Skip to main content

Saphala Ekadasi: సఫల ఏకాదశి

 

  • మార్గశిర మాసంలో వచ్చే కృష్ణ పక్ష ఏకాదశిని సఫల ఏకాదశిగా జరుపుకుంటారు.
  • ఈ ఏకాదశి గురించి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది.
  • ఈ ఏకాదశి గురించి శ్రీ కృష్ణభగవానుడు, ధర్మరాజుకు వివరించాడు.
  • మాహిస్మతుడనే రాజు ఈ ఏకాదశిని ఆచరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది.
  • ఈ ఏకాదశిని ఆచరించేవారు ధన్యులు.

ఈ రోజున ఉపవాసం, జాగారం చేసి శ్రీమన్నారాయణుని అనుగ్రహం కోసం పూజిస్తారు. చేపట్టిన పనులు సఫలం కావాలంటే సఫల ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులను పూజించడం సహా దానాలు చేయడం మంచిది. సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి ఆలయాల్లో దీపాలను వెలిగిస్తే ఐదువేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుందని అంటారు.

ఈ రోజున శ్రీ మహా విష్ణువును లక్ష్మీ సమేతంగా పూజిస్తారు. ఈ ఏకాదశి రోజున చేసే ఉపవాసం, లక్ష్మీనారాయణుల పూజ, జాగారం వలన చేపట్టిన పనులు సఫలం అవుతాయని విశ్వాసం.

సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్లు ఉదయాన్నే తలస్నానం చేసి, ఇంటినీ, పూజా మందిరాన్ని శుభ్రపరిచి లక్ష్మీనారాయణుల చిత్ర పటాలు గంధం, కుంకుమ, పసుపు రంగు పుష్పాలతో అలంకరించాలి. ఏకాదశి పూజలో తులసి తప్పనిసరి. ఆవునేతితో దీపారాధన చేయాలి.

లక్ష్మీనారాయణులకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు చేయాలి. అరటిపండ్లు, కొబ్బరికాయ, చక్ర పొంగలి నైవేద్యంగా స్వామికి సమర్పించాలి. అనంతరం శ్రీహరి ఏకాదశి కథ విని, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. చివరగా హారతి ఇవ్వాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి విష్ణు నామ సంకీర్తనతో జాగరణ చేయాలి. మరునాడు ఉదయాన్నే పునః పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. మరుసటి రోజైన ద్వాదశి రోజు సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతో సత్కరించి నమస్కరించుకోవాలి. అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమిస్తే ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్లు అవుతుంది.

సఫల ఏకాదశి వ్రతం ఆచరించే వారు ఉపవాసం తప్పనిసరిగా చేయాలి. ఒకవేళ ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవాలి. ఈ రోజంతా భగవన్నామ సంకీర్తనలతో, పురాణం పఠనాలతో కాలక్షేపం చేస్తూ జాగారం చేయాలి. ఉల్లి, వెల్లుల్లి, మద్య మాంసాలు నిషిద్ధం. బ్రహ్మచర్యం తప్పనిసరి. ఈ నియమాలు పాటిస్తూ సఫల ఏకాదశి వ్రతం ఆచరిస్తే చేపట్టిన ప్రతి పనిలోనూ సఫలీకృతం పొంది విజయాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. భక్తి శ్రద్ధలతో చేసే పూజను భగవంతుడు కూడా స్వీకరిస్తాడు. 

2024: డిసెంబర్ 26. 

Comments

Popular posts from this blog

Srivilliputhur Andal Temple: శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆలయం - శ్రీవిల్లిపుత్తూర్

ధనుర్మాసంలో జరిగే తిరుప్పావై సందర్భంగా మహిమాన్వితమైన శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ ఆలయ క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం. చూపరులను అబ్బురపరిచే శిల్పకళా సౌందర్యం, ఎత్తైన రాజ గోపురాలు, భక్తులను ఆధ్యాత్మిక అనుభూతిలో ముంచే ఆండాళ్, రంగనాయక స్వామి విగ్రహం ఇవన్నీ ఈ ఆలయ ప్రత్యేకతలు. ఈ ఆలయంలో మరో విశేషమేమిటంటే ఇక్కడ వటపత్రశాయి శ్రీదేవి భూదేవితో కలిసి కొలువు తీరి ఉండడం. ఈ ఆలయాన్ని దర్శిస్తే అవివాహితులకు శీఘ్రంగా వివాహం జరుగుతుందని విశ్వాసం. ఆలయ స్థల పురాణం నారాయణుని రాక్షస సంహారం పూర్వం మార్కండేయ మహర్షి, భృగు మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసారంట! అప్పుడు ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో ఉండేది. ఆ అరణ్యంలో ఉండే 'కాలనేమి' అనే రాక్షసుడు తరచూ మహర్షుల తపస్సుకు ఆటంకం కలిగిస్తుంటే ఆ మునులు శ్రీ మహా విష్ణువును ప్రార్ధించారు. అప్పుడు నారాయణుడు ఆ రాక్షసులను అంతమొందించి శ్రీదేవి, భూదేవి సమేతంగా అక్కడే మర్రిచెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నాడంట! అందుకే అక్కడ స్వామికి వటపత్రశాయి అని పేరు వచ్చింది. శ్రీవిల్లిపుత్తూర్ పేరు ఇలా వచ్చింది రాక్షస సంహారం తర్వాత ఈ ప్రాంతాన్ని 'మల్లి' అనే రాణి పరిపాలించేది. ఆమెకు వి...

Karthika Masam Danam: కార్తీక మాసంలో ఏ ఏ రోజు ఏమి దానం చేస్తే బాగుంటుంది?

  కార్తీకంలో ప్రతి రోజు అమూల్యమైనదే కార్తీక మాసంలో పూజలు, వ్రతాలు ఆచరిస్తే సత్ఫలితాలు పొందుతారు. ఏ రోజు ఏమి దానం చేస్తే మంచిది. ♦ మొదటి రోజు : నెయ్యి, బంగారం. ♦ రెండవ రోజు : కలువపూలు, నూనె, ఉప్పు. ♦ మూడో రోజు : తదియ రోజున పార్వతీదేవిని పూజించాలి. ఉప్పు దానం చేయడం శుభప్రదం. ఫలితంగా శక్తి, సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. ♦ నాలుగో రోజు : కార్తీకశుద్ధ చవితి. నాగులచవితిని పురస్కరించుకుని వినాయకుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేయాలి. నూనె, పెసరపప్పు, దానం ఇవ్వాలి. సద్భుద్ది, కార్యసిద్ధి సాధ్యమవుతుంది. ♦ ఐదో రోజు : ఈ రోజును జ్ఞానపంచమి అంటారు. ఆదిశేషుని పూజించాలి. ఫలితంగా కీర్తి లభిస్తుంది. ♦ ఆరో రోజు : షష్టి రోజున బ్రహ్మచారికి ఎర్ర గళ్ళకండువా దానం చేస్తే సంతానప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారు. ♦ ఏడో రోజు : సప్తమి రోజున దుర్గాదేవిని పూజించాలి. ఎర్రని వస్త్రంలో గోధుమలు దానం చేయాలి. దీంతో ఆయుష్సు వృద్ధి చెందుతుంది. ♦ ఎనిమిదో రోజు : అష్టమినాడు గోపూజ చేస్తే విశేష ఫలితాలు ఇస్తుంది. ముఖవర్చస్సు పెరుగుతుంది. ♦ తొమ్మిదో రోజు : నవమినాటి నుంచి మూడు రోజుల పాటు విష్ణుత...

Srisailam Brahmotsavam 2025: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2025 - శ్రీశైలం

 శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానున్నాయి. వాహన సేవల వివరాలు : ఫిబ్రవరి 19  - ధ్వజారోహణ ఫిబ్రవరి  20 - బృంగివాహన సేవ ఫిబ్రవరి 21 - హంసవాహన సేవ ఫిబ్రవరి 22 - మయూరవాహన సేవ ఫిబ్రవరి 23 - రావణవాహన సేవ ఫిబ్రవరి 24  - ఫుష్ప పల్లకి సేవ ఫిబ్రవరి 25 - గజ వాహన సేవ ఫిబ్రవరి 26  - మహాశివరాత్రి, ప్రభోత్సవం, నందివాహన సేవ, స్వామివారికి లింగోద్భవ మహారుద్రాభిషేకం, పాగాలంకరణ, కల్యాణోత్సవం. ఫిబ్రవరి 27 -  రథోత్సవం,తెప్పోత్సవం ఫిబ్రవరి 28 - పూర్ణాహుతి, వసంతోత్సవం, ధ్వజావరోహణ మార్చి  01 - అశ్వవాహన సేవ,ఫుష్ప ఉత్సవం, శయనోత్సవం.

మన పండుగలు సంస్కృతీ ప్రతిబింబాలు

మానవ జీవితం ముఖ్యంగా ప్రకృతిపై ఆధారపడి వుంటుంది. ఈ ప్రకృతిలోని మార్పులను జ్యోతిషశాస్త్రం ఆధారంగా గుర్తించి, గ్రహ నక్షత్రాదుల ప్రభావాలను పరిశీలిస్తూ, కాలానుగతికమైన పండుగలను ధర్మశాస్త్రం నిర్ణయిస్తుంది. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవడం పండుగల ఏర్పాటులో ముఖ్యమైన ఉద్దేశం. నోములు, వ్రతాలు, ఉత్సవాలు, పర్వాలు, పండుగలు అంటూ వాటికి మనం పేర్లు పెట్టుకుంటున్నాం. ఈ దేశంలో సంవత్సరం మొత్తం ఏదో రూపంలో ఏదో ఒక పర్వం నిర్వహిస్తూనే వుంటారు. పండుగలు జరుపడంలో  మహిళల దే  ప్రముఖ పాత్ర.   మహిళలు   అధికసంఖ్యలో ఐకమత్యంతో పాల్గొని చురుకుగా చేసే పండుగల్లో బోనాలు, బతుకమ్మ, గొబ్బెమ్మ లు అగ్రస్థానంలో నిలుస్తాయ. శ్రావణమంగళ, శుక్రవారాల్లో నోచే నోములకూ ప్రముఖస్థానమే.   మాసాలపరంగా ఆలోచిస్తే మన పండుగల్లో మొట్టమొదటి చైత్రశుద్ధ పాడ్యమినాడు నిర్వహించే 'ఉగాది' పండుగ. తెలుగువారికే ఇది ప్రత్యేకమైన పండుగ. ఈరోజు ఆరు రుచులతో కూడుకున్న వేపపువ్వు పచ్చడిని ఆరగించిన తర్వాతనే మిగిలిన పనులు ప్రారంభిస్తాము. ప్రకృతికి నమస్కరించే తెలుగువారి మొదటి పండుగ ఇది. సంక్రాంతి తెలుగువారు న...

Tirumala Shanivaralu: తిరుమల శనివారాలు 2024

తమిళ మాసం అయిన పెరటాశి  మాసంలో తిరుమల శనివారాలు జరుపుకుంటారు. ఈ మాసం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వస్తుంది.  ఈ మాసంలోని శనివారాలు పవిత్రంగా భావించి విష్ణు ఆలయాలలో భక్తులు ప్రతేక్య పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలోనే తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరగడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.చాల మంది భక్తులు ఈ మాసంలో కేవలం శాకాహారం మాత్రమే స్వీకరిస్తారు. శ్రీమహావిష్ణువు శ్రీవేంకటాచలపతిగా అవతరించిన మాసమే పెరటాసి. ఈ మాసంలో శ్రవణ నక్షత్రంలో తిరుమలేశుడు అవతరించినట్లు శ్రీవేంకటాచల మహత్యం చెబుతోంది.  ప్రత్యేకించి శనివారం ఆయనకు ఎంతో ప్రీతి. పెరటాసిలో శనివారాలు నాలుగు లేక ఐదు వస్తాయి. వీటిలో మూడవ శనివారాన్ని తమిళులు చాలా విశేషంగా భావించడం ఆనవాయితీగా వస్తోంది.    ఈ మాసంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారికి  పిండి దీప సమర్పణ ఎంతో విశేషంగా జరుపుకుంటారు.  ఈ మాసంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాల  వైభవాన్ని  గురించి ఎంత చెప్పినా తక్కువే.  ప్రతి బ్రహ్మోత్సవం  తిరుమలలో విశేషంగా, వైభవంగా జరుగుతుంది. ఈ మాసంలో ముఖ్యంగా  కొంతమంది శ్రీ వైష్ణవుల తిరుమాళిగల్లో (ఇళ్ళల్లో...

Karvetinagaram Sri Krishna Temple: శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం - కార్వేటినగరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంనుంచి 58 కిలో మీటర్ల దూరంలో కార్వేటినగరం ఉంది. నారాయణవనంను పరిపాలించిన సూర్యవంశరాజులు ఒకసారి వేటకు ఈ ప్రాంతానికి రాగా కుక్కలను కుందేళ్ళ తరుముతుండడం వారి కంటపడింది. దీనిని చూసి ఆశ్చర్యానికి లోనైన వారు ఈ ప్రాంతంలో ఉన్న అడవిని నరికి ఒక ఊరు నిర్మింపజేశారు. అడవిని నరికి కట్టిన ఊరు కనుక ఈ ఊరికి 'కాడువెట్టి నగరం' అనే పేరు ఏర్పడింది. అది కాల క్రమంలో కార్వేటినగరంగా మార్పు చెంది. నట్లు స్థలపురాణం వెల్లడిస్తోంది. 1541వ సంవత్సరంనాటి శాసనం ఈ ఊరిని 'కార్వేడు' అని పేర్కొంది. కార్వేటి అనే దేవత ఈ ప్రాంతంలో కొలువుదీరడం వల్ల ఆమె పేరు మీదే కార్వేటినగరం అని ఈ క్షేత్రానికి పేరు వచ్చినట్లు కూడా ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణభగవానుడు ఈ క్షేత్రంలో కొలువుదీరడం వెనుక ఆసక్తికరమైన స్థల పురాణం ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతం నారాయణవనం రాజ్యంలో భాగంగా ఉండేది. ఈ రాజ్యాన్ని సూర్య వంశానికి చెందిన కరికాల చోళుడు పరిపాలించాడు. ఆయన కుమారుడు తొండమాన్చక్రవర్తి. తొండమాన్చక్రవర్తి మునిమనవడు నారాయణరాజు. తన పూర్వీకుల మాదిరే నారాయణరాజు కూడా దైవభక్తి పరాయణుడు. ప్...

Kashi Visalakshi Temple: శ్రీ విశాలాక్షీదేవి- వారణాసి

సప్తమోక్షపురాల్లో ఒకటిగా, శివుడి కన్నుల్లో ఒకటిగా పేరు పొందిన కాశీక్షేత్రం జగన్మాత శ్రీవిశాలాక్షీదేవిగా కొలువుదీరిన మహిమాన్విత క్షేత్రం అష్టాదశశక్తిపీఠాలలో పదిహేడవ క్షేత్రం వారణాసి జ్యోతిర్లింగాలలో శ్రీ విశ్వేశ్వరమహాలింగానికి, అష్టాదశ శక్తిపీఠాల్లో శ్రీ విశాలాక్షీదేవికి నిలయమైన వారణాసికే కాశీ క్షేత్రం అని పేరు. సప్తమోక్షపురాల్లో ఒకటిగా, శివుడి కన్నుల్లో ఒకటిగా పేరు పొందిన కాశీక్షేత్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగానదీ తీరాన ఉంది. సంస్కృతంలో 'కస్' అంటే ప్రకాశించునది లేదా వెలుగును విరజిమ్మునది. 'అ' అంటే మోక్షసాధనకు అవసరమైన వెలుగును (జ్ఞాన మనే వెలుగు) ప్రసాదించునది కనుక ఈ క్షేత్రానికి 'కాశి' అనే పేరు ఏర్పడినట్లు కథనం. ఈ క్షేత్రాన్ని బెనారస్ అని కూడా పిలుస్తారు. ఈ పేర్లతో పాటు ప్రాచీనకాలంలో కాశీని వివిధ పేర్లతో పిలిచేవారు. త్రినేత్రుడైన శివుడికి ఈ క్షేత్రంలో ఉండటం మహాఇష్టం కనుక ఈ క్షేత్రానికి 'ఆనందకాననం' అనీ, ఈ క్షేత్రంలో ఏ విధమైన పాపాలు, దోషాలు దరిచేరవు కనుక 'అవిముక్తక’ అనే పేర్లు ఉన్నట్లుగానూ, వీటికి తోడూతీరస్థలి, ముక్తిభూమి,క్షేత్రపురి, ముక్తిపురి, మహాస...

Karthika Masam: కార్తీక మాసంలో ఏమి తినాలి ? ఏ పనులు చేయాలి ? ఏ వ్రతాలు చేయాలి ?

కార్తిక మాసంతో సమానమైన మాసం, కృతయుగంతో సమమైన యుగం, వేదానికి సరితూగే శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేవని అర్థం. శివ కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ఉపవాస నిష్టలకూ, నోములకూ, వ్రతాలకూ ఈ మాసంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రత్యేకించి శివారాధకులు అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించే మాసం ఇది. ఈ నెల రోజులూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగిస్తారు. కార్తీక మహా పురాణాన్ని పారాయణం చేస్తారు. కార్తిక సోమవారాలు, కార్తిక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో ప్రాతఃకాల స్నానాలకు ఎంతో విశిష్టత ఉంది. స్నానం పూర్తయిన తరువాత దీపారాధన చెయ్యాలనీ, రావిచెట్టు, తులసి, ఉసిరిక చెట్ల దగ్గర దీపాలు పెట్టడం ఉత్తమమనీ పెద్దలు చెబుతారు. మాసాలలో అసమానమైనదిగా పేరు పొందిన కార్తిక మాసంలో ఎన్నో పర్వదినాలున్నాయి.  పఠించదగిన స్తోత్రాలు వామన స్తోత్రం,  మార్కండేయకృత శివస్తోత్రం,  సుబ్రహ్మణ్యాష్టకం,  శ్రీ కృష్ణాష్టకం, సూర్య స్తుతి,  గణేశ స్తుతి, దశావతార స్తుతి,  దామోదర స్తోత్రం, అర్ధ నారీశ్వర స్తోత్రం,  లింగాష్టకం, బిల్వాష్టకం, శివషడక్షరీ స్తోత్రం శ్రీ శివ స్తోత్రం,శివాష్టక...

Shani Trayodashi: శని త్రయోదశి

త్రయోదశి తిధినాడు శనివారం వస్తే ఆ రోజు శని త్రయోదశి అవుతుంది. ఆ రోజు శనిభగవానుడిని  విశేషంగా పూజిస్తారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకల్పము ప్రకారం శని పుష్యమాసంలోని శుక్ల పక్షంలో నవమి తిధినాడు జన్మించాడు. ఆ రోజు శనివారం, భరణి నక్షత్రంలో శని జన్మించాడు. శాంతిపీఠికలోని వివరాలు మరోరకంగా చెబుతున్నాయి. మహాతేజస్సుతో వెలుగొందే శని నిలవర్ణంలో ఉంటాడు. అయన ఛత్రం రంగు కూడా నీలమే. ఇక్కడ నిలవర్ణం అంటే నలుపు అని అర్ధం. అయన సౌరాష్ట్ర దేశంలో జన్మించాడు. అతనిది కాశ్యపస గోత్రం. మాఘ బహుళ చతుర్దశినాడు శని జన్మించాడు. ఉత్తర భారతదేశంలో శనిత్రయోదశినాడు కాకుండా అమావాస్యనాడు నిర్వహించుకుంటారు. పుర్ణిమాంత పంచాంగాలను అనుసరించి జ్యేష్ఠా అమావాస్య నాడు శనిజయంతి. తెలుగు పంచాంగాల ప్రకారం వైశాఖ అమావాస్యనాడు వస్తుంది. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య తిధులు శని ఆరాధనకు తగినవని మనకు   తెలుస్తుంది. శని త్రయోదశి నాడు శనిని పూజిస్తే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఏలినాటి శని, అష్టమ, అర్ధాష్టమ శని జరుగుతున్న రాశులు వారు శనిని ఆరాధించాలి. శని మహర్దశ లేదా అంతర్దశ జరుగుతున్న వారుగాని, జాతకంలో శని చేదు స్థానాలలో ఉండగా జన...