మననం చేసే కొలదీ రక్షించేది మంత్రం, మనస్సును రక్షిస్తుంది. కనుకనే మంత్రం అని అన్నారు. స్పష్టాక్షరమైన పలుకే మంత్రం. దేవతలు మంత్రాలకు అధీనులు. మంత్రాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు స్వరపేటిక, దానికి సంబంధించి నరాలు ఒక నిర్ణీతరీతిలో పనిచేస్తాయి. ఇందువల్ల ఉచ్చారణ సరిగ్గా ఉంటుంది. నాలుక స్పష్టంగా చలిస్తుంది.
ఒక శబ్దాన్ని ఉచ్చరించాలంటే 72 స్నాయువులు పని చేస్తాయి. ఏయే రీతిలో స్నాయువులు పనిచేస్తే ఆయా శబ్దాలవల్ల ఆయానరాలు ఉత్తేజితాలవుతాయి. ఇవి సంస్కృతభాష వల్లనే సాధ్యం.
మంత్రోచ్చారణతో జనించే శబ్దతరంగాలు చెవిపైనా, దాని ద్వారా ఇతర నరాల పైనా మంచి ప్రభావం చూపుతాయి. మంత్రనాదం వింటుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇందువల్ల వాక్శక్తి పెరుగుతుంది. అనువాదాలు మంత్రాలు లేవు. మంత్రాల్లోని ఒక్కొక్క అక్షరమూ ఒక దేవతాశక్తికి బీజమే! మంత్రాల అర్థం ఏదైనా కావచ్చు. కానీ వాటిల్ని ఆపద్ధతి ప్రకారం ఉచ్చరిస్తూంటే దేహంలో విద్యుత్తు ఉత్పాదనం జరుగుతుంది. ఇందువల్ల శరీరం మిక్కిలి చైతన్యవంతమై- పవిత్రవంతమవుతుంది. కనుక మంత్రతస్మరణవల్ల మనస్సు, బుద్ధి, చిత్తం, హృదయం, ముఖం, శరీరం పరిశుద్ధమవుతాయి. వాళ్ళు శక్తిమంతమవుతుంది.
Comments
Post a Comment