శ్రీశైలం భూమండలానికి కేంద్రస్థానం. ఇది జ్యోతిర్లింగక్షేత్రమే కాదు, అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరవది కూడా. ఇక్కడ సతీదేవి శరీరభాగాల్లో కంఠభాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. మల్లికార్జునస్వామివార్కి పశ్చిమభాగంలో వెనుకవైపు అమ్మవారు కొలువై ఉంది. స్కాందపురాణాంతర్గతమైన శ్రీశైలఖండంలో ఈ అమ్మవారి విశేషాలు దాదాపు 20 అధ్యాయాలతో భ్రమరాంబికోపాఖ్యానం పేరుతో ఉన్నాయి. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు తనకు సకల దేవ, యక్ష, గంధర్వ, పురుష, స్త్రీ, మృగ, జంతుజాలంతో మరణం కలుగరాదని బ్రహ్మతో వరం పొందాడు. వరగర్వంతో భక్తులు సకలలోకాలవారినీ హింసించసాగాడు. దీంతో అందరూ అమ్మవారిని శరణు వేడుకున్నారు. అప్పుడు అమ్మవారు భ్రమరరూపం ధరించి అరుణాసురుణ్ణి సంహరించి లోకాలను కాపాడింది. అరుణాసురసంహారం తరువాత భక్తుల విన్నపంతో శ్రీగిరిపై స్థిరంగా వెలిసింది. అమ్మవారి మూలమూర్తి స్థితరూపంలో (నిలుచుని) ఎనిమిది చేతులతో కుడివైపు చేతులలో త్రిశూలం, చురకత్తి, గదా, ఖడ్గం వంటి ఆయుధాలు, ఎడమవైపు మహిషముఖాన్ని బంధించి, విల్లు, డాలు, పరిఘలను ధరించి ఎడమకాలిని మహిషం (దున్నపోతు) వీపుపై అదిమిపెట్టిత్రిశూలంతో కంఠభాగంలో పొడుస్తూ మహిషాసురమర్దిని వలె కనిపిస్తుం...
Comments
Post a Comment