సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం.సూర్యుడు ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి ప్రవేశించాడని సంక్రమణం అని అంటారు.అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.
తెలుగువారి పండుగ, ముఖ్యంగా ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి.ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఈ సంక్రాంతి పండుగను కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు,కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు జరుపుకుంటారు.
నిజానికి ధనుర్మాసారంభంతో నెలరోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతాయి.
- ఈ పండుగకు రైతుల ఇంటికి ధనధాన్యరాశులు చేరతాయి.
- పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహప్రాంగణాలతో, ఇళ్ళు లోగిళ్ళు ఒక నూతన వింత శోభ సంతరించుకుంటాయి.
- ఈ పండుగకు నవసొబగులు తీసుకురావడానికి పది రోజుల ముందే ఇళ్ళకు సున్నాలు, రంగులు వేయడం సాంప్రదాయం.
- సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే లేచి, పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
- గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరమును ముగ్గులతో అలంకరించుకోవాలి.
- ఈ రోజున కుటుంబంలోని వ్యక్తులు నూతన దుస్తులు ధరించి, ఇష్ట దైవాలకు పూజలు చేసి, కొత్తగా ఇంటికి వచ్చిన ధాన్యంతో తయారు చేసిన పొంగలి వంటి సాంప్రదాయ ఆహారాలు నైవేద్యం పెట్టి, తాము తింటారు.
- మకర సంక్రాంతి పుణ్యదినాన దానధర్మాలు చేయడం ద్వారా జన్మజన్మల దరిద్ర బాధలు తొలగిపోతాయని విశ్వాసం.
- సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు, పసుపు, కుంకుమ, పండ్లను దానం చేయడం ద్వారా సకలసంపదలతో పాటు దీర్ఘసుమంగళీ ప్రాప్తం లభిస్తాయి.
తెల్లవారు జాముననే హరిదాసు హరినామ సంకీర్తనలు, సాతాని జియ్యర్లు, జంగపు దేవరలు, బుడబుక్కల దొరలు, పంబల వాండ్లు, బైనాయుడులు, గంగిరెద్దుల వాళ్ళు ఇంటింటికీ తిరుగు తుంటారు. వారి వారి తీరులలో భక్తి గీతాలు పాడుతూ ఏడేడు జన్మలలో మన ఇళ్ల పెద్దలకు పుణ్యలోకాలు ప్రాప్తించాలని దీవెనలు ఇస్తుంటారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు కొన్ని కొన్ని వ్రతాలను ఆచరించడం చేస్తారు. వాటిలో గొబ్బి గౌరి వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని భోగినాడు ప్రారంభిస్తారు. ధనుర్మాసం నెల పెట్టింది.. మొదలు సంక్రాంతి పండుగ వరకు ప్రతి ఇంటి లోగిలి రకరకాల ముగ్గులతో ముచ్చటగా కనిపిస్తుంది.
జగద్గురువు ఆది శంకరాచార్యుడు ఈ రోజునే సన్యాసం స్వీకరించాడు.
2025: జనవరి 14.
Comments
Post a Comment