Skip to main content

Posts

Showing posts with the label anjaneya temple ardhagiri

Aragonda Anjaneya Temple: శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం - అర్ధగిరి

చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ఆలయమైన కాణిపాకానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో అరగొండ వీరాంజనేయ స్వామి ఆలయం నెలకొని ఉంది.  ఈ ఆలయంలోని హనుమను పూజిస్తే అనేక రకాల అనారోగ్యాలు నశించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు.  త్రేతా యుగంలో రామ-రావణుల యుద్ధం సమయంలో రావణాసురుని కుమారుడు ఇంద్రజిత్తుని శరాఘాతానికి లక్ష్మణుడు మూర్చిల్లుతాడు. ఆ సమయంలో శ్రీరాముని ఆజ్ఞ మేరకు హనుమంతుడు సంజీవని మూలికలు తేవడానికి వాయువేగంతో హిమాలయాలకు వెళ్తాడు. సంజీవని పర్వతానికి చేరుకున్న హనుమ మూలికలు గుర్తించలేక ఏకంగా సంజీవని పర్వతాన్ని పెకిలించుకుని తీసుకు వస్తుండగా మార్గమధ్యంలో ఓ ప్రదేశంలో సంజీవని పర్వతం నుంచి అర్ధ భాగం విరిగి పడిపోతుంది. ఆ ప్రదేశమే ఇప్పటి అరగొండ. అర కొండ పడింది కాబట్టి అర కొండ అని పేరొంది కాలక్రమేణా అరగొండగా మారిందని ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. సంజీవని పర్వతం విరిగి పడిన ప్రాంతంలో భూమి నుంచి జలధారలు ఉబికి వచ్చి ఆ ప్రాంతంలో ఒక కొలను ఏర్పడింది. అదే సంజీవరాయ తీర్ధంగా ప్రసిద్ధి చెందింది. సంజీవరాయ తీర్ధంలో సంజీవకరణి, విషల్యకరణి అనే మహిమాన్విత వనమూలికలు, ఔషధాలు కలిసి ఉండడం వలన ఆ తీర్ధంలో నీటికి అనేక