ఏటా వైశాఖ శుక్ల తదియ రోజు సింహాచలం వరాహ లక్ష్మీనారసింహ స్వామి చందనోత్సవం జరుగుతుంది. స్వామిపై చందనం పూత తొలగించి నిజరూప దర్శనభాగ్యాన్ని భక్తులకు అందిస్తారు. చందనోత్సవం వెనుకున్న పురాణ గాథ హిరణ్యాక్షుడనే రాక్షసుడిని వధించేందుకు శ్రీమహావిష్ణువు వరాహావతారాన్ని, హిరణ్యకశిపుణ్ని సంహరించేందుకు నృసింహావతారాన్ని దాల్చాడు. అసురులైన అన్నదమ్ములు ఇద్దర్నీ వధించేందుకు శ్రీహరి వరుసగా ధరించిన అవతారాలివి. హిరణ్యాక్షుడిని వధించి వరాహ అవతారాన్ని విరమించేలోగా హిరణ్యకశిపుడి మాట మేరకు ప్రహ్లాదుడు పిలవడంతో భక్తుడిని రక్షించాలనే తొందర్లో వరాహ రూపం వదలకుండానే నృసింహుడిగా ప్రత్యక్షమయ్యాడు. అయితే హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత నృసింహుడు ప్రళయ భీకరంగా, జ్వాలా మాలికలతో కనిపించేసరికి సమస్త సృష్టి భయపడింది. బ్రహ్మాది దేవతలు, ప్రహ్లాదుడు ప్రార్థించినా ఫలితం లేకపోయింది. ఆ సమయంలో బ్రహ్మకు చందన వృక్షం గుర్తొచ్చింది. ఉగ్రం, ఉష్ణం, తాపం నివారించే శక్తిని చందన వృక్షానికి వరంగా ఇచ్చిన సంగతి గుర్తుకొచ్చి అదే విషయం ప్రహ్లాదుడికి సూచించాడు బ్రహ్మ. అప్పుడు ప్రహ్లాదుడు చేసిన చందన సేవ వల్ల నారసింహుడు శాంతించాడు. ఆ తర