- కార్తీక మాస శుక్లపక్ష నవమిని ఆక్షయ నవమి అంటారు. ఈ తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సత్య యుగం ప్రారంభమైంది ఈ రోజునేనని చెబుతారు.
- ఈ రోజున ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం శ్రేష్టం.
- ఈ రోజున వేకువజామునే లేచి, నదీస్నానం ఆచరించడం, పితృదేవతలకు అర్ఘ్యమివ్వడం, దానం ఇవ్వడం శుభ ఫలితాలనిస్తుంది.
- ఈ రోజున చేసే దానాలు, పూజలు రెట్టింపు ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనం.
- ఈ రోజున ప్రత్యేకించి పండ్ల దానం, ముఖ్యంగా ఉసిరి కాయలను దానం చేయాలి.
- అక్షయ నవమి రోజున ఏ కార్యం చేపట్టిన విజయవంతం అవుతుందని విశ్వసిస్తారు.
- అక్షయ నవమి రోజున త్రికరణశుద్ధిగా పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణ వచనం.
- ఈ రోజున విష్ణు విజయ స్తోత్రం, కనకధారా స్థవం, దుర్గా స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం వంటి స్తోత్రాలు పఠించాలి.
- దైవానికి చక్కెర పొంగళి, దద్ధోజనం నైవేద్యంగా సమర్పించాలి.
- ఉసిరి చెట్టులో శివకేశవులు కొలువై ఉంటారు కనుక ఈ రోజున ఉసిరి చెట్టుకు పూజచేయడం, దీపం వెలిగించడం ఉసిరి చెట్టుకింద భోజనాలు చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
- ముందుగా ఉసిరి చెట్టు కింద శుభ్రపరిచి తూర్పు దిశగా నిలబడి పూజ చేయాలి. ఆ చెట్టుకు నీరు, పాలను అందించాలి.
- పూజ అనంతరం చెట్టు చుట్టూ పత్తిని చుట్టి, ప్రదక్షిణలు చేయాలి.
- ఉసిరి కాయ దీపం వెలిగించి దీపారాధన చేయాలి. ఇలా చేయడం వలన శివకేశవుల అనుగ్రహం లభించి సర్వశుభాలు కలుగుతాయి.
- లోక కళ్యాణం కోసం 'కూష్మాండుడు' అనే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించిన రోజే ఈ అక్షయ నవమి అని కొన్ని పురాణాలు చెబుతున్నాయి.
- లక్ష్మీ నారాయణుల సన్నిధిలో విజయలక్ష్మిని లేక వీరలక్ష్మినిగాని నిలిపి రావి, ఉసిరి, తులసి మొక్కలను ఉంచి పూజ చేయాలి. ఈ విధంగా చేసే పూజను 'జగద్ధాత్రి పూజ' అని వ్యవహరిస్తారు.
2024 తేదీ: నవంబర్ 10
Comments
Post a Comment