Udupi Temple Annaprasadam: అన్నబ్రహ్మ క్షేత్రం - ఉడిపి


  • ఉడుప అంటే చంద్రుడు, వెన్నల అని అర్ధం.
  • శివునికోసం చంద్రుడు తపస్సు చేసిన ప్రదేశం ఉడుపి. కాలక్రమంలో ఉడిపి అయింది.
  • పేరుకు తగ్గట్టు ఈ పవిత్ర క్షేత్రం స్వచ్ఛముగా వెన్నెలలో ప్రకాశించే చంద్రుడులా ఉంటుంది.
  • శ్రీ మద్వాచార్యులు రాకతో ఈ క్షేత్ర వైభవం పతాకస్థాయికి చేరింది.
  • ఉడిపి అన్నబ్రహ్మ క్షేత్రం అని అంటారు.
  • తిరుమల వెంకటేశ్వర స్వామిని కాంచన బ్రహ్మ అని వ్యవహరిస్తారు.
  • పండరీపుర పాండురంగ స్వామిని నాదబ్రహ్మగా పిలుస్తారు.
  • ఉడిపి అన్నబ్రహ్మ క్షేత్రంలో శతాబ్దాలుగా ఉచిత అన్నదానం భక్తులకు లభిస్తుంది.
  • ఈ భోజనశాలలో ఒక్కో బంతికి ఐదు వందల మంది వరకు భోజనం చేయవచ్చు.
  • అలాగే ఆలయం బయట ఉన్న మరో అన్నక్షేత్ర భవనంలో మూడు అంతస్తులలో ఒక్కో భోజనశాలలో ఒక్కో బంతికి 1400 మంది వరకు ఒక్కేసారి అన్నప్రసాదాన్ని స్వీకరించే సదుపాయం ఉంది.
  • 1915 సంవత్సరంలో అప్పటి పీఠాధిపతి ఈ ఉచిత అన్నదానాన్ని విస్తృతంగా అమలు చేసారు.
  • ప్రతి రోజు సగటున 30 వేల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు.
  • మకర సంక్రాంతి, మద్వనవమి, హనుమాన్ జయంతి, శ్రీకృష్ణ అష్టమి, నవరాత్రులు, మధ్వ జయంతి, విజయదశమి, నరక చతుర్దశి, దీపావళి, గీత జయంతి వంటి పండుగలను ఈ క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుపుతారు.ఈ సందర్భంగా ఉడిపికి లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు.
  • ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 .30 గంటల  వరకు, రాత్రి 8 గంటల నుంచి 9.30 గంటల వరకు భక్తులకు అన్నబ్రహ్మ భోజనశాలలో ఉచిత భోజనం లభిస్తుంది.
  • శ్రీకృష్ణ భగవానుడికి నైవేద్యంగా సమర్పించి తరువాత భక్తులకు వడ్డిస్తారు. 
  • ఈ అన్నప్రసాదంలో అన్నం, కూర, సాంబారు, రసం, మజ్జిగ , ఒక తీపి పదార్ధం వడ్డిస్తారు. 
  • అందరికి అరటి ఆకులలో భోజనం వడ్డించడం ఇక్కడ ప్రతేక్యత. 

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి