పుష్యమాసాన్ని శూన్యమాసం అంటారు. ఈ నెలలో గ్రహసంచారం శుభకార్యాలకు, సుముహూర్తాలకు అనువుగా ఉండదనే కారణంగా అలా అంటారు. ఈ మాసంలో గ్రహానుకూలత కోసం, గ్రహరాజు అయిన సూర్యుని అనుగ్రహం కోసం ఆయనకు ప్రీతిపాత్రమైన ఆదివారం నాడు సూర్యారాధన చేస్తారు. ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యునికి ప్రత్యేక నివేదన చేస్తారు. ఆ ప్రసాదాన్ని సూర్యాస్తమయానికి ముందే భోజనంగా స్వీకరిస్తారు. ఈ సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తుంది.
చంద్రుడు పుష్యమి నక్షత్రం లో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య”అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్యమాసం తెలుగు మాసాల్లో పదోది. హేమంత రుతువులో రెండవది. పుష్యపౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనది గా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్పబడింది. విష్ణువుకు ఇష్టమైన మాసం మార్గశిరం . శివుడికి కార్తీకం. అలాగే పుష్య మాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమినాడు శనికి తైలాభిషేకం జరిపించి నవ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. ఈ నెలలో లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించే సంప్రదాయం ఉంది. అందుకే దీనిని సౌభాగ్య లక్ష్మీ మాసం అని కూడా అంటారు. లక్ష్మీదేవిని ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా పూజిస్తారు. ఈ నెలలోని మంగళవారాలలో లక్ష్మీదేవిని ప్రతిమలోగాని, కలశంలోగాని ఆవాహన చేసి ఆరాధిస్తే అరిష్టాలు తొలగి, కోరిన కోరికలు తీరుతాయని పం...
Comments
Post a Comment