములందు ప్రపంచమందంతటను ఉన్నావు. భక్ష్య, భోజ్య, చోష్య, రూపచతుర్విధాన్న రూపుడవు నీవే. యజ్ఞ స్వరూపుడవు నీవే. నీ సంబంధియు, పరమసుఖప్రదమును అయిన సచ్చిదానంద స్వరూపమును జూచిన తరువాత ఈ జగము వెన్నెలయందు సముద్రమువలె