- సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అని పిలుస్తారు.
- చాల అరుదు వస్తుంది ఈ పుణ్య తిధి. ఈ రోజు చేసే చిన్న పుణ్యకార్యం అయిన రెట్టింపు అవుతుంది అని విశ్వాసం.
- ద్వాపర యుగం లో పాండవులు ఈ తిధి కోసం చాల సార్లు ఎదురు చూసారు అని చెపుతుంది భారతం.
- జాతకరీత్యా చంద్రగ్రహ స్థితి సరిగా లేని వారు పరిహారాలు చేసుకోవాలి
- శివునికి అభిషేకాలు, అర్చనలు చేస్తారు, పవిత్ర నదులలో స్నానాలు చేయడం, తులసి కోట వద్ద విష్ణు పూజ చేయడం మంచిది.
- బియ్యం , పాలు, నెయ్యి, పెరుగు వంటి వాటిని దానం చేయాలి.
- రావిచెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి.
- ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి, దానం చేసి నైవేద్యాలు సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు.
- సోమావతి అమావాస్య రోజున నదీ స్నానం ఆచరించి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.
- ఈ రోజున పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించడంవల్ల జీవితంలో ఆనందం కలుగుతుంది.
- శివుని మహామృత్యుంజయ మంత్రంకూడా పఠించాలి. అలాగే శివుని ఆరాధన ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుంది.
అరుదుగా వచ్చే ఈ అమావాస్య రోజు చేసే శివారాధన ఇంట్లో ప్రతికూల శక్తుల కారణంగా కలిగే అశాంతిని, దారిద్య్ర బాధలు పోగొడుతుంది.దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన కుమార్తె సతీదేవి, అల్లుడైన పరమశివుని ఆహ్వానించకుండా వారిని అవమానిస్తాడు. శివుడు వద్దన్నా వినకుండా యజ్ఞానికి ఆహ్వానం లేకుండా వెళ్లిన సతీదేవి అవమానానికి గురై శరీర త్యాగం చేస్తుంది. అది తెలిసి ఆగ్రహించిన శివుడు తన జటాజూటంనుంచి వీరభద్రుని సృష్టిస్తాడు. సమస్త ప్రమథ గణాలతో కలిసి వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి యాగానికి వచ్చిన వారందరికి తగిన గుణపాఠం చెబుతారు. శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు శివగణాల చేతిలో చంద్రుడు కూడా దెబ్బలు తింటాడు.
ఆ సమయంలో ఒంటినిండా గాయాలతో తీవ్రమైన బాధతో చంద్రుడు పరమశివుని శరణు వేడుకుంటాడు. చంద్రుని అవస్థ చూసి మనసు కరిగిన భోళాశంకరుడు త్వరలో రానున్న అమావాస్యతో కూడిన సోమవారంనాడు తనకు అభిషేకం జరిపిస్తే తిరిగి చంద్రుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిస్తాడు. ఆనాటినుంచి సోముడు అంటే చంద్రుని పేరిట సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజును సోమావతి అమావాస్యగా జరుపుకుంటారు.
సోమవతి అమావాస్య రోజున శివునికి గంగా జలంతో, పంచామృతాలతో అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని శాస్త్ర వచనం. ఈ రోజున రాహుకాలంలో రావిచెట్టుకు, శ్రీ మహా విష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే దరిద్రం పోతుంది. రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. వీలు కాని వారు శివ పంచాక్షరీ మంత్రం జపిస్తూ రావి చెట్టుకు 11 సార్లు ప్రదక్షిణలు చేసినా సరిపోతుంది. శివకేశవులకు నైవేద్యంగా సమర్పించిన పండ్లను దానం ఇవ్వాలి. ఇంటికి ఈశాన్యం దిక్కులో సాయం సంధ్య వేళ ధనలక్ష్మీ దేవి ప్రీతి కోసం ఆవునేతితో దీపం వెలిగించి ఆ ప్రమిదలో కుంకుమ పువ్వు, పచ్చ కర్పూరం వేసి నమస్కరిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. సోమావతీ అమావాస్య నాడు పేద పిల్లలకు అన్నదానం చేస్తే అనంత కోటి పుణ్య ఫలం లభిస్తుందని వేదవ్యాస మహర్షి చెప్పారు. నల్ల చీమలకు పంచదార కలిపిన పిండిని ఆహారంగా పెట్టడం వలన జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి, కుటుంబంలో ఐక్యత వృద్ధి చెందుతుంది.
సోమావతి కథ
ఒకానొక ఊరిలో ఓ సాధువు ఓ వ్యాపారి ఇంటికి వస్తూ వుండేవాడు. ఆయన ఒకనాడు వచ్చినప్పుడు ఆ ఇంట్లోని పెళ్లికాని ఓ కన్యను ముఖం చూసి దీవించకుండానె వెళ్లిపోయాడు. సాధువు దీవించకుండా వెళ్లడానికి కారణం తెలియక ఆ కుటుంబం.. జ్యోతిష్యుడిని సంప్రదిస్తుంది. ఈ క్రమంలో ఆ కన్య జాతకం చూసిన జ్యోతిష్యుడు.. ఈమెకు వివాహం జరిగితే భర్త అనతి కాలంలోనే మరణిస్తాడు. ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుందని చెప్పాడు. అది విని దిగ్భ్రాంతి చెందిన కుటుంబీకులకు ఆ జ్యోతిష్యుడు పరిష్కారం కూడా చెప్తాడు.
సింఘాల్ ప్రాంతంలోని ఓ చాకలి స్త్రీ వద్ద కుంకుమ అడిగి నుదుటన ధరిస్తే కన్యకు దోషం పోతుందంటాడు. ఇదే తరహాలో చాకలి స్త్రీ వద్దకు చేరుకున్న ఆ కన్య సోమావతి అమావాస్య రోజున ఆమె వద్ద కుంకుమ పొందుతుంది. ఆపై రావిచెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేసింది. ఆమె జాతక దోషం కూడా అంతటితో తొలగిపోతుంది. అందుకే సోమావతి అమావాస్య రోజున శివాలయాల్లో వుండే రావిచెట్టు వెంట 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలుండవు.
2024: డిసెంబర్ 30.
Comments
Post a Comment