- తొలిరోజునే అఖండ దీపం వెలిగించాలి.
- ఉదయవేళలోనే దీపారాధన, కలశస్థాపన చేయాలి.
- రాత్రిపూట పూజలు చేసేవారు కూడా తొలిరోజు ఉదయవేళలోనే దీపారాధన, కలశస్థాపన చేయవలసి ఉంటుంది.
- అఖండ దీపారాధనలో రెండు పెద్ద ప్రమిదలు తీసుకుని ఒకదానిలో ఒకటి ఉంచాలి. అందులో మూడు వత్తులు వేయాలి.
- దీపాన్ని తూర్పు వైపు వెలిగే విధంగా పెట్టాలి. దీపం తూర్పు వైపు వెలిగితే శాంతి చేకూరుతుంది. ఉత్తరం వైపు ధనధాన్యవృద్ధి కలుగుతుంది.
- పడమటివైపు శత్రుపీడ, అనారోగ్యం కలుగుతాయి. దక్షిణం వైపు పెట్టే దీపాన్నియమ దీపం అని పిలుస్తారు. మొత్తంమీద తూర్పు ఉత్తరం దిక్కులలో దీపాన్ని వెలిగేలా ఉంచితే విధాలా మంచిది.
- దీక్ష కొనసాగినన్ని రోజులూ అఖండదీపం కొండెక్కకుండా చూసుకోవాలి.
- రాత్రింబవళ్లు దీపాన్ని చూసుకుంటూ ఉండడం కష్టం అనుకునేవారు అఖండ దీపాన్ని వెలిగించకపోవడం మంచిది.
- ప్రతివారూ తప్పనిసరిగా అఖండదీపం వెలిగించాలన్న నియమం లేదు.
- ప్రతిసారి పూజా ప్రారంభంలో దీపారాధన చేసినా సరిపోతుంది.
Comments
Post a Comment