రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర జరగనుంది. వినాయక చవితి పూర్తయిన రెండు వారాలకు పోలేరమ్మ అమ్మవారి జాతర నిర్వహించడం ఆనవాయితీ. రెండు రోజులపాటు జరిగే ఈ జాతరకు వెంకటగిరిలోని ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నా స్వస్థలాలకు చేరుకుంటారు. దేశ విదేశాలనుంచి కూడా ఆ రెండురోజుల ఉత్సవాలనూ చూసేందుకు స్థానికులు తరలి వస్తారు.
2024 ముఖ్య తేదీలు
సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం మొదటి చాటింపు ఉంటుంది
సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం రెండో చాటింపు ఉంటుంది.
సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం ఘటోత్సవం నిర్వహిస్తారు.
సెప్టెంబర్ 26వ తేదీ గురువారం అమ్మవారి ఉత్సవం జరుపుతారు
సెప్టెంబర్ 26వ తేదీ గురువారం అమ్మవారి నిలువు, నిష్క్రమణం, నగరోత్సవంతో జాతర ముగుస్తుంది.
జాతర తొలిరోజు రాత్రి అమ్మవారి మట్టి ప్రతిమను తయారు చేస్తారు, ఆ తర్వాత అమ్మగారింటినుంచి అత్తగారింటికి ఆ ప్రతిమను తీసుకొస్తారు. అక్కడ బుక్క చుక్క పెట్టి అమ్మవారి మూర్తిని దర్శనాలకు అనుమతిస్తారు. అత్తగారింటి నుంచి పోలేరమ్మ ఆలయానికి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఉంచుతారు. ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. అర్థరాత్రి ఈ తంతు అంతా జరుగుతుంది. అనంతరం తెల్లవారి నుంచి దర్శనాలు మొదలవుతాయి. సాయంత్రం వరకు ప్రజల సందర్శనార్థం అమ్మవారి విగ్రహాన్ని ఆలయం ముందు ఉంచుతారు. ఆ తర్వాత ఊరేగింపు చేసి అమ్మవారి విగ్రహాన్ని విరూపణం చేస్తారు. అంటే విగ్రహాం నుంచి మట్టిని తీసి వేస్తారు. ఆ మట్టిని పవిత్రంగా భక్తులు తమ ఇళ్లలో దాచుకుంటారు. అమ్మవారి విరూపణంతో జాతర ముగుస్తుంది.
Comments
Post a Comment