అనంతపురం నగరంలో ఫస్టురోడ్డులో రైల్వేస్టేషన్ ఎదురుగా గల శ్రీ కాశీ విశ్వేశ్వర మరియు కోదండ రామాలయం చూపరులకు కనువిందు చేస్తున్నది.
ఇది నగరం నడిబొడ్డులో దేదీప్యమానంగా వెలుగొందుతున్నది.
కాశీవిశ్వేశ్వర శివలింగాన్ని, సీతాలక్ష్మణ మారుతి సమేత శ్రీరామచంద్రుని విగ్రహాలను 1923వ సంవత్సరములో ప్రతిష్టించారు.
శివ పంచాయతనం ఈ ఆలయం ప్రత్యేకత. మధ్య భాగంలో కాశీ విశ్వేశ్వర స్వామి నైఋతి దిశలో గణపతి, వాయువ్యంలో పార్వతీ దేవి, ఈశాన్యంలో శ్రీమహా విష్ణువు, ఆగ్నేయంలో సూర్యుడు కన్నుల పండుగగా దర్శనమిస్తారు.
అయ్యప్ప స్వామి మందిరం
శ్రీశారదాదేవి, శ్రీశంకరాచార్యులు, శ్రీత్యాగరాజస్వాముల మందిరం
ఆంజనేయస్వామి మందిరం
శ్రీకృష్ణ మందిరం
వినాయక స్వామి మందిరం ఈ ప్రాంగణంలో ఉపాలయాలు
కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో విశేషపూజలు జరుగుతాయి. ఆశ్వయుజ మాసంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో శ్రీశారదా దేవి ఆరాధనోత్సవాలు ఆరాధన వైభవంగా జరుగుతుంది.
ప్రతి సంవత్సరం పుష్యశుద్ధ పంచమినాడు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు నిర్వహించబడతాయి.
నాగుల చవితి నాడు అశేష భక్తజన సందోహం, అశ్వత్థ నారాయణస్వామిని దర్శించి సేవిస్తారు.
మహాశివరాత్రి నాడు నాలుగు జాములలో రుద్రభిషేకాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేక, గిరిజా కళ్యానోత్సవ, వసంతోత్సవాలు జరుగుతాయి.
ప్రతి మాసంలోను కృష్ణచతుర్దశి నాడు సాయంకాలం శ్రీసంకష్టహర గణపతి వ్రతం కూడా జరుపబడుతున్నది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.
కార్తీక మాసంలో ప్రతి సోమవారం అభిషేకాలు, నిత్యాభిషేకాలు కన్నుల పండుగగా జరుగుతాయి. కార్తీక పౌర్ణమి నాడు విశేషాభిషాకాలు, లక్ష్మీ దీపారాధనలు వైభవోపేతంగా నయనానందాన్ని కలిగిస్తాయి. ఈ మాసంలో భక్తులు నిండు భక్తితో లక్షబిల్వార్చన, లక్ష దీపారాధనలు అమోఘంగా చేస్తారు.
వైకుంఠ ఏకాదశి పండుగనాడు కొత్తగా నిర్మించబడ్డ వైకుంఠ ద్వార ప్రవేశం భక్తజనులకు కల్పించబడింది.
కరువు కాటకాలు సంభవించినప్పుడు ఈ దేవస్థానంలో విరాట పర్వపారాయణం, వరుణయాగం, కుంభాభిషేకం చేయించడం ఒక అనవాయితి.
Comments
Post a Comment