Skip to main content

Karthika Puranam: కార్తీక పురాణం 10వ అధ్యాయము - అజామిళ పూర్వజన్మ వృత్తాంతము

 

జనకుడు  తిరిగి ఇట్లు అడిగెను. ఓమునీశ్వరా! ఈ అజామిళుడు పూర్వజన్మ మందెవ్వడు? ఏమిపాపమునుజేసెను? విష్ణుదూతలు చెప్పిన మాటలనువిని యమభటులు ఎందుకు యూరకుడిరి? యముని వద్దకు పోయి యమునితో ఏమనిచెప్పిరి ?

వసిష్ఠుడు ఇట్లు చెప్పెను. యమదూతలు విష్ణుదూతలమాటలు విని శీఘ్రముగా యమునివద్దకుబోయి సర్వవృత్తాంతమును యమునితో జెప్పిరి. అయ్యా! పాపత్ముడును, దురాచారుడును, నిందితకర్మలను ఆచరించు వాడును నగు అజామిళుడు తోడితెచ్చుటకు పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్ములను ధిక్కరించి అతనిని విడిపించిరి. మేము వారిని ధిక్కరించు టకు అశక్తులమైవచ్చితిమి అని చెప్పిది.

ఆ మాటను వినికోపించి యముడు జ్ఞానదృష్టితో చూచి యిట్లనియె. ఈ అజా మిళుడు దుర్మార్గుడైనను అంత్యకాలమందు హరినామస్మరణ చేయుట చేత పాపములు నశించి వైకుంఠప్రియుడాయెను. అందువలననే అతనిని విష్ణుదూతలు స్వీకరించిరి.

దుష్టాత్ములై మహిమను తెలిసికొనక హరినామస్మరణ చేసినను పాపములు నశించును. తెలియక తాకినను అగ్నికాల్చునుగదా! భక్తితో నారాయణ స్మరణను జేయువాడు జీవన్ముక్తుడై అంతమందు మోక్షము నొందును. యముడిట్లు విచారించి యూరకుండెను.

అజామిళుడు పూర్వజన్మమున సౌరాష్ట్రదేశమందు బ్రాహ్మణుడై శివార్చకుడుగా ఉండి శివద్రవ్యమును హరించుచు స్నానసంధ్యలను విడిచి అన్యమానసుడై శివుని పూజించుచు శివునకభిముఖముగా కాళ్ళుచాపుకుని శయనించుచు ఆయుధపాణియై స్నేహితులతోగూడి నానాలంకారశోభితుడై స్వేచ్ఛావిహారముల తిరుగుచు బహుభాషియై మంచి యౌవనముతో నుండెను.

ఆయూరిలో నొక బ్రాహ్మణుడుండెను. అతనికొక రూపవతియు యౌవనవతియు నగు భార్యగలదు. ఆ బ్రాహ్మణుడు దరిద్రపీడితుడై అన్నము కొఱకై పట్టణములు, గ్రామములు పల్లెలు తిఱుగుచు యాచించుచుండెడివాడు.

ఒకానొకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధాన్యాదికమును శిరస్సున నుంచుకొని ఆకలితో యింటికివచ్చి భార్యతో ఓసీ! నాకు ఆకలి కలుగుచున్నది. త్వరగా వంట జేయుము. ముందు మంచినీళ్ళిమ్ము త్రాగి శాంతించెదను. భర్తయిట్లెన్ని మాఱులడిగినను భార్య అతని మాటను లెక్కచేయకపనులు చేయుచు జారుని మనస్సులో ధ్యానించుచు యూర కుండెను. అంతభర్తకోపించి దండముతో భార్యను గొట్టెను. భార్య భర్తను పిడికిలితో గుద్దెను. తరువాత భర్త ఆ గృహమును విడిచి గ్రామాంతరముబోయి అచ్చట భిక్షమెత్తుకొని జీవించుచు భార్యాసంగతిని గూర్చి చింతించు చుండెను. భార్యయు సుఖముగానుంది. రాత్రి భుజించి మంచి చీరెధరించి తాంబూలము స్వీకరించి యొక చాకలివాని ఇంటికి పోయెను.

సుందరుడయిన చాకలివానిని జూచి రాత్రి నాతో సంభోగించు మనెను. ఆ మాటవిని వాదు నీవు బ్రాహ్మణస్త్రీవి అర్థరాత్రివేళ మాయింటికి రావచ్చునా? మీరు గొప్పకులమునందు బుట్టినవారు మేము నిందితులము కాబట్టి యిట్టి సంపర్కము మీకు తగునా?

ఈ ప్రకారముగా వారిరువురును వివాదపడుచు చాకలివాడు రోకలితో దానిని కొట్టెను, అదియు వానినికొట్టి వానిని విడిచి రాజమార్గమున బోవుచుండగా పైన జెప్పిన శివార్చకుని జూచెను. అంతలో ఆ స్త్రీవానిని పట్టుకుని రతికేళి రమ్మనమని పిలుచుకొని పోయి వానితో భోగించి రాత్రియంతయు వానితో కాలక్షేపముచేసి తెల్లవారగానే పశ్చాత్తాప మును బొంది భర్తవద్దకుబోయి ఆయనను బ్రతిమాలి ఆయనతో గూడా గృహ మందు సౌఖ్యముగా నుండెను,

తరువాత కొంతకాలమునకు శివార్చకుడు మృతినొంది యమలోక మందు క్రమ ముగా రౌరవాది నరక దుఃఖములననుభవించి తిరిగి భూమి యందు సత్వనిష్ఠుని కొడుకు అజామిళుడై జన్మించెను. ఇతనికి కార్తికపూర్ణిమనాడు శివదర్శనములభించినది. అంత్య కాలమందు హరినామ స్మరణ గలిగినది. ఆ హేతువలచేత సప్తజన్మార్జిత పాపములు నశించి మోక్షమును బొందెను.

ఆ బ్రాహ్మణియు కొంతకాలమునకు మృతినొంది నరకములందనేక యాతనల నొంది తిరిగి భూమియందు కన్యాకుబ్జమందు చండాలునకు పుత్రికగా జన్మించెను. చండాలుడు ఇది పుట్టిన సమయము మంచిదా యని యొక బ్రాహ్మణుని యడిగెను. అతడు యిది తండ్రిగండాన పుట్టినదని చెప్పెను. ఆమాట విని చండాలుడు ఆ శిశువును దీసికొనిపోయి అరణ్యమందుంచెను. అంతలో ఒకబ్రాహ్మణుడు జూచి రోదనము చేయు చున్న ఆ శిశువును దీసికొనిపోయి తనయింటిలో దాసీగానున్న యొక స్త్రీకి నప్పగించెను. ఆ దాసీది దీనిని పెంచినది. తరువాత దీనిని అజా మిళుడు దగ్గరకు తీసెను. తరువాత కథపూర్వోక్తమే-

రాజోత్తమా ! ఇది నీవడిగిన ప్రశ్నకు సమాధానము అజామిళుని పూర్వ వృత్తాం తము. పాపములకు ప్రాయశ్చిత్తములు చేయుట కష్టము, హరినామకీర్తనము చేసిన ప్రాయశ్చిత్తములతో పనిలేదు. అదిగాని యెడల ధర్మశాస్త్రోక్త ప్రాయశ్చిత్తములు చేయవలె నని భావము.

ఎవ్వనియొక్క నాలుక హరినామ కీర్తినముచేయదో, మనస్సు హరిపాదపద్మ మునుస్మరించదో, చెవులు హరిచరిత్రములను వినదో వానిపాపములు యెట్లు నశిం చును? ఇతర చింతనుమాని హరినిస్మరించువారు ముక్తినొందెదరు. ఇందుకు సందియము లేదు.

కాబట్టి కార్తకమాసమందాచరించిన ధర్మము సూక్ష్మమైనదైనను గొప్ప దైనను పాపము అంతటిని నశింపజేయును. కార్తికధర్మమునకు పాపములను నశింపజేయు సామర్థ్యమున్నది కాబట్టి కార్తిక మాసమందు ధర్మ మాచరించనివాడు నరకము నొందును. ఇది నిశ్చయము. పాపములను నశింపజేయు ఈ కథను విన్నవారు సమస్త పాపములను నశింపజేసి మోక్షమొందుదురు.

ఈకథను వినిపించువాడు పాపవిముక్తుడై వైకుంఠమందు విష్ణువుతో గూడి సుఖించును.

Comments

Popular posts from this blog

Akshaya Navami: అక్షయ నవమి

  కార్తీక మాస శుక్లపక్ష నవమిని ఆక్షయ నవమి అంటారు. ఈ తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సత్య యుగం ప్రారంభమైంది ఈ రోజునేనని చెబుతారు. ఈ రోజున ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం శ్రేష్టం. ఈ రోజున వేకువజామునే లేచి, నదీస్నానం ఆచరించడం, పితృదేవతలకు అర్ఘ్యమివ్వడం, దానం ఇవ్వడం శుభ ఫలితాలనిస్తుంది.  ఈ రోజున చేసే దానాలు, పూజలు రెట్టింపు ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనం. ఈ రోజున ప్రత్యేకించి పండ్ల దానం, ముఖ్యంగా ఉసిరి కాయలను దానం చేయాలి.  అక్షయ నవమి రోజున ఏ కార్యం చేపట్టిన విజయవంతం అవుతుందని విశ్వసిస్తారు. అక్షయ నవమి రోజున త్రికరణశుద్ధిగా పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణ వచనం. ఈ రోజున విష్ణు విజయ స్తోత్రం, కనకధారా స్థవం, దుర్గా స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం వంటి స్తోత్రాలు పఠించాలి.  దైవానికి చక్కెర పొంగళి, దద్ధోజనం నైవేద్యంగా సమర్పించాలి.  ఉసిరి చెట్టులో శివకేశవులు కొలువై ఉంటారు కనుక ఈ రోజున ఉసిరి చెట్టుకు పూజచేయడం, దీపం వెలిగించడం ఉసిరి చెట్టుకింద భోజనాలు చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ముందుగా ఉసిరి చెట్టు కింద శుభ్రపరిచి తూర్పు దిశగా నిలబడి పూజ చేయాలి. ఆ చెట్టుకు నీరు, పాలను అందించాలి.  పూ

Utthana Ekadasi: ప్రబోధిని ఏకాదశి, ఉత్తాన్న ఏకాదశి

  కార్తీక మాస శుద్ధ ఏకాదశినే ప్రబోధ ఏకాదశి, బృందావన ఏకాదశి, భోధన ఏకాదశి. దేవ-ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అనికూడా అంటారు. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్రనుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశి అయ్యింది. దీనినే హరి-భోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశినాడు ప్రారంభమైన చాతుర్మాస్యవ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహాభారత యుద్ధంలో బీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి, అంపశయ్య మీద శయనించాడు. ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణువును పూజించి, రాత్రి జాగరన చేయాలి. మర్నాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి, పారణ చేసి, ఉపవాస దీక్ష విరమించి వ్రతం ముగించాలి. కార్తీక మాసంలో ప్రతి రోజూ పవిత్రమైనదే. ఈ మాసంలో వచ్చే ఏకాదశి మరింత ప్రత్యేకత సంతరించుకుంది. కార్తీక ఏకాదశి మహత్మ్యం గురించి స్కందపురాణంలో వివరించారు. పాపాలను హరించే ఈ ఏకాదశి వ్రతం పాటిస్తే 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుందని పురాణ వచనం. ఈ రోజు ఏ చిన్న పుణ్యకార్యం చేసినా, అనంతమైన పుణ్య ఫలం లభిస్తుంది. ఈ ఏకాదశి వ్రతం చేసినవారికి సాధించలేనివి ఏమి ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవ

Gopashtami: గోపాష్టమి

కార్తీక మాస శుక్ల పక్ష అష్టమిని గోపాష్టమి అంటారు. ఈ రోజు కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఇది కృష్ణుడు గోవును పూజించిన శుభదినం. ఈ పవిత్ర దినం దీపావళి అమావాస్య ఎనిమిదో రోజున వస్తుంది. శ్రీకృష్ణుడు ఈ రోజున గోవుకు పూజ చేయడం మంచిదని తెలిపినట్టు పురాణాలు చెబుతున్నాయి. చెప్పడమే కాదు శ్రీకృష్ణుడు కూడా ఈ రోజున గోపూజలు చేసేవాడట. గోవు పరదేవతా స్వరూపము. గోవులకు అధిష్ఠాన దేవత సురభీదేవి. కామధేనువు పరాశక్తియైన లక్ష్మీస్వరూపం. ఆవులో 33 కోట్ల దేవతలు కొలువైవుంటారు. గోవుకే 'మాత' అనే హోదాను ఇచ్చారు. అలాంటి అమ్మలాంటి గోమాతను పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పెద్దలు చెబుతారు.  గోపాష్టమి రోజున గోవులను శుభ్రమైన నీటితో కడిగి, పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. గోమాతకు అరటిపండ్లు నైవేద్యంగా పెట్టాలి. హారతులిచ్చి గోవు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి. గోవు తోక భాగాన్ని స్పృశించి నమస్కరించాలి. ఈ రోజున కృష్ణుడి వెంట ఆవులను అడవికి పంపినట్లు అనేక పురాణగాధలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున ఆవులను ప్రత్యేకంగా పూజించుకుంటారు. గోవు సకల దేవతా స్వరూపం కనుక గోవును పూజిస్తే సకల దేవతలు తృప్తి చెందుతా

Vaikunta Chaturdashi: వైకుంఠ చతుర్దశి

కార్తీక శుద్ధ చతుర్దశినే వైకుంఠ చతుర్దశి అంటారు. ఈ రోజున భక్తి ప్రపత్తులతో శ్రీహరిని ధ్యానించి నివేదనలు సమర్పిస్తే అపరిమితమైన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శివ, విష్ణు ఆలయాల్లో దీపాలు పెడితే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. కార్తీక మాసమంతా దీపాలు పెట్టలేనివారు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ మూడు రోజులైన దీపాలు వెలిగిస్తే పాపాలు హరించుకుపోతాయి. ఇతరులు పెట్టిన దీపాన్ని కొండెక్కకుండా చూసినవారి పాపాలుకూడా ఆ దీపాగ్నిలో కాలిపోతాయని పురాణ వచనం. కొండెక్కిన ఇతరుల దీపాలను వెలిగించినవారికీ ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ రోజున శ్రీహరి స్వయంగా శివుడిని పూజిస్తాడని పురాణ కథనం. అందుకే ఈ రోజును అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. శివ కేశవులు వేరుగా కనిపిస్తున్నప్పటికి వారిద్దరూ ఒకటేనని వేదాలు చెబుతున్నాయి. కార్తీక శుద్ధ చతుర్దశినాడు శ్రీమహావిష్ణువుకు దీపాలను అర్పించినవారికి వైకుంఠంలో స్థానం లభిస్తుందని శాస్త్ర వచనం. ఈ రోజున శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకున్నా మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున చేసే ప్రతి పని అక్షయమవుతుందట. అందుకని పాపాలు చేయకుండా పుణ్యాలు మాత్రమే చేయడం వలన

Koti Somavaram 2024: కోటి సోమవారం

  కార్తీక మాసంలో పౌర్ణమి కన్న ముందు శ్రావణ నక్షత్రం వచ్చిన రోజు కోటి సోమవారంగా పిలుస్తారు. కోటి సోమవారం అంటే ఒక కోటి సోమవారాలతో సమానం. ఈ రోజు శివుడికి అభిషేకం చేసి దీపం వెలిగిస్తే మంచిది అని నమ్ముతారు. కార్తీక మాసంలో అన్ని సోమవారాలు వ్రతం చేయలేని వారు ఈ ఒక రోజు ఉపవాసం ఉంటే మంచిది. ఈ రోజు విధివిధానంగా శివుడిని పూజించడం వల్ల మోక్షం లాభిస్తుంది అన్ని నమ్ముతారు. కార్తిక మాసంలోనే ప్రత్యేకంగా వచ్చే కోటి సోమవారం రోజు చేసే స్నానం, దానం, ఉపవాసాలకు కోటి రెట్ల అధిక ఫలం ఉంటుందని శాస్త్రవచనం. ఈ రోజు సూర్యోదయాన్నే నిద్రలేచి శుచియై నదీస్నానం చేయడం అత్యుత్తమం. ఎందుకంటే కార్తిక మాసంలో శ్రీమహా విష్ణువు నదులు, చెరువుల్లో నివసిస్తాడని అంటారు. అందుకే ఈ మాసంలో నది స్నానానికి అంతటి ప్రాముఖ్యం ఉంది. ఉపవాసం సాధారణంగా కార్తిక మాసంలో సోమవారాలు, ఏకాదశి, కార్తిక పౌర్ణమి వంటి విశిష్ట తిథుల్లో భక్తులు ఉపవాసాలు ఉంటారు. అలాగే ఒక్క కోటి సోమవారం రోజు చేసే ఉపవాసం కోటి కార్తిక సోమవారాలు ఉపవాసాలతో సమానమని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహరం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం అనంతరం

Keelapatla Konetiraya Temple: శ్రీ కోనేటిరాయ స్వామి ఆలయం - కీలపట్ల

  శ్రీమహావిష్ణువు లోకకల్యాణానికై శ్రీవైకుంఠాన్ని వదలి కోనేటిరాయస్వామిగా భువిపై వెలసిన మహిమాన్విత దివ్యక్షేత్రం కీలపట్ల, చిత్తూరుజిల్లాలోని పలమనేరు సమీపంలో గంగవరం మండలంలో ఉంది. చోళ రాజులకాలంలో యుద్దసిపాయిల ముఖ్యమైన పటాలం' అటవీ ప్రాంతమైన కోటిపల్లి సమీపాన ఉండేదట. చిన్నదండు (పటాళం) ఉండే ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతాన్ని 'కీళ్పటాలం' అని పిలిచే వారు. జనవాడుకలో కీళ్పటాలం, కీళ్పట్టు, కీళ్పట్టణం-కీల పట్లగా స్థిరపడింది. కీలపట్లలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని బ్రహ్మమానస పుత్రుడు భృగుమహర్షి ప్రతిష్టించినాడని ప్రతీతి. జనమేజయమహారాజుకాలంలో ఈ గుడి నిర్మించబడిందని, పల్లవరాజులు, చోళరాజులు ఈ గుడిని పునర్నిర్మించినట్లు శాసనాధారాల ద్వారా తెలుస్తుంది. లక్ష్మీదేవి తన నివాసస్థానమైన వక్షఃస్థలంపై భృగుమహర్షి తన్నినందున వైకుంఠవాసునిపై ప్రణయ కలహాన్ని పూని భూలోకానికి వెళ్లింది. విష్ణువు లక్ష్మీదేవిని అన్వే షిస్తూ వైకుంఠాన్ని వదలి శ్రీవేంకటాచలానికి వేంచేశాడు. పరతత్త్వమైన శ్రియఃపతి ఆకాశరాజుకుమార్తె పద్మావతిని వివాహ మాడాడు. భక్తసంరక్షణకై లక్ష్మీపద్మావతులతో కలియుగంలో పలుచోట్ల దుష్టశిక్షణ, శిష్టరక్షణకై అర్చావతా

Dhanurmasam: ధనుర్మాసంలో శివుడికి పాశురాలు

సూర్యుడు ఏడాదిలో ప్రతినెలా ఒక్కో రాశిలో సంచరిస్తుంటాడు. సౌరమానం ప్రకారం సూర్యుడు ఏ రాశిలో ఉంటే.. ఆ నెలను ఆ రాశి పేరుతో పిలుస్తారు. ఆదిత్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించి.. మళ్లీ మకర రాశిలోకి వెళ్లే వరకూ ఉన్న సమయమే ధనుర్మాసం. దక్షిణాయనం దేవతలకు రాత్రి. ఉత్తరాయణం పగలు. ఉత్తరాయణం ముందు వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ సమయం. ధనుర్మాసంలో వైష్ణవాలయాల్లో గోదాదేవి విరచిత తమిళ పాశురాలు వినిపిస్తుంటాయి. శ్రీరంగనాథుడి భక్తురాలైన గోదాదేవి నెల రోజుల పాటు రోజుకో పాశురం చొప్పున కృష్ణలీలల్ని కీర్తిస్తూ శ్రీవ్రతం ఆచరించింది. ఈ 30 పాశురాలు ‘తిరుప్పావై’ పేరుతో ప్రఖ్యాతి గాంచాయి.ధనుర్మాసంలో విష్ణుభక్తులే కాదు, శివభక్తులు కూడా పాశురాలు పాడుకుంటారు. తమిళనాడులోని శివాలయాల్లో తిరువెంబావై పాశురాలు వినిపిస్తాయి. శైవ సిద్ధాంత కర్త మాణిక్య వాచకర్‌ ఈ పాశురాలను రాశారు. శివ తత్వాన్ని తెలిపే ఈ పాశురాల సంఖ్య కూడా 30. మదురై నగరానికి సమీపంలోని ఓ గ్రామంలో ఉండేవాడు మాణిక్య వాచకర్‌. చిన్ననాటి నుంచి శివ భక్తుడు. ధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారు జామునే మదురైలోని సుందరేశ్వరుడి దర్శనానికి వచ్చేవాడు మాణిక్య వాచకర్‌. నగర వీధుల్లో నడ

Lord Shiva: శివ భగవానుని విశేషాలు

శివుడిని చూడగానే మనకి కొన్ని గుర్తుకు వస్తాయి. అవి ఏంటి అంటే చేతిలో త్రిశూలం, మెడలో పాము, డమరుకం, అర్ధచంద్రాకార నెలవంక, నంది. త్రిశూలం: శివుడు ఎంచుకున్న ఆయుధమే త్రిశూలం. దీని మూడు కొనలు కోరిక, చర్య, జ్ఞానం అనే మూడు శక్తులను సూచిస్తాయి. నెలవంక: నెలవంక చంద్రుడు శివుడిని తరచుగా తన ‘జటా’ ఒక అర్ధ చంద్రాకార చంద్రుని కళా రూపాలతో చిత్రీకరించారు. చంద్రుడు వృద్ధి చెందటం, తగ్గిపోవటం అనేది ప్రకృతి అత్యంత శాశ్వతమైన చక్రాన్ని సూచిస్తుంది. హిందూ మతం క్యాలెండర్‌ ఈ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. పాము: శివుడు ఆయన మెడ చుట్టూ 3 సార్లు చుట్టబడిన ఒక పామును ధరిస్తారు. పాము యొక్క 3 చుట్టలు భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలను సూచిస్తాయి. పాము హిందువులు పూజించే పవిత్రమైన ప్రాణిగా చెప్ప వచ్చు. డమరుకం: శివునితో సంబంధం కలిగిన ఒక చిన్న డ్రమ్‌ వంటి వాయిద్యం. శివ కళాత్మక అభివృద్ధి స్వాధీన సమయంలో డమరుకం లయతో నాట్యం చేస్తారు. నంది: శివునికి అతి దగ్గరలో ఉన్న ఆప్తమిత్రులలో ఒకటి. ఎందుకంటే నంది అన్ని శివాలయాల వెలుపల వుంటుంది. శివ భక్తులు తమ కోరిక లను శివునికి విన్నవించమని నంది చెవు ల వద్ద గుసగుసగా చెప్పుకుంటారు. మూడో కన్ను: శివు

Karthika Puranam: కార్తీక పురాణం 8వ అధ్యాయము - సూక్ష్మధర్మనిరూపణము, అజామిళోపాఖ్యానము

  సూక్ష్మధర్మనిరూపణము, అజామిళోపాఖ్యానము వసిష్ఠమునీంద్రా ! నా మనస్సులో గొప్ప సందేహము గలిగినది. ఆ సందేహమును దెలిపెదను, దానిని నశింపజేయుము. మీరు నాకు ధర్మసూక్ష్మమును జెప్పితిరి, పాతకము లలో గొప్పవానిని జెప్పినారు. వర్ణసంకర కారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేదత్రయోక్తములయిన ప్రాయశ్చిత్తములను జేసికొని పరిశుద్ధులగుదురని ధర్మశాస్త్రము అందు చెప్పబడియుండగా మీరు ధర్మలేశముచేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందు దురని చెప్పినారే, అదియెట్లు సంభవమగును? ఓ మునీశ్వరా ! అనంత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేయించుకొనవలెననియు తెలిసియు అట్లు చేయక దైవవశము చేత సంభవించి కార్తికదీపదానాది పుణ్యముల వలన వైకుంఠమునకు బోవుట ఎట్లు సంభవించును. వజ్రపర్వతమును గోటికొన చివరిభాగముచేత చూర్ణముచేయుటకు శక్యమగునా? తాను లోపలనుండి గృహమునకు అగ్నినిముట్టించి మందు చుండగా తెలియనివానివలె ఉండి పుడిసెదు నీల్బు అనగా చేతికివచ్చినన్ని జలము అగ్నిమీద చల్లినయెడల ఆ అగ్నిచల్లాజునా? మహానదీ ప్రవాహములో స్వయముగా పడికొట్టుకొనిపోవుచు గడ్డిపరకను ఆధారముగాచేసి కొనిన దరికిజేరునా? స్వయముగా గొప్ప పర్వతమునెక్కి అక్కడనుండి క్రింద