షిరిడి లో శ్రీ సాయిబాబా వారు జీవించి ఉన్న కాలం నుంచి ఇప్పటి వరకు షిరిడిలో అన్నదానం ఒక యజ్ఞంగా సాగుతోంది.
- షిరిడి సాయి ప్రసాదం ఎన్నో జన్మల పుణ్యఫలం.
- 2007 వరకు సాయి ప్రసాదాలయ సాధారణంగానే ఉండేది.భక్తుల రద్దీ పెరగడంతో షిర్డీ సాయి సంస్థాన్ కొత్త ప్రసాదాలయ నిర్మించింది.
- 7 ఎకరాల భూమిలో 11 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మహాభవనాన్ని నిర్మించారు.
- 2001 లో తొలిసారి సౌరశక్తితో మూడువేలమందికి కావాల్సిన భోజనం తాయారు చేసేవారు.
- షిరిడి ప్రసాదాలయంలో 73కి పైగా సౌరశక్తిని ఉత్త్పతి చేసే డిష్ లున్నాయి.ఇవి అన్నీ సూర్యగమనం ఆధారంగా కదులుతూ సౌర్యవిద్యుత్ ఉత్త్పతి చేస్తాయి.
- ఇలా చేయడం వల్ల సంస్థాన్ కి ఒక సంవత్సరానికి 30 లక్షల వరకు ఆదా అవుతుంది.
- రోజు 600 నుంచి 800 కిలోల వరకు కూరగాయల్ని ఉడికిస్తారు. అదే పర్వదినాల్లో అయితే ఈ సంఖ్య 1000 నుంచి 1200 కిలోల వరకు ఉంటుంది.
- రోజుకి 40 నుంచి 50 వేల మందికి సరిపడే చపాతీలు షిరిడి ప్రసాదాలయాలో తయారు అవుతున్నాయి.
- ఒక గంటకు రెండువేల చపాతీలు ఆధునిక యంత్రాల ద్వారా తయారు చేస్తున్నారు.ఒక రోజుకు 6 నుంచి 7 వేల కిలోల గోధుమ పిండి ఖర్చుఅవుతుంది. గంటకు 30 వేల చపాతీలు చేసే సామర్థ్యం ఈ ప్రసాదాలయంలో వుంది.
- ఉదయం అయిదు గంటల నుంచే ఇక్కడ పనులు ప్రారంభం అవుతాయి.
- ప్రసాదాలయంలో భోజనం అత్యంత శుచిగా, శుభ్రంగా ఉంటుంది.
- ప్రసాదాలయంలో రోజు లక్ష లడ్డులు ప్రసాదం కోసం తయారు చేస్తారు.
- ప్రసాదాలయంలో వంటలు బాబా చరణాలకు సమర్పించిన తరువాతే భక్తులకు ప్రసాదంగా వడ్డిస్తారు.
- ఒకే సారి సుమారు నాలుగువేల మంది భోజనం చేసే అవకాశం వుంది.
- రోజుకు 50 వేలకు పైగా భక్తులు భోజనం స్వీకరిస్తారు.పర్వదినాల్లో అయితే లక్ష వరకు ఉంటుంది.
- రోజు 300 మంది ఇక్కడ పని చేస్తారు.
సాయిబాబా సమాధి మందిరానికి సుమారు 700 మీటర్ల దూరంలో ప్రసాదాలయం వుంది.
ప్రసాదాలయం వేళలు : ఉదయం 10 నుంచి రాత్రి 10 ,11 వరకు విరామం లేకుండా అన్నప్రసాద వితరణ జరుగుతుంది.
Comments
Post a Comment