దక్షయజ్ఞ విధ్వంసం, సతీవియోగం తరువాత పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా అవతరించాడు అని స్థల పురాణం. పన్నెండు సంవత్సరాలపాటు శివుడు తపసు చేసిన ప్రదేశం ఇది.
కోటప్పకొండను త్రికూటాచలమని, త్రికూటగిరి అని పిలుస్తారు. ఈ పర్వతం పై మూడు శిఖరాలు త్రిమూర్తులకు సంకేతాలు. రుద్రశిఖరం పై దక్షిణామూర్తి యోగనిష్ఠాలో దేవతలకు జ్ఞానమార్గని బోధించాడు. బ్రహ్మ, విష్ణువులు పర్వతాల పై శివదీక్ష చేపట్టగా వాటికీ బ్రహ్మగిరి, విష్ణుగిరి అని పేర్లు వచ్చాయి.
ఆనందవల్లి అనే భక్తురాలు త్రికోటేశ్వరుని విశేషంగా ఆరాధించి, స్వామి అనుగ్రహానికి పాత్రురాలు అయింది. ఆమె నిత్యపూజకు ఆటంకం ఏర్పడినందు వల్ల కోటప్పకొండ పై కాకి సంచరించకుండా శపించింది. నేటికీ ఈ ప్రాంతంలో కాకులు ఉండవు. ఆనందవల్లి కోరిక మేరకే బాలదక్షిణమూర్తి, బ్రహ్మశిఖరం పై విచ్చేశాడు అని కధనం.
1587 అడుగులు ఉన్న కోటప్పకొండ పై 660 అడుగుల ఎత్తులో త్రికూటేశ్వర ఆలయం మహోన్నతంగా వెలుగొందుతోంది.
Comments
Post a Comment