1. ఉదయం నిద్రనుండి లేచినపుడు కుడి ప్రక్కకు తిరిగి లేవండి ఆరోగ్యం.
2. లేచిన వెంటనే రెండు అరచేతులు చూస్తూ॥ కరాగ్రే వసతేలక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేస్థితే గౌరి ప్రభాతే కరదర్శనం" అని అనుకోండి.
3. కుడికాలు మంచంమీద నుండి క్రింద పెడుతూ “సముద్ర వసనేదేవి పర్వతస్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శక్షమస్వమే” అని భూమాతకు నమస్కరించండి
4. లేచిన వెంటనే కప్పుకున్న దుప్పటిని, ప్రక్క బట్టలను అన్నింటినీ చక్కగా మడతపెట్టండి. తదుపరి కాలకృత్యాలు పూర్తి చేయండి.
5. ఉదయాన్నే ముందురోజు రాత్రి రాగిపాత్రలో పోసిఉంచిన నీరు త్రాగండి.
6. వ్యాయామం (నడక) కనీసం ఉదయం 9 ని॥ల నడవండి.
7. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి సర్మడే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అనుకుంటూ చన్నీటి స్నానం చేయండి.
8. సూర్యునకు ఎదురుగా గాని, నడుస్తూగాని దంతధావన చేయరాదు.
9. మూత్రవిసర్జన సూర్య, చంద్రులకు ఎదురుగా చేయరాదు.
10. స్నానానికి చన్నీటి స్నానం ఉత్తమమైనది.
11. తెల్లవారు ఝామున
4-5 గంటల మధ్య చేసే స్నానం ఋషి స్నానం
5-6 గంటల మధ్య చేసే స్నానం దైవ స్నానం
6-7 గంటల మధ్య చేసే స్నానం మానవ స్నానం
7-8 గంటల మధ్య చేసే స్నానం రాక్షస స్నానం
12. చన్నీటి స్నానం శిరస్సు తడుపుకొని ప్రారంభించాలి. వేడినీటి స్నానం పాదములు తడుపుకొని ప్రారంభించాలి.
13. సముద్ర స్నానం చేసేముందు చన్నీటి స్నానం చేసి వెళ్ళిలి. ఆ తర్వాత సముద్ర స్నానం చేసిన తర్వాత మరల చన్నీటి స్నానం చేయాలి.
14. సముద్ర స్నానం చేయునపుడు బయట మట్టిని లోపలవేయాలి.
15. నదులు, కాలువలయందు, స్నానం చేయునపుడు లోపలి మట్టిని ముమ్మారు బయట వేయాలి.
16. స్నానము చేసేటపుడు మౌనముగా ఉండాలి. లేనిచో తేజస్సు హరించును.
17. శిరస్నానానంతరం (శిర స్నానం చేసిన తర్వాత) ముందుగా ముఖము, తర్వాత వక్షస్థలము, తుడుచుకొని ఆ తర్వాత శిరస్సు తుడుచుకోవాలి. ముందుగా శిరస్సు తడుచుకొనిన ధరిద్రం సంభవించును.
18. పురుషుడు వస్త్రము కట్టుకొని స్నానం చేయాలి. స్త్రీ దిగంబరంగా స్నానం చేయవచ్చును.
19. స్త్రీలు స్నానం చేయునపుడు జుట్టు ముడి వేసుకోవాలి. లేనిచో దేహం పిశాచ గ్రస్తమగును.
20. స్నానం ఎక్కువ సమయం చేయాలి. భోజనం తక్కువ సమయంలో ముగించాలి.
21. సుమంగళీ స్త్రీలు నీటిలో తలముంచి స్నానం చేయరాదు. దోసిలితోగాని, పాత్ర (చెంబు) తోగానీ నీటిని తలపై పోసుకొనవలెను.
22. శిరస్నానం చేసి వస్త్రం ధరించిన తర్వాత తల నుండి నీరు కార కూడదు. కాలినవస్త్రం, పశువులు నమిలిన వస్త్రం, చినిగిన వస్త్రం ధరించరాదు.
23. బొట్టులేని భార్య ముఖమును భర్త చూడరాదు.
24. నుదుట తిలకమున్నచో ప్రజ్ఞాశీలి, పరోపకారి, భూస్వామి అగును. అది కనుబొమల మధ్య ఉన్నచో విశేష ఆయుర్ధాయం కలుగును. కావున స్త్రీ పురుషులు నుదుట ముఖమున బొట్టు లేకుండా ఉండరాదు.
25. తడి బట్టతో పూజచేయరాదు. అది మడి అని తలచుట పొరపాటు, తడిబట్ట దిగంబరత్వంతో సమానం. చూపుడు వ్రేలితో బొట్టుపెట్టు కొనరాదు. కనుబొమల మధ్య జ్ఞాననేత్రం ఉంటుంది. దానికి గుర్తుగా కుంకుమ ధరించాలి.
26. భోజనానికి చివరలేని అరటిఆకు వాడరాదు. అది చర్మముతో సమానం.
27. భార్య, భర్తలు కలసి భుజించరాదు. (తన వివాహ సమయంలో తప్ప)
28. ఉత్తర దిశగా కూర్చుని భోజనం చేయరాదు.
29. భోజనం చేయు కంచంలో (పాత్ర) కనీసం కరక్కాయంత అన్నమైనా వదలాలి.
30. కోపంతోగాని, ఏడుస్తూగానీ భోజనం చేయరాదు.
31. భార్య భోజనం చేయుచుండగా, తుమ్ము చుండగా, ఆవులించు చుండగా, సుఖముగా కూర్చుని ఉండగా, కాటుక పెట్టుకొను చుండగా, దిగంబరముగా ఉండగా, ప్రసవించు చుండగా భర్త చూడరాదు.
32. భోజనం చేసిన తర్వాత, తినిన కంచం తొలచిన నీళ్ళు ఉత్తర దిశగా గానీ, తూర్పు దిశగాగానీ పోయవలెను.
33. రాత్రివేళ ఇల్లు ఊడ్చుట, కడుగుట, వాకిళుళ ఊడ్చుట, నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టుట చేయరాదు.
34. రాత్రులయందు పెరుగు వేసుకొని భుజించరాదు. (ఆయుక్షీణం) పెరుగును చేతితో చిలకరాదు. రాత్రి పాలు వేసుకుని తినవలెను.
Comments
Post a Comment