Theerthams in Tirumala: తిరుమలగిరులలో 66 కోట్ల తీర్థాలు..



అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవంగా శ్లాఘించబడే శ్రీ వేంకటేశ్వరస్వామి శేషపర్వతం యొక్క ముఖభాగాన్ని వేంకటాద్రి అని, మధ్యభాగాన్ని నృసింహాద్రి అని, వెనుక భాగాన్ని శ్రీశైలంగా పురాణాలు అభివర్ణిస్తున్నాయి.

ఈ శేషగిరులు అనేకానేక వృక్షసంపదకు, జీవసంపదకు, జంతుకోటికి ఆలవాలమే కాకుండా అనేకానేక పుణ్యతీర్థాలు కలిగి జలసంపదకు కూడా నిలయంగా ఉంటుంది. 

తిరుమలగిరులలో 66 కోట్ల తీర్థాలు!

”పుణ్యతీర్థ” మనగా శుభము కలుగజేయు జలమని భావం. అట్టి పుణ్యతీర్థములు తిరుమల పర్వతశ్రేణుల్లో 66 కోట్లున్నవని బ్రహ్మపురాణం, స్కంధపురాణము తెలుపుచున్నవి.

అయితే ఈ తీర్థములను ధర్మరతి, జ్ఞాన, భక్తి వైరాగ్య, ముక్తిప్రద తీర్థములు నాలుగుగా విభజించడమైనది. వీనిలో ముఖ్యమైనవి ఈ విధంగా ఉన్నాయి.

ధర్మరతిప్రద తీర్థములుః-

ఈ తీర్థముల దగ్గర నివసించిన లేక స్నానమాచరించిన లేక సేవించిన ధర్మాసక్తి కలుగునని పురాణములు తెలుపుచున్నవి. వీటి సంఖ్య 1008 గా నిర్దేశించడమైనది.

జ్ఞానప్రద తీర్థములుః-

ఈ తీర్థ జలములను సేవిస్తే జ్ఞానయోగం ప్రాప్తి కలుగునని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఇవి 108 కలవు. అవి

 1.⁠ ⁠మను తీర్థము 2. ఇంద్ర 3. వసు 4. రద్ర(11) 5. ఆదిత్య (12) 27. ప్రజాపతి (9) 36. అశ్విని 37. శుక్ర 38. వరుణ్‌ 39. జాహ్నవి 40. కాపేయ 41. కాణ్వ 42. ఆగ్నేయ 43. నారద 44. సోమ 45. భార్గవ 46. ధర్మ 47. యజ్ఞ 48. పశు 49. గణేశ్వర 50. భౌమాశ్వ 51. పారిభద్ర 52. జగజాడ్యహర 53. విశ్వకల్లోల 54. యమ 55. బ్బారస్పత్య 56. కామహర్ష 57. అజామోద 58. జనేశ్వర 59. ఇష్టసిద్ధి 60. కర్మసిద్ధి 61. వట 62. జేదుంబర 63. కార్తికేయ 64. కుబ్జ 65. ప్రాచేతస (10) 75. గరుడ 76. శేష 77. వాసుకి 78. విష్ణువర్థన 79. కర్మకాండ 80. పుణ్యవృద్ధి 81. ఋణవిమోచన 82. పార్జన్య 83. మేఘ 84. సాంకర్షణ 85. వాసుదేవ 86. నారాయణ 87. దేవ 88. యక్ష 89. కాల 90. గోముఖ 91. ప్రాద్యుమ్న 92. అనిరుద్ధ 93. పిత్రు 94. ఆర్షేయ 95. వైశ్వదేవ 96. స్వధా 97. స్వాహా 98. అస్థి 99. ఆంజనేయ 100. శుద్ధోదక 101. అష్ట భైరవ (8) – మొత్తం 108 తీర్థములు.

భక్తి వైరాగ్యప్రద తీర్థములుః-

 ఇవి జ్ఞానపద తీర్థములకన్నా శ్రేష్టమైనవిగా తెలుపబడుచున్నది. ఈ తీర్థములను సేవించిన పాపపరిహారము, సంసార వైరాగ్యము, దైవభక్తి ప్రాప్తించునని ప్రశస్తి. ఇవి మొత్తం 68 తీర్థములు అవి ఏవనగా …..

 1.⁠ ⁠చక్ర 2. వజ్ర 3. విష్వక్సేన 4. పంచాయుధ 5. హాలాయుధ 6. నారసింహ 7. కాశ్యప 8. మాన్మధ 9. బ్రహ్మ 10. అగ్ని 11. గౌతమి 12. దైవ 13. దేవం 14. విశ్వామిత్ర 15. భార్గవ 16. అష్టవక్ర 17. దురారోహణ 18. భైరవ, (పిశాచవిమోచనము) 19. మేహ (ఉదరవ్యాధి నాశనం) 20. పాండవ 21. వాయు 22. అస్థి (పునరుజ్జీవన సాధనము) 23. మార్కండేయు (ఆయువృద్ధి) 24. జాబాలి 25. వాలభిల్య 26. జ్వరహర (సర్వజ్వరనాశనం) 27.విషహర (తక్షక విషవ్యాధి నివారకం) 28. లక్ష్మి 29. ఋషి 30. శతానంద 31. సుతీక్షక 32. వైభాండక 33. బిల్వ 34. విష్ణు 35. శర్వ 36. శారభ 37 బ్రహ్మ 38. ఇంద్ర 39. భారద్వాజ 40. ఆకాశగంగ 41 ప్రాచేతస 42. పాపవినాశన 43. సారస్వత 44. కుమారధార 45. గజ 46. ఋశ్యశృంగ 47. తుంబురు 48. థావతారం(10) 58. హలాయుధ 59. సప్తర్షి(7) 66. గజకోణ 67. విశ్వక్సేన 68. యుద్ధసరస్థీ (జయప్రదాయకం) మొత్తం 68 తీర్థములు.

 ముక్తిప్రదములు ః- సర్వమానవకోటికి ముక్తి సాధనం కూర్చునవి ఈ తీర్థములు. ఇవి సర్వోత్కృష్టమైనవి. ఇవి మొత్తం ఏడు అవి …..

 1.⁠ ⁠శ్రీస్వామి పుష్కరిణీ 2. కుమారధార 3. తుంబురు 4. రామకృష్ణ 5. ఆకాశగంగ 6. పాపవినాశనం 7. పాండవ తీర్థం. దీనికి గోగర్భమని నామంకూడా కలదు.

1.⁠ ⁠శ్రీస్వామి పుష్కరిణీ తీర్థము ః- శ్రీవారి ఆలయానికి ఈశాన్యదిశలో ఉండే ఈ తీర్థం సర్వోత్కృష్టమైనదిగా, తీర్థరాజంగా శ్లాఘించబడుతున్నది. సాధారణంగా శ్రీవారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో, రధసప్తమి తదితర సందర్భాల్లో ఈ తీర్థస్నానం శుభదాయకమని చెప్పుచున్నా, ధనుర్మాసంలో శుద్ధ ద్వాదశి దినమున సూర్యోదయమున ఆరుఘడియల కాలం సర్వోత్తమమైనదిగా పురాణ ప్రశస్తి.

2.⁠ ⁠కుమారధార ః- కుంభమాసమునందు మఖానక్షత్రంతో కూడిన పౌర్ణమి పర్వదినము.

3.⁠ ⁠తుంబురు ః- మీన మాసమందు ఉత్తర పాల్గుణీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి అపరోహ్ణకాలం శుభదినం.

4.⁠ ⁠రామకృష్ణ ః- మకరమాస పుష్యమి నక్షత్రాయుత పౌర్ణమి.

5.⁠ ⁠ఆకాశగంగ ః- మేషమాస చిత్రానక్షత్రాయుత పౌర్ణమి.

6.⁠ ⁠పాపవినాశనం ః- ఆశ్వయుజ మాసమందు శుక్లపక్షమున ఉత్తరాఢ నక్షత్రాయుత సప్తమి ఆదివారం లేదా ఉత్తరాభాద్ర నక్షత్రాయుత ద్వాదశి.

7.⁠ ⁠పాండవ (గోగర్భం) ః- వృషభమాసమందు శుద్ధ ద్వాదశి ఆదివారము లేదా బహుళ ద్వాదశి మంగళవారం ఉభయయాత్ర సంగమకాలం పర్వకాలము. సంగకాలమనగా ఉదయం 6 ఘడియల నుండి 12 ఘడియల వరకు.

కాగా పై పోర్కొన్న ఈ తీర్థాలలో శ్రీస్వామి పుష్కరిణి, కుమాధార, తుంబురు, రామకృష్ణ తీర్థాలకు ప్రతి వత్సరం ముక్కోటి కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నది.

Comments

Popular posts from this blog

Puri Ratha Yatra: పూరీ జగన్నాధుని రథయాత్ర

Ashada Navratri 2025: ఆషాడ నవరాత్రి, వారాహి నవరాత్రి

Ashada Month 2025: ఆషాడ మాసం

Amrutha Lakshmi Vrat: అమృత లక్ష్మీ వ్రతం

Skanda Panchami: స్కంద పంచమి

Kamakshi Deepam: కామాక్షీ దీపం దాని వైశిష్ట్యం

Pandharpur Yatra 2025: పండరీపుర్ యాత్ర – భక్తి, ఐక్యతకు ప్రతిరూపం

Sharavana Putrada Ekadasi: పుత్రదా ఏకాదశి (పవిత్ర ఏకాదశి)

Srisailam Temple: శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం - శ్రీశైలం