హిందూ సంప్రదాయం ప్రకారం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు తప్పనిసరిగా భర్త పాటించాల్సిన ఆచారాలు కొన్ని ఉన్నాయి.
అవేంటంటే.. భార్య కోరిన కోరికలు తీర్చాలట. అలాగే భార్య సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాడట.భార్య గర్భవతి అయినప్పటి నుంచి బిడ్డను ప్రసవించే వరకూ పొరపాటున కూడా సముద్రయానం చేయడం కానీ.. సముద్రంలో స్నానం చేయడం వంటివి చేయకూడదట.
అలాగే కట్టెలు కొట్టడం కానీ చెట్లను నరకడం కానీ చేయకూడదట.
అలాగే భార్య గర్బవతి అయిన నాటి నుంచి కటింగ్ చేయించుకోకూడదట.
భార్యకు 8 నెలలు వచ్చినప్పటి నుంచి షేవింగ్ కూడా చేసుకోకూడదు.
మృతదేహాన్ని మోయడం.. శవం వెంట నడవడం వంటివి కూడా చేయకూడదు.
గర్భిణి విదేశీ పర్యటనలు చేయడం.. భార్యను విడిచిపెట్టి భర్త కూడా దూర ప్రయాణాలు చేయకూడదు.
7 నెలలు దాటినప్పటి నుంచి తీర్థయాత్రలకు వెళ్లడం.. తలనీలాలు సమర్పించడం వంటివి చేయకూడదు.
పూర్తిగా పండని పండ్లు, విచ్చని పూలు కోయకూడదు.
భార్య గర్భిణిగా ఉన్నప్పుడు మనం చెప్పిన ఆచారాలన్నింటినీ తప్పక పాటించాలట. గ్రామాల్లో అయితే కొన్ని ఆచారాలు నేటికీ పాటిస్తున్నారు.
Comments
Post a Comment