- ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దేవి నవరాత్రుల పూజను ప్రారంభించాలి అని శాస్త్రం చెబుతోంది.
- ఆలా వీలుకానివారు తదియ, పంచమి, సప్తమి రోజునుండి దేవీపూజను ప్రారంభించవచ్చు.
- దేవీ పూజలో భక్తితో పాటు నియమనిష్టలను పాటించడం ఎంతో అవసరం
- ఈ నవరాత్రి పూజను కలశస్థాపన చేసి ప్రారంభించాలి.
- ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి, తలంటు స్నానం చేసి శుద్ధమైన వస్త్రాలు ధరించి అమ్మవారిని విధివిధానంగా పూజించాలి.
- సాయంకాలం కూడా అమ్మవారిని శాస్త్రబద్ధంగా పూజించడం తప్పనిసరి.
- దీక్షాకాలంలో ఒక్కపూటనే భోజనం చేసి, ఏకభుక్త వ్రతాన్ని ఆచరించాలి.
- అది సాధ్యంకాని వారు మధ్యాహ్నం అల్పాహారాన్ని స్వీకరించి, రాత్రి భోజనం చేయవచ్చు.
- దేవీ నవరాత్రులలో అవకాశం వున్నవారు కుమారీ పూజ, సువాసిని పూజ, దంపతి పూజ చేసుకోవడం శుభప్రదం.
- కుమారీపూజలో 2 నుండి 8 యేళ్ళ వయసుగల బాలికలను జగన్మాతగా భావించి పూజిస్తారు.
- అలాగే సువాసినీ పూజలో ముత్తైదువులను, దంపతి పూజలో దంపతులను పూజించాలి.
- ఈ నవరాత్రి పూజలో ఆయా రోజులందు ఆయా అమ్మవారి రూపాలు విధివిధానంగా పూజించడం సంప్రదాయం.
అమ్మవారికి పుష్ప అలంకరణలు
పాడ్యమి నాడు - మల్లెలమాల, బిల్వదళమాలతో
విదియ నాడు - జాజి పూలదండ , తులసిదళమాలతో
తదియ నాడు - సంపంగి పూలమాల లేదా మరువం దండతొ
చవితి నాడు - జాజి పూలమాల లేదా చిలకాకుపచ్చ రంగు మాలతో
పంచమి నాడు - పారిజాత కుసుమాల లేదా బూడిదరంగు ఆకూ మాల
షష్ఠి నాడు - మందార మాల లేదా గంధపు ఆకుమాలతో
సప్తమి నాడు - మొగలిపూలదండ లేదా తుమ్మిఆకుల దండతొ
అష్టమి నాడు - గులాబీమాల లేదా పన్నిరాకుల మాల
నవమి నాడు - మరువ,దావన ఆకుల మాలతో నేరేడు ఆకుల మాలతో అమ్మవారిని అలంకరించాలి .
2024: అక్టోబరు 03 నుండి అక్టోబరు 12 వరకు
Comments
Post a Comment